(Source: ECI/ABP News/ABP Majha)
Tata Tiago NRG Launch: రెండు వేరియంట్లతో టాటా టియాగో ఎన్ఆర్‌జీ వచ్చేసింది
Tata Tiago NRG Launch: ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్.. టియాగో ఎన్ఆర్‌జీ 2021 మోడల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.
దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటార్స్ మరో కొత్త కారును భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. టాటా టియాగో ఎన్ఆర్‌జీ (Tata Tiago NRG) ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇందులో రెండు వేరియంట్లు ఉండనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎక్స్ షోరూమ్ ధరల ప్రకారం.. ఎన్ఆర్‌జీ పెట్రోల్- ఎంటీ (మ్యానువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్ ధర రూ.6.57 లక్షలు కాగా.. పెట్రోల్- ఏఎంటీ (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్ ధర రూ.రూ. 7.09 లక్షలుగా ఉండనుంది.
టాటా నుంచి గతంలో విడుదల అయిన టియాగోకు ఎస్‌యూవీ లుక్ అందిస్తూ.. టియాగో ఎన్‌ఆర్‌జీ కారును తీసుకొచ్చింది. మంచి స్టైలిష్ లుక్‌లో ఉన్న టియాగో ఎన్‌ఆర్‌జీ.. మారుతి సుజుకీ సెలెరియో ఎక్స్, ఫోర్డ్ ఫ్రీస్టైల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది స్టా గ్రీన్, ఫైర్ రెడ్, స్నో వైట్, క్లౌడీ గ్రే కలర్ వేరియంట్లలో లభించనుంది.
హర్మన్ సౌండ్ సిస్టమ్..
టియాగో ఎన్‌ఆర్‌జీలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేలతో కనెక్ట్ అవుతుంది. ఇందులో హర్మన్ సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 181 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 15 అంగుళాల వీల్స్, పవర్ విండోస్, పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్ ఉన్నాయి. డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసే సదుపాయం ఉంది.
భద్రత కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, డే నైట్ రేర్ వ్యూ మిర్రర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ప్రెటిషనర్స్ తో కూడినటు వంటి సీట్ బెల్టులు ఉన్నాయి.
టియాగో ఎన్‌ఆర్‌జీ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ (రివోట్రాన్) ను కలిగి ఉంది. ఇది 84 బీహెచ్‌పీ (బ్రేక్ హార్స్ పవర్) పవర్ అందిస్తుంది. అలాగే 3300 ఆర్పీఎం వద్ద ఇది 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టియోగో ఎన్‌ఆర్‌జీ ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటాయి. ఇందులో ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ ఫీచరు అందించలేదు.
గతంలో ఉన్న మోడల్ లానే టియాగో ఎన్‌ఆర్‌జీలో పుష్ బటన్ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. డాష్‌బోర్డ్ లేఅవుట్ స్టాండర్ట్ టియోగోలో ఉన్నట్లే ఉంటుంది. డాష్‌బోర్డ్, సీట్లు బ్లాక్ షేడ్ తో రానున్నాయి. ఏసీల చుట్టూ ట్రిమ్ ఎలిమెంట్లు, గేర్ లివర్ స్పైసింగ్ లను కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
Also Read: Car Bike Sales: ఏపీలో రయ్ రయ్ అంటున్న బైక్‌లు, కార్ల అమ్మకాలు..