ఫుల్‌ట్యాంక్‌తో 1200 km రేంజ్! Toyota Innova Hycross ఇప్పుడు కొంటే చవక!
Toyota Innova Hycross Mileage: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 52 లీటర్లు. దీనిని పూర్తిగా నింపి మీరు 1200 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు.

Toyota Innova Hycross Price And Features In Telugu: టయోటా ఇన్నోవా హైక్రాస్, తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన 7-సీటర్ హైబ్రిడ్ MPV (మల్టీ పర్పస్ వెహికల్). దీనిని SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) తరహాలో, ఆధునికంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. షార్ప్ LED హెడ్ ల్యాంప్స్, పెద్ద గ్రిల్, సొగసైన క్రోమ్ ఫినిషింగ్ ఈ MPVకి ప్రీమియం లుక్ ఇస్తాయి. బోల్డ్ క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ అలాయ్ వీల్స్ ఈ పెద్ద బండిని రోడ్డు మీద ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. కారు వెనుక భాగంలో స్మార్ట్ LED టెయిల్ ల్యాంప్స్ & మస్క్యులర్ బంపర్ మొత్తం బాడీ డిజైన్‌ను ఇంకా స్టైలిష్‌గా మలుస్తాయి.
టయోటా కంపెనీ, ఇన్నోవా హైక్రాస్ మీద కొన్ని ఆఫర్లను ప్రకటించింది. ఇందులో ప్రత్యక్ష నగదు తగ్గింపు లేకపోయినప్పటికీ, రూ. 15 వేల కార్పొరేట్ బెనిఫిట్ & రూ. 44 వేల విలువైన కిట్ బెనిఫిట్ ఉన్నాయి. వీటితో, ఈ నెలలో ఈ వాహనంపై రూ. 59 వేల 400 వరకు ప్రయోజనం పొందవచ్చు. మీరు, టయోటా ఇన్నోవా హైక్రాస్‌ను ఈ నెలలో కొంటే, ఈ ప్రయోజనాలు మీకు కలిసి వస్తాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.94 లక్షల నుంచి ప్రారంభమై రూ. 31.34 లక్షల వరకు ఉంటుంది. విజయవాడలో ఆన్-రోడ్ ధర (Toyota Innova Hycross on-road price, Vijayawada) దాదాపు రూ. 24.93 లక్షలు కాగా, హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర (Toyota Innova Hycross on-road price, Hyderabad) దాదాపు రూ. 25.22 లక్షలు అవుతుంది. ఈ ధరల శ్రేణిలో, మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి.
ఫుల్ ట్యాంక్‌తో ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది?
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 52 లీటర్లు. ఈ ట్యాంక్‌ను ఫుల్ చేసి బండిని రోడ్డు మీదకు ఎక్కిస్తే, 1200 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు.
ఫైనాన్స్ ప్లాన్
మీరు ఈ కారును ఫైనాన్స్‌లో (కార్ లోన్‌పై) కూడా తీసుకోవచ్చు. ముందుగా కొంత మొత్తాన్ని డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన డబ్బును బ్యాంక్ కార్ లోన్ రూపంలో ఇస్తుంది. రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే గరిష్ట మొత్తంలో కార్ లోన్ పొందవచ్చు.
EMI ఎంత చెల్లించాలి?
హైదరాబాద్‌లో, టయోటా ఇన్నోవా హైక్రాస్ కొనడానికి మీరు 5.22 లక్షలు డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 20 లక్షలకు కార్ లోన్ లభిస్తుంది. బ్యాంక్ ఈ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో మంజూరు చేసిందనుకుందాం. ఇప్పుడు, మీరు 4 సంవత్సరాల కోసం లోన్ తీసుకుంటే, ప్రతి నెలా దాదాపు రూ. 50,572 EMI బ్యాంక్‌కు చెల్లించాలి. 5 సంవత్సరాలకు రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, 60 నెలల పాటు ప్రతి నెలా దాదాపు రూ. 42,366 EMI బ్యాంక్‌కు కట్టాలి.





















