కొత్త హ్యుందాయ్ కారు కొనాలనుకుంటున్నారా? ఎక్స్‌టర్, i20, క్రెటాపై రూ.98,000 వరకు భారీ బెనిఫిట్స్
జనవరి 2026లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎక్స్‌టర్, ఐ20, క్రెటా, వెర్నా సహా కార్లపై రూ.25,000 నుంచి రూ.98,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది.

Hyundai Exter Discount: కొత్త ఏడాది ఆరంభంలో కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ మోటార్ ఇండియా అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ నెల (జనవరి 2026)లో హ్యుందాయ్, దాదాపు తన అన్ని పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఎక్స్‌టర్, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, వెర్నా, వెన్యూ, క్రెటా, అల్కజార్, ఆరా వంటి కార్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్లు, కార్పొరేట్ ఆఫర్లు లభిస్తున్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై రూ.98,000 వరకు డిస్కౌంట్
హ్యుందాయ్ లైనప్‌లో జనవరిలో అత్యధిక లాభాలు అందిస్తున్న మోడల్ ఎక్స్‌టర్. ఈ చిన్న SUVపై రూ.98 వేల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా SX వేరియంట్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఉన్నాయి. SX(O) వేరియంట్‌పై రూ.90 వేల వరకు, S వేరియంట్లపై రూ.83 వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.
CNG వేరియంట్లకు డిస్కౌంట్లు కొంచెం తక్కువగా రూ.63,000 వరకు ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.64 లక్షల నుంచి రూ.9.38 లక్షల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ i20పై రూ.95,000 వరకు లాభాలు
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఉన్న హ్యుందాయ్ i20పై జనవరిలో రూ.95 వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై ఎక్కువ లాభాలు ఉన్నాయి. i20 ఎన్ లైన్ వేరియంట్లపై కూడా రూ.87 వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
గ్రాండ్ i10 నియోస్‌పై రూ.89,000 వరకు డిస్కౌంట్
గ్రాండ్ i10 నియోస్‌పై గరిష్టంగా రూ.89 వేల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై ఎక్కువ లాభాలు ఉండగా, CNG వేరియంట్లపై రూ.80 వేల వరకు డిస్కౌంట్ ఉంది.
హ్యుందాయ్ వెర్నా, అల్కజార్ ఆఫర్లు
హ్యుందాయ్ వెర్నాపై జనవరిలో రూ.70,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నారు. టర్బో పెట్రోల్, నాన్ టర్బో పెట్రోల్ వేరియంట్లు ఈ ఆఫర్ల పరిధిలోకి వస్తాయి.
మూడు వరుసల SUV అయిన అల్కజార్‌పై రూ.65,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్లు ఉన్నాయి.
వెన్యూ, ఆరా, క్రెటా డిస్కౌంట్లు
పాత తరం వెన్యూ MY2025 స్టాక్‌పై రూ.60,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కొత్త వెన్యూపై రూ.25,000 వరకు మాత్రమే బెనిఫిట్లు ఉన్నాయి. ఆరా సెడాన్‌పై రూ.58,000 వరకు, క్రెటాపై రూ.40,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, ఈ జనవరిలో హ్యుందాయ్ కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మీ బడ్జెట్, అవసరాలకు తగ్గ మోడల్‌ను ఎంచుకుని ఈ భారీ డిస్కౌంట్లను ఉపయోగించుకోవచ్చు.
ఈ డిస్కౌంట్లు నగరం, వేరియంట్, ఇంధన రకం ఆధారంగా మారవచ్చు. స్టాక్ లభ్యతపై కూడా ఆఫర్లు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీప హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించడం అవసరం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















