అన్వేషించండి

Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

Tata Curvv Waiting Period Increased: టాటా ఇటీవల లాంచ్ చేసిన కర్వ్ ఎస్‌యూవీ పెద్ద సక్సెస్ అయింది. దీంతో దీనికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ కూడా వేరియంట్‌ను బట్టి మూడు నెలలు పెరిగింది.

Tata Curvv Waiting Period: టాటా కర్వ్ అనేది ఒక కూపే ఎస్‌యూవీ. ఈ కారుకు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్ 2024 ఆగస్టులో మొదట భారత మార్కెట్లో లాంచ్ అయింది. దీని తర్వాత పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ వేరియంట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. జనాల్లో ఈ కారు క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే దాని వెయిటింగ్ పీరియడ్ కూడా మూడు నెలలకు పెరిగింది. టాటా కర్వ్ వెయిటింగ్ పీరియడ్ దాని వేరియంట్ ప్రకారం మారుతూ ఉంటుంది.

టాటా కర్వ్ ఈవీ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది?
టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు నాలుగు వారాలకు చేరుకుంది. టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ పెడితే 430 కిలోమీటర్లుగా ఉంది. దీని 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఈ కారు 502 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టాటా కర్వ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!

డీజిల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది?
టాటా కర్వ్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే దీని ఎంట్రీ లెవల్ స్మార్ట్ వేరియంట్ రెండు నెలల వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉంది. అదే సమయంలో దాని మిగతా మూడు వేరియంట్లు అయిన ప్యూర్, క్రియేటివ్, అకాంప్లిష్డ్ మోడల్స్ డెలివరీకి ఒక నెల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ వాహనంలోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 118 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.

పెట్రోల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ ఎంత?
ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన టాటా కర్వ్ పెట్రోల్ వేరియంట్ కోసం కూడా వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా ఉంది. టాటా కర్వ్ పెట్రోల్ వేరియంట్ కొనుగోలు చేయాలంటే మీరు దాదాపు మూడు నెలల పాటు వేచి ఉండాలి. ఈ కారు 1.2 లీటర్ టర్బో ఇంజన్‌తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది. కారులోని ఈ ఇంజన్ 120 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. టాటా కర్వ్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

మరోవైపు టాటా కర్వ్ ఈవీకి పోటీ ఇచ్చేందుకు స్కోడా ఒక కొత్త కారును తీసుకురానుంది. గ్లోబల్ మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎల్రోక్ గ్లింప్స్‌ను స్కోడా ఇటీవలే విడుదల చేసింది. స్కోడా ఇండియా ఈ కారును భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. స్కోడా ఎన్యాక్ కంటే కాస్త తక్కువ రేంజ్‌లో స్కోడా ఎల్రోక్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. స్కోడా ఎన్యాక్ అనేది పూర్తిగా ఫారిన్ మేడ్ కారుగా ఉండనుంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో స్కోడా లాంచ్ చేసిన మొదటి కారు కూడా కావడం విశేషం.

Also Read: రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Refurbished Laptop Buying Tips: రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలుపట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Refurbished Laptop Buying Tips: రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Unstoppable With NBK S4: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sravanthi Chokarapu : ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
Embed widget