అన్వేషించండి

Tata Sierra EV Features: టాటా సియెరా ఈవీ గ్రాండ్ ఎంట్రీ - జూన్ 30న అరంగేట్రం, హారియర్ టెక్నాలజీతో వస్తున్న ఎలక్ట్రిక్ SUV!

Tata Sierra EV Features:టాటా మోటార్స్, జూన్ 30న సియెరా EVను ఆవిష్కరించనుంది. 65kWh, 75kWh బ్యాటరీలు, AWD ఆప్షన్, ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 500 km పైగా రేంజ్‌తో ఈ ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లోకి రానుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా సియెరా ఈవీ జూన్ 30న ఆవిష్కృతమవుతుందని టీజర్ తెలిపింది.
  • ఆధునిక డిజైన్, ట్రిపుల్ స్క్రీన్, లగ్జరీ క్యాబిన్ ఫీచర్లున్నాయి.
  • కొత్త acti.ev+ ప్లాట్‌ఫామ్, రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు.
  • సుమారు ₹18-25 లక్షల ధర, మార్కెట్లో కీలక పోటీ.

Tata Sierra EV Features: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి మరింత ఊపునిచ్చేలా, టాటా మోటార్స్ తన అత్యంత ప్రతిష్టాత్మక మోడల్ టాటా సియెరా EVకి తొలి టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV జూన్ 30న అధికారికంగా ప్రపంచానికి పరిచయం కానుంది. ప్రస్తుతం టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఏడో ఎలక్ట్రిక్ మోడల్‌గా సియెరా EV చేరనుంది.

1990లలో భారతీయ రోడ్లపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సియెరా పేరును ఆధునిక రూపంలో మళ్లీ తీసుకువస్తున్న టాటా, ఈసారి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో జనం ముందుకు రానుంది. ఇప్పటికే ఆటో ఎక్స్‌పోల్లో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 డిజైన్‌లో సియెరా ప్రత్యేకత

కొత్త సియెరా EVలో పాత సియెరా DNAని కొనసాగిస్తూ ఆధునిక డిజైన్ అంశాలను జోడించారు. ఫ్రంట్‌లో కనెక్టెడ్ LED హెడ్‌ల్యాంప్స్, క్లోజ్డ్ గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్ డిజైన్ కనిపించనున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్‌డ్-అవుట్ A & C పిల్లర్స్, సియెరాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన వంపుతో కూడిన రియర్ గ్లాస్ డిజైన్ కొనసాగనుంది. టాప్ వేరియంట్లలో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా అందించే అవకాశం ఉంది. మొత్తం మీద సియెరా EV ప్రీమియం SUV లుక్‌తో మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

 ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో హైటెక్ క్యాబిన్

సియెరా EV ఇంటీరియర్ కూడా అత్యాధునిక టెక్నాలజీతో నిండివుండనుంది. టాప్ వేరియంట్లలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లేతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అందించనున్నారు. అదనంగా ప్యానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), ప్రీమియం ఆడియో సిస్టమ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

 హారియర్ EV టెక్నాలజీతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్

సియెరా EVని, టాటా కొత్త acti.ev+ ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై హారియర్ EVని కూడా రూపొందించారు. దీంతో, సియెరా EVలో కూడా 65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది.

కంపెనీ సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ SUV రియర్ వీల్ డ్రైవ్ (RWD) & ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా 75kWh బ్యాటరీతో AWD వెర్షన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హారియర్ EVతో పోలిస్తే సియెరా పరిమాణంలో కొద్దిగా చిన్నదిగా ఉండటంతో, అదే బ్యాటరీతో మరింత మెరుగైన డ్రైవింగ్ రేంజ్ అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 ధర ఎంత ఉండొచ్చు?

టాటా సియెరా EV ధర రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది Mahindra BE 6, Hyundai Creta Electric, MG ZS EV, Maruti e Vitara వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

టాటా సియెరా EV ఎప్పుడు ప్రపంచానికి పరిచయం కానుంది?

టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ SUV టాటా సియెరా EVని జూన్ 30న అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇది కంపెనీ EV పోర్ట్‌ఫోలియోలో ఏడో మోడల్.

టాటా సియెరా EV డిజైన్ ప్రత్యేకతలు ఏమిటి?

సియెరా EV పాత సియెరా DNAతో పాటు ఆధునిక డిజైన్ అంశాలను కలిగి ఉంటుంది. కనెక్టెడ్ LED హెడ్‌ల్యాంప్స్, క్లోజ్డ్ గ్రిల్, వంపుతో కూడిన రియర్ గ్లాస్ డిజైన్ దీని ప్రత్యేకతలు.

సియెరా EV క్యాబిన్‌లో ఎలాంటి అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఉంటాయు?

దీని టాప్ వేరియంట్లలో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ (డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ డిస్‌ప్లే) ఉంటుంది. ప్యానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి కూడా లభించే అవకాశం ఉంది.

టాటా సియెరా EV ఏ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేయబడింది? బ్యాటరీ ఆప్షన్లు ఏమిటి?

ఇది టాటా కొత్త acti.ev+ ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. 65kWh మరియు 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది.

టాటా సియెరా EV అంచనా ధర ఎంత ఉండవచ్చు?

టాటా సియెరా EV ధర రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో పలు ఇతర EV మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
Embed widget