అన్వేషించండి

Tata Cars Price Drop: టాటా నెక్సాన్ ఈవీపై భారీ తగ్గింపు - ఏకంగా రూ.లక్షకు పైగా!

Tata Nexon EV Price Drop: టాటా తన ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్ అందించింది. వీటి ధర రూ.1.2 లక్షల మేర తగ్గింది.

Tata Motors Cuts EV Prices: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన నెక్సాన్, టియాగో ఈవీ ధరలను రూ. 1.2 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీలో ఉపయోగించే బ్యాటరీ సెల్స్ ధరలు స్వల్పంగా తగ్గడంతో టాటా ధరలను తగ్గించింది. ప్రస్తుతానికి నెక్సాన్, టియాగో ఈవీ ధరల్లో మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే ఇటీవల లాంచ్ అయిన పంచ్ ఈవీ ధరలో ఎటువంటి మార్పు లేదు.

ధర తగ్గింపు తర్వాత టాటా టియాగో ఈవీ భారతదేశంలో రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ ధర రూ. 16.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఈ ధర తగ్గింపుపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ ఒక పత్రికా ప్రకటనలో ‘ఈవీ మొత్తం ధరలో బ్యాటరీ ధర చాలా భాగం. బ్యాటరీ సెల్ ధరలు ఇటీవలి కాలంలో మోడరేట్ చేశారని చెప్పారు.

టాటా టియాగో ఈవీ 2022 అక్టోబర్‌లో రూ.8.49 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఆప్షన్ 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. రెండో ఆప్షన్ 9.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

టాటా నెక్సాన్ కారు ఆధిపత్యం భారతీయ మార్కెట్లో కొనసాగుతోంది. ఇటీవలే టాటా మోటార్స్ నెక్సాన్ ఆరు లక్షల యూనిట్‌ను ఉత్పత్తి చేయడం విశేషం. కంపెనీ ఈ సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీని మొదటిగా 2017లో విడుదల చేసింది. ఈ కారు భారతీయ వినియోగదారుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడంలో విజయవంతమైంది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్ ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది. టాటా నెక్సాన్ ప్రస్తుతం దేశంలో ఐసీఈ, ఈవీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఐసీఈ వేరియంట్ ధర రూ. 8.10 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈవీ కార్ల ధర రూ. 14.74 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్‌లో 118 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించారు. దీంతో పాటు 113 బీహెచ్‌పీ పవర్, 260 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్‌ ఇంజిన్‌ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ, 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. 2023 సెప్టెంబరులో కంపెనీ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రారంభించింది. ఇది కొత్త రూపాన్ని, సరికొత్త డిజైన్‌ను కూడా పొందింది. అనేక ఫీచర్లు కూడా యాడ్ చేశారు. దీని విభాగంలో నెక్సాన్ ఎస్‌యూవీ... మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్ కార్లతో పోటీపడుతుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget