News
News
X

Tata Tiago EV Launch: టాటా అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు త్వరలో - ధర ఎంతంటే?

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు సెప్టెంబర్ 28వ తేదీన లాంచ్ కానుంది.

FOLLOW US: 

టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్ కారు సెప్టెంబర్ 28వ తేదీన లాంచ్ కానుంది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టిగోర్ ఈవీల తర్వాత పూర్తి స్థాయిలో లాంచ్ కానున్న మూడో ఎలక్ట్రిక్ కారు ఇదే. టాటా లాంచ్ చేయనున్న అత్యంత చవకైన చవకైన కారు ఇదే కానుంది.

కంపెనీ లాంచ్ చేయనున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే. టిగోర్ ఈవీతో పోలిస్తే ఇందులో చిన్న బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. టిగోర్‌లో 26 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. పూర్తిగా చార్జ్ చేస్తే 306 కిలోమీటర్ల రేంజ్ లభించనుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 73.97 హెచ్‌పీ, 190 ఎన్ఎం టార్క్ అందించనుంది.

టాటా టియాగో ఈవీ ధర మనదేశంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల రేంజ్‌లో ఉండనుంది. ఇక సబ్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టిగోర్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.64 లక్షల మధ్యలో ఉంది. నెక్సాన్ ఈవీ ప్రైమ్, మ్యాక్స్ వేరియంట్లను రూ.18 నుంచి రూ.20 లక్షల మధ్యలో కొనుగోలు చేయవచ్చు.

టాటా బడ్జెట్ కారు పంచ్ ఇటీవలే తన ప్రయాణంలో కొత్త మైలురాయిని చేరుకుంది. బడ్జెట్ కార్లలో ఎన్నో అంచనాలతో లాంచ్ అయిన టాటా పంచ్ 10 నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడు పోయింది. కేవలం 10 నెలల్లోనే ఈ ఫీట్ సాధించిన మొదటి ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. 2021 అక్టోబర్‌లో ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి దీనికి మంచి రెస్పాన్స్ ఉంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు అందించడం దీని స్పెషాలిటీ.

టాటా పంచ్‌లో 1.2 లీటర్, త్రీ సిలెండర్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను అందించారు. 85 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం పీక్ టార్క్ కూడా ఈ కారులో ఉన్నాయి. ఈ ఇంజిన్‌లో డైనా ప్రో టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, ఏఎంటీ కూడా అందించారు. ఇక ఏఎంటీ వేరియంట్లలో ట్రాక్షన్ ప్రో మోడ్ కూడా ఉంది.

ఈ సూపర్ హిట్ ఎస్‌యూవీలో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, ఐఆర్ఏ కనెక్టివిటీ సూట్, ఏడు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్నాయి. ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, పుష్ బటన్ స్టాప్/స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టూ డ్రైవింగ్ మోడ్లు కూడా అందించారు.

టాటా అల్ట్రోజ్ ప్లాట్‌ఫాంపైనే ఈ పంచ్‌ను కూడా రూపొందించారు. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ సేఫ్టీని ఇది సాధించడం విశేషం. అయితే ఇది టాటా ఆల్ట్రోజ్ కంటే ఎన్నో విషయాల్లో మెరుగ్గా ఉంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్ చేసిన కార్ క్రాష్ టెస్టుల్లో అత్యంత సురక్షితమైన కారుగా టాటా పంచ్ నిలిచింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 కంటే ఎక్కువ పాయింట్లను ఇది సాధించడం విశేషం. స్టాండర్డ్ వెర్షన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, యాబ్స్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ అందించారు. హయ్యర్ వేరియంట్లలో కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, బ్రేక్ అవే కంట్రోల్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 17 Sep 2022 11:14 PM (IST) Tags: Tata Tiago EV Launch Date Tata Tiago EV Tata Tiago EV Expected Price Tata Tiago EV Specifications Tata Tiago EV Features

సంబంధిత కథనాలు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

Hero Vida Electric Scooter: కొనాలని ఉందా? హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేది రేపే!

Hero Vida Electric Scooter: కొనాలని ఉందా? హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేది రేపే!

Komaki electric scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అస్సలు మండదట, ఫీచర్స్ కూడా అద్భుతం!

Komaki electric scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అస్సలు మండదట, ఫీచర్స్ కూడా అద్భుతం!

Mercedes-Benz EQS 580: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 850 కి.మీ వెళ్లొచ్చు, మార్కెట్లోకి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ బెంజ్ కారు!

Mercedes-Benz EQS 580: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 850 కి.మీ వెళ్లొచ్చు, మార్కెట్లోకి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ బెంజ్ కారు!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!