Tata Nexon: సేల్స్‌లో నెక్సాన్ కొత్త రికార్డు - ఎన్ని యూనిట్లు రెడీ అయ్యాయంటే?
Tata Nexon Sales: టాటా నెక్సాన్ సేల్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఏకంగా ఆరు లక్షల యూనిట్లు అమ్ముడుపోతాయి.
Tata Nexon Records 6 Lakh Production Milestone: టాటా నెక్సాన్ ఆధిపత్యం భారతీయ మార్కెట్లో కొనసాగుతోంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఆరు లక్షల యూనిట్‌ను ఉత్పత్తి చేయడం విశేషం. కంపెనీ ఈ సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీని 2017లో విడుదల చేసింది. ఈ కారు భారతీయ కస్టమర్ల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడంలో విజయవంతమైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ మోడల్ ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది.
టాటా నెక్సాన్ ధర
టాటా నెక్సాన్ ప్రస్తుతం దేశంలో ఐసీఈ, ఈవీ మోడల్స్‌లో అందుబాటులో ఉంది. ఐసీఈ వేరియంట్ ధర రూ. 8.10 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈవీ కార్ల ధర రూ. 14.74 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
టాటా నెక్సాన్ ఇంజిన్ ఇలా...
టాటా నెక్సాన్ ఇంజిన్ గురించి చెప్పాలంటే ఇందులో 118 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. దీంతో పాటు 113 బీహెచ్‌పీ పవర్, 260 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇక ట్రాన్స్‌మిషన్ గురించి చెప్పాలంటే 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ, 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి.
గత సంవత్సరం సెప్టెంబరులో కంపెనీ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రారంభించింది. ఇది కొత్త రూపాన్ని, సరికొత్త డిజైన్‌ను పొందింది. ఇది కాకుండా అనేక ఫీచర్లు కూడా యాడ్ చేశారు. దీని విభాగంలో నెక్సాన్ ఎస్‌యూవీ... మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్ వంటి కార్లతో పోటీపడుతుంది.
టాటా నెక్సాన్ ఫీచర్లు
దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే నెక్సాన్ ఎస్‌యూవీ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ప్యాడిల్ షిఫ్టర్స్, 9 స్పీకర్ సౌండ్‌లను కలిగి ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
మరోవైపు భారతదేశంలోని రెండు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు అయిన మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సంవత్సరం దేశంలో కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నాయి. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లను 2024లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కూడా రాబోయే నెలల్లో మార్కెట్లోకి రానుంది. కొత్త వాగన్ఆర్ ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ ఈ సంవత్సరాన్ని ఇప్పటికే అప్‌డేట్ చేసిన క్రెటాతో ప్రారంభించింది. దీని తరువాత హ్యుందాయ్ 2024 సగం పూర్తయ్యే నాటికి క్రెటా ఎన్ లైన్, అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌లను పరిచయం చేస్తుంది.