అన్వేషించండి

Best Electric SUVs in India 2026:భారత్‌ రోడ్లపై రారాజులుగా ఉన్న టాప్‌ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే!

భారత్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు పెరుగుతున్న వేళ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల డిమాండ్ పెరిగింది. మారుతి, టాటా, మహీంద్రా వంటి టాప్ 5 విద్యుత్ వాహనాల ధరలు, రేంజ్‌, ఫీచర్స్ గురించి తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరుగుతున్న ఇంధన ధరలతో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది.
  • మారుతి ఇ విటారా, మహీంద్రా BE6, టాటా పంచ్ EV టాప్ ఎలక్ట్రిక్ SUVలు.
  • విన్ ఫాస్ట్ VF7, MG విండ్సర్ ప్రో కూడా అద్భుతమైన ఫీచర్లతో ఉన్నాయి.
  • EVలు పర్యావరణానికి మేలు చేస్తాయి, దీర్ఘకాలంలో ఖర్చు తగ్గిస్తాయి.

Best Electric SUVs in India 2026:భారత్‌ ఈవీలో పోటీ తీవ్రంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్‌తోపాటు వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా మోడల్స్ తీసుకొస్తున్న సంస్థలు రేసులో దూసుకెళ్తున్నాయి. అలా వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాప్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వాటి ధరలు, రేంజ్‌తోపాటు ఇతర ఫీచర్స్ గురించి తెలుసుకుంటే కొనే ప్రక్రియ సులభతరం అవుతుంది.  

భారత్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వారం వ్యవధిలోనే నాలుగు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి చమురు సంస్థలు.  ఇంకా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు ఉంటాయన్న అంచనాలతో కారు కొనాలనే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా ఎలక్ట్రిక్‌ వాహనాల గురించి తెలుసుకుంటున్నారు. కొనే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మొదట్లో ఎలక్ట్రిక్ కారు ధరలు ఎక్కువగా ఉండటంతో కొనేందుకు పెద్దగా ఆసక్తి చూప లేదు. ఇప్పుడు ధరలు దిగి రావడంతో ఈవీలు కొనేందుకు ముందుకొస్తున్నారు. ధర తగ్గడమే కాకుండా రేంజ్ కూడా పెరిగింది. అద్భుతమైన ఫీచర్స్ వస్తున్నాయి. అందుకే పెట్రోల్ వాహనాలకు పోటీ ఈవీలు మార్కెట్‌లో దూసుకొస్తున్నాయి. 

Also Read:అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!

ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో చాలా మంది ప్రముఖులతోపాటు సామాన్యులు కూడా ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే కొత్త కొత్త మోడల్స్‌తో ఈవీ మార్కెట్‌లో సత్తా చాటుకునేందుకు చాలా కంపెనీలు తహతహలాడుతున్నాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో పోటీ పడుతున్న ఐదు అత్యుత్తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు గురించి చూస్తే టాప్‌లో ఉంది మారుతి సుజుకి  ఇ విటారా

Also Read:హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!

మారుతి సుజుకి ఇ విటారా:-

దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ విటారాతో ఈ విభాగాంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇది 49kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 543కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది సుమారు 172bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్‌ స్క్రీన్‌లు, వెంటిలేడెట్‌  సీట్లు, వెనుక స్లైడింగ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్‌ మోడల్‌ కింద దీని ప్రారంభ ధర 10.99 లక్షలు. 


Best Electric SUVs in India 2026:భారత్‌ రోడ్లపై రారాజులుగా ఉన్న టాప్‌ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే!

Also Read:కొత్త SUV కొనడం కంటే, ఈ 5 పాత సెడాన్‌లు తీసుకోవడం బెటర్.. అందుకు కారణాలివే

మహీంద్రాBE 6:-

మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న BE6 ఎస్‌యూవీ దాని స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌, శక్తిమంతమైన పవర్ అవుట్‌పుట్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో 59kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 210KW పవర్‌ 380Nm టార్క్‌ను అందిస్తుంది. కేవలం 6.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. పెద్ద బ్యాటరీ వెర్షన్ 638కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను ఇస్తుంది. దీని ప్రారంభ ధర 18.90 లక్షలు. 

BE 6 - EVEREST WHITE

టాటా పంచ్ ఈవీ

టాటా మోటార్స్ అందిస్తున్న పంచ్ ఈవీ ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలలో ఒకటి. మొదటిసారి ఈవీ కొనాలనుకునే వారికి ఇది గొప్ప ఆప్షన్. 30kW, 40kW ఆప్షన్‌లు లభిస్తుంది. లాంగ్ రేంజ్‌ మోడల్ వాస్తవ ప్రపంచంలో సుమారు 355 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. బాస్‌ మోడల్‌ కింద దీని ధర 9.69 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. 

Best Electric SUVs in India 2026:భారత్‌ రోడ్లపై రారాజులుగా ఉన్న టాప్‌ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే!

విన్ ఫాస్ట్‌ 

వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తన VF7 మోడల్‌తో భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. పెద్ద క్యాబిన్, రోడ్డుపై గంభీరమైన రూపం దీని సొంతం. ఇందులో ఆల్‌ విల్ డ్రైవ్‌, శక్తివంతమైన మోటార్ ఉన్నాయి. 70.7 kWh బ్యాటరీతో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 510కిలోమీటర్‌లు ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర 21. 89 లక్షలు. 


Best Electric SUVs in India 2026:భారత్‌ రోడ్లపై రారాజులుగా ఉన్న టాప్‌ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే!

ఎంజీ విండ్‌సర్‌ ప్రో:-

రోజువారీ సిటీ రైడింగ్‌, కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఎంజీ విడ్‌సర్‌ ప్రోను రూపొందించారు. విశాలమైన క్యాబిన్, పెద్ద బూట్‌స్పేస్‌, సౌకర్యవంతమైన సీట్లు దీని ప్రత్యేకత. ఇందులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌, వెంటిలేటెడ్‌ సీట్లు ఉన్నాయి. 52.9kWh బ్యాటరీ ప్యాక్‌తో ఇది ARAI ధృవీకరించిన 449కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.

Best Electric SUVs in India 2026:భారత్‌ రోడ్లపై రారాజులుగా ఉన్న టాప్‌ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే!

Also Read:టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి...

పెట్రోల్‌ కార్ల నిర్వహణ ఖర్చు ఏటా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, దీర్ఘకాలంలో మీ జేబును కూడా ఆదా చేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఈవీలపై అనేక రాయితీలు ఇస్తున్నాయి. అలాగే ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ కూడా వేగంగా విస్తరిస్తోంది. కొత్త కారు కొనాలని ప్లాన్ చేసే వారికి ఇదే సరైన సమయం. బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్‌ అంటే కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని వల్ల కారు ధర తగ్గుతుంది. బ్యాటరీ వినియోగానికి గాను మీరు నెలవారీ లేదా వాడిన కిలోమీటర్లను బట్టి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మీ బడ్జెట్‌ తక్కువగా ఉండి సిటీలో మాత్రమే తిరగాలనుకుంటే టాటా పంచ్ ఈవీ లేదా మారుతి ఇ విటారా ఎంచుకోవచ్చు. అదే వేగం, లాంగ్ రేంచే కోరుకుంటే మహీంద్రా BE6 బెస్ట్. 

Also Read:టాటా టియాగో సీఎన్‌జీలో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ - ప్యాడల్ షిఫ్టర్లతో రాబోతున్న సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్

ఈ ఐదు వాహనాలు ఐదు ఎస్‌యూవీలు కూడా సాంకేతికతంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మీ అవసరాలు, బడ్జెట్‌, రేంజ్‌ ప్రాధాన్యతలను బట్టి వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు ఇంధన ఖర్చుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. 

Frequently Asked Questions

భారతదేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ SUVలు ఏవి?

మారుతి సుజుకి ఇ విటారా, మహీంద్రా BE6, టాటా పంచ్ ఈవీ, విన్ ఫాస్ట్ VF7, మరియు ఎంజీ విండ్సర్ ప్రో ప్రస్తుతం భారత మార్కెట్ లోని టాప్ 5 ఎలక్ట్రిక్ SUVలు.

మారుతి సుజుకి ఇ విటారా EV యొక్క రేంజ్ మరియు ధర ఎంత?

మారుతి సుజుకి ఇ విటారా EV పెద్ద బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర 10.99 లక్షలు (బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ మోడల్ కింద).

మహీంద్రా BE6 EV యొక్క పనితీరు మరియు రేంజ్ గురించి చెప్పండి.

మహీంద్రా BE6 EV 210KW పవర్ మరియు 380Nm టార్క్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ వెర్షన్ 638 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది మరియు కేవలం 6.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రస్తుత సమయం ఎందుకు సరైనది?

పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ రాయితీలు, విస్తరిస్తున్న ఛార్జింగ్ నెట్వర్క్ మరియు EV ల ధరలు తగ్గడం వల్ల కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం.

టాప్ హెడ్ లైన్స్

Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget