New Compact SUVs: కొత్త కారు కొనేవాళ్లు డబ్బు రెడీ చేసుకోండి - మూడు కొత్త కాంపాక్ట్ SUVలు వస్తున్నాయ్
Upcoming Compact SUVs: మీరు అతి త్వరలో ఒక కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉంటే, ఈ వార్త మీ కోసమే. మూడు పాపులర్ కంపెనీల నుంచి కొత్త కాంపాక్ట్ SUVలు రాబోతున్నాయి.

New Compact SUVs To Be Launched Soon: భారత మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ అంతా, ఇంతా కాదు. వెయిటింగ్ పిరియడ్ ఎక్కువైనా సరే, ఈ బండ్లను బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు, దేశంలోని మూడు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన మారుతి, హ్యుందాయ్ & మహీంద్రా, త్వరలో ఈ విభాగంలో కొత్త కార్లను లాంచ్ చేయబోతున్నాయి. స్టైల్, టెక్నాలజీ & పెర్ఫార్మెన్స్‌లో ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ కాంప్టాక్ SUVలు రాబోతున్నాయి.
త్వరలో లాంచ్ కానున్న కాంప్టాక్ SUVలు
1. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Venue Facelift)
హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 2025 వెర్షన్ గతంలో కంటే స్మార్ట్ & స్టైలిష్ లుక్స్‌తో వస్తోంది. కొత్త వెన్యూలో కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌లైట్ డిజైన్, కొత్త అల్లాయ్ వీల్స్ & వెనుక భాగం డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఇంకా.. ADAS & పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉండొచ్చు. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కాబట్టి పవర్‌ట్రెయిన్‌లో మార్పు లేదు, మునుపటిలాగే 1.2L పెట్రోల్, 1.5L డీజిల్ & 1.0L టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ లక్ష్యం వెన్యూను మరింత ప్రీమియం & హైటెక్‌గా మార్చడం.
2. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ (Mahindra XUV 3XO EV)
మహీంద్రా XUV 3XO EV టెస్టింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఎలక్ట్రిక్ SUV సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 400 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు. ఈ బండికి కొత్త బ్యాటరీ ప్యాక్ & ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది మహీంద్రా XUV400 కంటే చిన్నదిగా & తక్కువ ధరలో ఉంటుంది. టాటా పంచ్ EVతో నేరుగా పోటీ పడడానికి మహీంద్రా XUV 3XO EVని డిజైన్ చేశారు. స్మార్ట్ ఇంటీరియర్స్, డిజిటల్ క్లస్టర్ & కనెక్టెడ్ ఫీచర్లను ఈ SUV ప్రత్యేకతలు. బడ్జెట్ రేటులోనే ఎలక్ట్రిక్ ఫ్యూచర్ వైపు వెళ్లాలనుకునే కస్టమర్లకు ఇది మంచి అవకాశం అవుతుంది.
3. మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ (Maruti Fronx Hybrid)
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్, ఇటీవలి టెస్టింగ్ టైమ్‌లో రోడ్లపై కనిపించింది. 1.2L Z12E పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన బలమైన హైబ్రిడ్ సిస్టమ్‌తో ఈ బండి పవర్ పొందుతుంది. ఈ సిస్టమ్ కారణంగా అధిక మైలేజీ & తక్కువ ఉద్గారాలు సాధ్యమవుతాయి. ఈ కారులో స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, మెరుగైన స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ & EV మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి. అధిక పెట్రోల్ ధరలను తప్పించుకుంటూనే, స్మార్ట్ టెక్నాలజీతో అధిక మైలేజ్ ఇచ్చే కారును కోరుకునే వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ కార్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి?
హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 2025 వెర్షన్ చివరి నాటికి విడుదల కానుంది, ఇది టాటా నెక్సాన్ & మారుతి బ్రెజ్జాతో పోటీ పడుతుంది. మహీంద్రా XUV 3XO EV ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కావచ్చు & ఇది టాటా పంచ్ EV & టియాగో EVతో పోటీ పడవచ్చు. మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ కూడా 2025 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది & ఇది టాటా ఆల్ట్రోజ్ హైబ్రిడ్ (రాబోయే) & టయోటా గ్లాంజా హైబ్రిడ్‌తో పోటీ పడనుంది.





















