Tesla Model Y: టెస్లా ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ప్రారంభం! EMIలో కొనుక్కోవచ్చా?
Tesla Model Y: టెస్లా మోడల్ Y బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రాంభమయ్యాయి. భారత్‌లో కొనాలనుకునేవారు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Tesla Model Y Bookings : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టెస్లా భారతదేశంలో తమ మొదటి ఎలక్ట్రిక్ SUV మోడల్ Y బుకింగ్‌లను ప్రారంభించింది. కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ సౌకర్యాన్ని అందించింది.ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.89 లక్షలుగా నిర్ణయించింది.
కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు కేవలం 22,220 రూపాయలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. ప్రారంభంలో కొన్ని ప్రధాన నగరాలకు డెలివరీకి ప్రాధాన్యత ఇస్తారు.
ఏయే వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి?
టెస్లా మోడల్ Y భారతదేశంలో రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మొదటిది రియర్-వీల్ డ్రైవ్ (RWD), దీని WLTP పరిధి 500 కిలోమీటర్లు, ఈ కారు 5.9 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.89 లక్షలుగా నిర్ణయించారు.
రెండో వేరియంట్ లాంగ్ రేంజ్ RWD, దీని WLTP పరిధి 622 కిలోమీటర్లు, ఇది కేవలం 5.6 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం 201 kmph, దీని ధర రూ. 67.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
డిజైన్, సాంకేతికతలో ప్రత్యేకత ఏమిటి?
డిజైన్, సాంకేతికతపరంగా టెస్లా మోడల్ Y మినిమలిస్ట్, డిజిటల్ ఇంటీరియర్‌తో వస్తుంది. ఇందులో 19-అంగుళాల క్రాస్‌ఫ్లో అల్లాయ్ వీల్స్, 6 ఆకర్షణీయమైన రంగు ఎంపికలు, పూర్తిగా డిజిటల్ డ్రైవింగ్ అనుభవం ఉంటుంది. ఈ కారులో టెస్లా ప్రీమియం ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ (FSD) సాంకేతికత కూడా అందుబాటులో ఉంది. దీని కోసం అదనంగా 6 లక్షలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
మొదట ఎక్కడ డెలివరీ ఉంటుంది?
డెలివరీ గురించి టెస్లా ఇండియా స్పష్టం చేస్తూ, మొదటి దశలో ఈ SUV ముంబై, పూణే, ఢిల్లీ, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. రెండో దశ డెలివరీ ఇతర నగరాల్లో జరుగుతుంది, దీని తేదీలను తరువాత ప్రకటిస్తారు.
బుకింగ్ ప్రక్రియ
బుకింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. రెండు దశల్లో చెల్లింపు చేయాలి. మొదటి దశలో రూ. 22,220 చెల్లించాలి, ఇది తిరిగి చెల్లించబోరు. దీని తర్వాత 7 రోజుల్లోపు రూ. 3,00,000 రెండో విడత పేమెంట్ క్లియర్ చేయాలి. ఇది కూడా తిరిగి చెల్లించబోరు. ఈ రెండు చెల్లింపులలో TCS (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ఉంటుంది. బుకింగ్ కోసం ఆసక్తి ఉన్న కస్టమర్‌లు టెస్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
ఈఎంఐలో కొనుక్కోవచ్చా?
టెస్లా మోడల్ Y కారును ఈఎంఐలో కొనుగోలు చేయడం గురించి ఎక్కడా అధికారిక సమాచారం లేదు. టెస్లా సంస్ కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. భారతదేశంలో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ముంబైలో 2025 జులై 15న ప్రారంభించింది. అధికారికంగా మోడల్ Yను లాంచ్ చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించిన సంస్థ రూ.22,000 తో ప్రక్రియ ప్రారంభించివచ్చని తెలిపింది. కానీ ఈఎంఐ ఎంపికల గురించి స్పష్టమైన సమాచారం లేదు. టెస్లా కార్ల కోసం ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంటే, ఇది స్థానిక ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల ద్వారా ఉండే అవకాశం ఉంది, కానీ ఇప్పటి వరకు టెస్లా భారతదేశంలో ఇలాంటి ఫైనాన్స్ ప్లాన్‌లను ప్రకటించలేదు.





















