Tata Sierra Features: రీఎంట్రీకి సిద్ధంగా ఉన్న టాటా సియెర్రా.. న్యూ లుక్, ఈవీ మోడల్ సైతం.. ఫీచర్లు చూశారా
Tata Sierra Launch in India | టాటా సియెర్రా ఆధునిక ఫీచర్లతో భారత మార్కెట్లోకి నవంబర్ 25న రానుంది. ఇది పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభ్యం కానుందని టాటా మోటార్స్ తెలిపింది.

Tata Sierra Power and Features: టాటా మోటార్స్ పాత మోడల్ కారు టాటా సియెర్రా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈసారి ఈ కారు న్యూ లుక్‌తో మార్కెట్లోకి రాబోతోంది. టాటా సియెర్రా నవంబర్ 25న కొత్త తరం మోడల్‌గా ప్రారంభించనున్నారు సియెర్రా గతంలో 1991లో ప్రారంభించారు, అప్పుడు ఇది భారతదేశపు మొట్టమొదటి ఆఫ్ రోడర్ SUVగా నిలిచింది. ఇప్పుడు ఈ కారు రెట్రో డిజైన్‌తో మోడ్రన్ మీడియం SUVగా మార్కెట్లోకి అడుగుపెడుతుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా మార్కెట్‌లోకి వస్తుంది.
టాటా సియెర్రా (Tata Sierra) పవర్
టాటా సియెర్రా ICE వేరియంట్‌లు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో మార్కెట్‌లోకి రానున్నాయి. సియెర్రా పెట్రోల్ వేరియంట్‌లో టాటా కొత్త 1.5-లీటర్ TGDi టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. టాటా మోటార్స్ తన ఇంజిన్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ డైరెక్ట్ ఇంజెక్షన్ యూనిట్ 5,500 rpm వద్ద 168-170 bhp శక్తిని, దాంతోపాటు 2,000- 3,000 rpm వద్ద 280 Nm అధిక టార్క్‌ను జనరేట్ చేస్తుంది. .
టాటా సియెర్రా డీజిల్ వేరియంట్‌లో 2.0-లీటర్ క్రయోటెక్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 168 bhp శక్తిని, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు రెండింటిలోనూ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలు ఉండనున్నాయి.
టాటా సియెర్రా EV (Tata Sierra EV)
టాటా సియెర్రా ICE వేరియంట్‌లతో పాటు ఎలక్ట్రిక్ రూపంలోనూ మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు Acti.EV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. సియెర్రా EV ఆర్కిటెక్చర్ వివిధ పరిమాణాల అనేక బ్యాటరీలను కనెక్ట్ చేయగలదు. దీని కారణంగా టాటా ఈ కారులో సింగిల్, డ్యూయల్ మోటార్లను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ కారు 2 బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్‌లోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. దీని వలన సియెర్రా EV ఒకసారి ఛార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్ల నుంచి 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.






















