అన్వేషించండి

కొత్త లుక్‌లో వస్తున్న Tata Punch EV Facelift.. ఆకర్షిస్తున్న సన్‌రూఫ్, 500 KM రేంజ్ !

టాటా మోటార్స్ త్వరలో కొత్త టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. డిజైన్, ఫీచర్లు, రేంజ్, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ధర వివరాలు తెలుసుకుందాం.

Tata Motors EV | టాటా మోటార్స్ అంటే నమ్మకమైన బ్రాండ్లలో ఒకటి. టాటా మోటార్స్ తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ SUV టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) ని ఫిబ్రవరి 20న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త టాటా Punch EV మునుపటి కంటే ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన ఫీచర్లు, ఎక్కువ కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుంది. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, నమ్మదగిన ఎలక్ట్రిక్ కారును కోరుకునే కస్టమర్ల కోసం టాటా మోటార్స్ ఈ ఈవీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు లాంచ్ అయ్యాక EV విభాగంలో పలు కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 

డిజైన్, లుక్ లో కొత్తగా ఏముంటుంది?

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) డిజైన్ లో పలు మార్పులకు అవకాశం ఉంది. దీని ఫ్రంట్ ఫేసియాను కొద్దిగా రీడిజైన్ చేయవచ్చు. ఇందులో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కనెక్టెడ్ LED DRLలు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉండవచ్చు. ముందు, వెనుక బంపర్‌లకు కూడా కొత్త లుక్ ఇస్తారు. దీనివల్ల టాటా పంచ్ ఈవీ SUV మరింత మోడ్రన్, ప్రీమియం లుక్ వస్తుంది. ఈ మార్పులు ఇటీవల వచ్చిన Punch ICE Facelift నుంచి ప్రేరణ పొందాయని కంపెనీ చెబుతోంది. ఎక్కువ కిలోమీటర్ల రేంజ్  కలిగిన వేరియంట్‌లలో ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్‌లు కూడా ఇస్తారని అంచనాలు ఉన్నాయి.

ఫీచర్లు, భద్రతలో పెద్ద అప్‌గ్రేడ్

కొత్త టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లో పెద్ద 12.3 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది. దీంతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, సబ్‌వూఫర్‌తో ప్రీమియం హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వస్తాయని మార్కెట్లో టాక్ నడుస్తోంది. టెక్నాలజీ విషయానికి వస్తే ఈ EV ఫేస్‌లిఫ్ట్ మునుపటి కంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. భద్రత విషయానికి వస్తే, ఇందులో లెవెల్ 2 ADAS ఫీచర్లు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ సహా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉండనున్నాయి. దీంతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కొనసాగించవచ్చు.

బ్యాటరీ, రేంజ్ మెరుగుదల

ప్రస్తుత టాటా Punch EV లో 25 kWh, 35 kWh బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 35 kWh బ్యాటరీని 40.5 kWh తో మార్చే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం కొత్త టాటా Punch EV ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు సాఫీగా ప్రయాణం చేయవచ్చు. అయితే, టాటా మోటార్స్ త్వరలో ఫీచర్లపై స్పష్టత ఇస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. .

ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుతం Tata Punch EV ఎక్స్-షోరూమ్ ధర 9.99 లక్షల రూపాయల నుంచి రూ.14.44 లక్షల వరకు ఉంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొత్త ఫీచర్లు, పెద్ద బ్యాటరీ కారణంగా ధర పెరిగే అవకాశం ఉంది. దీని టాప్ వేరియంట్ దాదాపు 15 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget