Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Affordable Automatic Cars: రూ.10 లక్షల్లోపు ధరలో టాప్-5 ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. నిస్సాన్ మ్యాగ్నైట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
Top 5 Automatic Cars Under Rs 10 Lakh: ప్రస్తుతం మనదేశంలో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో కొత్త కారు కొనాలనుకునే వారు ఆటోమేటిక్ వేరియంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రూ.10 లక్షల్లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఏం ఉన్నాయో చూద్దాం.
నిస్సాన్ మ్యాగ్నైట్ (Nissan Magnite)
నిస్సాన్ మ్యాగ్నైట్‌లో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇందులో హెచ్ఆర్ఏవో 1.0 లీటర్ ఇంజిన్ అందించారు. వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, హైఎండ్ స్పీకర్లను ఈ కారులో చూడవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ అనేది ఒక బడ్జెట్లో మంచి ఆటోమేటిక్ కారు. ఈ కారులో స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందించారు. మన వాయిస్ ద్వారానే దీన్ని ఓపెన్ చేయవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.28 లక్షల వరకు ఉంది.
రెనో కిగర్ (Renault Kiger)
రెనో కిగర్‌ను కూడా ఈ లిస్ట్‌లో యాడ్ చేయవచ్చు. ఈ కారు డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో ఇంజిన్ అందించారు. మల్టీ సెన్స్ డ్రైవ్ మోడ్‌ను ఈ కారులో అందించడం విశేషం. రెనో కిగర్ ఎక్స్ షోరూం ధర రూ.ఆరు లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు ఉంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
టాటా పంచ్ (Tata Punch)
కేవలం ఆటోమేటిక్ వేరియంట్లోనే కాకుండా ఓవరాల్‌గా చూసినా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లలో టాటా పంచ్ ఒకటి. ఇందులో డీ కట్ స్టీరింగ్ వీల్‌ను అందించారు. ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను ఈ కారులో చూడవచ్చు. టాటా పంచ్ ఎక్స్ షోరూం ధర రూ.6.13 ల్షల నుంచి మొదలవనుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో స్మార్ట్ వాచ్ కనెక్టివిటీని కూడా అందించారు. స్మార్ట్ వాచ్‌ను కనెక్ట్ చేయడం ద్వారా కారు సమాచారాన్ని పొందవచ్చు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎక్స్ షోరూం ధర రూ.7.52 లక్షల నుంచి రూ.13.04 లక్షల వరకు ఉంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది