Tata Tiago EV: ఈ టాటా ఎలక్ట్రిక్ కారు రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ - రోజువారీ వాడకానికి బెస్ట్!
Tata Best EV: టాటా టియాగో ఈవీ కారు రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువగా అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాటా అందిస్తున్న చవకైన ఎలక్ట్రిక్ కార్లలో ఇదే బెస్ట్ అని తెలుస్తోంది.
Affordable Electric Car: ఈ రోజుల్లో కారు కొనడం అనేది అందరికీ ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. కొంతమంది రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు కారు కొంటుంటే... మరికొందరు టూర్లు వెళ్లడం కోసం కారు కొనేందుకు ఇష్టపడతారు. అయితే తమ కారుకి మంచి మైలేజీ రావాలని అందరూ కోరుకుంటారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత డ్రైవింగ్ ఖరీదైంది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి మైలేజీని ఇవ్వడమే కాకుండా ఫీచర్లలో కూడా మెరుగ్గా ఉండే కారును అందరూ కోరుకుంటారు.
ఈ సమయంలో ఎలక్ట్రిక్ కార్లు ఉత్తమ ఆప్షన్. ఎందుకంటే వాటి రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిలో టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) ముందంజలో ఉంటుంది. ఇది ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన కారు అని చెప్పవచ్చు. దీని రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి మెట్రో ఛార్జీలు కూడా ఖరీదైనవిగా అనిపిస్తాయి.
టాటా టియాగో ఈవీ ఫీచర్లు (Tata Tiago EV Features)
టాటా టియాగో ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి మొదలై రూ. 11.49 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుంది. దీని బేస్ మోడల్ పూర్తి ఛార్జింగ్ పై 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే దీని టాప్ వేరియంట్ 315 కిలోమీటర్ల వరకు రేంజ్ డెలివర్ చేస్తుంది. టాటా టియాగో ఈవీ టాప్ వేరియంట్ 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. మీరు నెలకు 1500 కిలోమీటర్ల (రోజుకు సగటున 50 కిలోమీటర్లు) చొప్పున డ్రైవ్ చేస్తే ఒక నెల ఖర్చు రూ.2,145 అవుతుంది. ఏడాదిలో 20,000 కిలోమీటర్లు నడిపితే ఈ ఖర్చు రూ.28,000 వరకు అవుతుంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
పెట్రోల్‌తో పోలిస్తే...
టియాగో ఈవీని... పెట్రోల్‌తో నడిచే టియాగోతో కంపేర్ చేసినట్లయితే... టియాగో పెట్రోల్ వెర్షన్ 35 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను పొందుతుంది. దీని మైలేజ్ లీటరుకు 18.42 కిలోమీటర్లుగా ఉంది. ఇది ఫుల్ ట్యాంక్‌పై సుమారు 645 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. లీటర్ పెట్రోల్ ధర రూ.110 అనుకుంటే సుమారు రూ. నాలుగు వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అంటే ఒక కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ దాదాపు రూ.5.42 వరకు ఉంది. నెలలో 1,500 కిలోమీటర్లు నడిపితే ఇంధనం కోసం రూ.8,130 వెచ్చించాల్సి ఉంటుంది.
టాటా టియాగో ఈవీ, టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ల మధ్య పోలిక...
రెండు కార్ల ధరను పోల్చడం ద్వారా టియాగో ఈవీ ఉపయోగించడం ఎంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారును ఏ పెట్రోల్ కారుతో పోల్చినా ఏడాదికి రూ.80,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఆఫీస్‌కు వెళ్లడం కోసం తక్కువ రన్నింగ్ ఖర్చుతో కూడిన కారును కొనుగోలు చేయాలనుకుంటే టియాగో ఈవీ మీకు మంచి ఆప్షన్.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?