అన్వేషించండి

Maruti Ertiga పెట్రోల్ + CNG ట్యాంకులు ఫుల్‌ చేస్తే ఎంత దూరం నడుస్తుంది? మైలేజ్ లెక్క మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది!

Maruti Ertiga Mileage: మారుతి ఎర్టిగా పెట్రోల్‌, CNG ట్యాంకులు రెండూ నింపితే ఎంత దూరం వెళ్తుందో లెక్కిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ARAI మైలేజ్ డేటా ఆధారంగా పూర్తి వివరాలు మీ కోసం.

Maruti Ertiga Price And Fuel Capacity: మారుతి ఎర్టిగా భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన MPVలలో ఒకటి. దీని పెట్రోల్ & CNG వేరియంట్‌లు ఫ్యూయల్‌ను పొదుపుగా వాడుకుంటాయి. గత నెల (జులై 2025)లో 16,605 మంది కొత్త కస్టమర్లు ఈ MPVని కొన్నారు. ఇది, మరోసారి, మన దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్‌ కారుగా అవతరించింది. తక్కువ ధర, ఎక్కువ స్థలం, గొప్ప మైలేజ్ & బ్రాండ్ విలువ దీనిని కుటుంబానికి సరైన కారుగా మార్చాయి.

మారుతి ఎర్టిగా ధర ఎంత? 
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో మారుతి ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.12 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని బేస్ వేరియంట్ (LXi) హైదరాబాద్‌లో దాదాపు రూ. 10.96 లక్షల ఆన్-రోడ్‌లో (Maruti Ertiga on-road price, Hyderabad) లభిస్తుంది. విజయవాడలోనూ కాస్త అటూఇటూగా ఇదే రేటు (Maruti Ertiga on-road price, Vijayawada) ఉంటుంది. CNG వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.56 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పెద్ద ఫ్యామిలీ కారులో బడ్జెట్ & మైలేజ్ రెండింటినీ కోరుకునే కస్టమర్లకు ఈ ధర ప్రత్యేకమైన ఆఫర్‌ అవుతుంది.

మారుతి ఎర్టిగా, అందుబాటు ధర లేదా 7-సీటర్ కావడం వల్ల మాత్రమే కాకుండా, దాని ఉపయోగకరమైన & స్మార్ట్ ఫీచర్ల వల్ల కూడా జనం మెచ్చిన కారుగా మారింది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే పెద్ద 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఈ కారు క్యాబిన్‌లో ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & రియర్‌ AC వెంట్స్ వంటి కూలింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి ఎర్టిగా, తన ప్రయాణీకులకు కూడా భద్రంగా చూసుకుంటుంది. ఇప్పుడు, ఈ MPV అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉన్నాయి, ఏదైనా అత్యవసర పరిస్థితిలో ప్రయాణీకులకు మరింత భద్రతను అందిస్తాయి. దీంతో పాటు, ఇందులో EBD, ABS, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) & హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి, ఇవి ప్రతి డ్రైవ్‌ను మరింత సురక్షితంగా చేస్తాయి.

ఇంజిన్ & పనితీరు
మారుతి ఎర్టిగా 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 101.65 bhp పవర్‌ను & 136.8 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ & CNG వేరియంట్‌లలో లభిస్తుంది. CNG వేరియంట్‌లో, ఈ ఇంజిన్ 88 PS శక్తిని & 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

ట్రాన్స్‌మిషన్‌ విషయానికి వస్తే... పెట్రోల్ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. CNG వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ సెటప్ సిటీకి & హైవే పరిస్థితులలో మృదువైన & మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను అందించగలదు.

మారుతి ఎర్టిగా ఎంత మైలేజ్ ఇస్తుంది?
మారుతి ఎర్టిగా MPVలో 45 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ & 60 లీటర్ల CNG ట్యాంక్ ఉన్నాయి. అంటే, ఎర్టిగా VXi వేరియంట్ పెట్రోల్ & CNG రెండింటినీ నింపినట్లయితే, ARAI సర్టిఫై చేసిన ప్రకారం, ఈ MPV 1000 నుంచి 1100 కిలోమీటర్ల దూరాన్ని సులభంగా ప్రయాణించగలదు. అంటే, ఫ్యామిలీతో కలిసి ఏదైనా లాంగ్‌ డ్రైవ్‌ ప్లాన్‌ చేస్తే ట్యాంక్‌ను మళ్లీ మళ్లీ నింపాల్సిన అవసరం ఉండదు.

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget