(Source: ECI | ABP NEWS)
డీజిల్ లేదా పెట్రోల్? – Hyundai Creta ఏ వేరియంట్ ఫుల్ ట్యాంక్‌తో బెస్ట్ మైలేజ్ ఇస్తుంది?
Hyundai Creta Best Mileage Variant: క్రెటా మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు & 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు క్రెటాలో ఉన్నాయి.

Hyundai Creta Diesel Vs Petrol Best Mileage: హ్యుందాయ్ క్రెటా, భారతీయులు ఎక్కువగా కొంటున్న/ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో.. హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ. 20.50 లక్షల వరకు ఉంటుంది. RTO, ఇన్సూరెన్స్ ఇతర ఖర్చులు కలుపుకుని బేస్ వేరియంట్ Creta E 1.5 Petrol ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు రూ. 13.76 లక్షలు (Hyundai Creta on-road price, Hyderabad) అవుతుంది. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.70 లక్షలు (Hyundai Creta on-road price, Vijayawada) అవుతుంది. ఇతర తెలుగు నగరాల్లో ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
హ్యుందాయ్ కంపెనీ, క్రెటా SUV ని మొత్తం 54 వేర్వేరు ట్రిమ్స్ & వేరియంట్లలో విక్రయిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా పవర్‌ట్రెయిన్
హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజిన్ ఎంపికలతో మార్కెట్లో అందుబాటులో ఉంది. మొదటిది, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 160 PS పవర్‌ను & 253 Nm టార్క్‌ను ఇస్తుంది. రెండోది 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 115 PS శక్తిని & 144 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మూడోది 1.5 లీటర్ టర్బో డీజిల్ యూనిట్, ఇది 114 bhp పవర్‌ను & 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అన్ని ఇంజిన్ ఆప్షన్స్‌లో, హ్యుందాయ్ క్రెటా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, CVT (కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) & 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) వంటి గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉంది.
ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత ఎంతదూరం నడుస్తుంది?
హ్యుందాయ్ క్రెటాలో 50-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. ఈ SUV మైలేజ్ లెక్క ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ ప్రకారం మారుతుంది. మీరు డీజిల్ మాన్యువల్ వేరియంట్‌ను ఎంచుకుంటే, ARAI సర్టిఫై చేసిన ప్రకారం, దీని మైలేజ్ లీటరుకు 21.8 కిలోమీటర్లు. ఇది పూర్తి ట్యాంక్‌తో దాదాపు 1,090 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. అదే సమయంలో, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది & దాని పూర్తి ట్యాంక్ పరిధి దాదాపు 955 కిలోమీటర్లు.
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 18.4 కి.మీ. మైలేజ్ ఇస్తుంది, ఇది ఫుల్ ట్యాంక్ తో దాదాపు 920 కి.మీ. ప్రయాణించగలదు. మరోవైపు... CVT లేదా DCT ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 17.4 కి.మీ. మైలేజ్ ఇస్తుంది & దాని పరిధి 870 కి.మీ వరకు ఉంటుంది.
వాస్తవ ప్రపంచంలో, నిజమైన మైలేజ్ అనేది డ్రైవింగ్ శైలి, ట్రాఫిక్ పరిస్థితులు & రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటాలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ & 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ & ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇచ్చారు.




















