Tata Curvv ICE Vesrions: పెట్రోల్, డీజిల్ టాటా కర్వ్ వెర్షన్స్ లాంచ్, ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు
Tata Curvv ICE Price | టాటా కర్వ్ పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లను ఆ కంపెనీ నేడు విడుదల చేసింది. వీటి ప్రారంభ ధరలు రూ. 9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Tata Curvv ICE Versions Launched: టాటా కర్వ్ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. గత నెలలోనే కర్వ్ ఈవీని టాటా మోటార్స్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా టాటా కర్వ్ ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్‌లను విడుదల చేసింది. టాటా ఎలక్ట్రిక్ కర్వ్ EV ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో కొనుగోలుకి అందుబాటులో ఉంది. అయితే కర్వ్ ఈవీతో పోల్చితే ICE వెర్షన్లను చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ కొత్త కార్ల బుకింగ్‌లు ఈరోజు ప్రారంభం కానున్నాయి. డెలివరీలు ఈ నెల 12న ప్రారంభమవుతాయి.
ధర
టాటా కర్వ్ ICE వెర్షన్‌లు ఎనిమిది వేరియంట్స్, ఆరు కలర్ ఆప్షన్‌లలో వస్తాయి. అలాగే మూడు ఇంజిన్ ఆప్షన్స్, మల్టీపుల్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్స్‌తో ఈ కార్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ధరలను కంపెనీ ప్రకటించింది. వీటి ధరలను నవంబర్‌లో పెంచనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
డిజైన్
టాటా కర్వ్ ICE డిజైన్ టాటా కర్వ్ EVని పోలినట్లు ఉంటుంది. అయితే ఎయిర్ వెంట్స్, ఫ్రంట్ గ్రిల్స్‌లో మాత్రమే కొన్ని తేడాలు ఉన్నాయి. కర్వ్ ICE కూపే టైప్ ఎస్‌యూవీ డిజైన్‌లో వచ్చింది. గత నెలలో ఐసీఈ వెర్షన్‌లో విడుదలైన తొలి కూపే స్టైల్ ఎస్‌యూవీగా సిట్రోయిన్ బసాల్ట్ నిలిచింది. ముందుగా కంపెనీ వెల్లడించిన విదంగా టాటా కర్వ్‌ని కూపై డిజైన్‌తో తీసుకువచ్చింది.
ఇంటీరియర్ ఫీచర్లు
టాటా కర్వ్ ICE ఇంటీరయ్‌లోనూ కర్వ్ EVలో కనిపించే విధంగానే ఉన్నాయి. అయితే ఇది టాటా హారియర్‌తో సమానమైన 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. ఇది ఇంటీరియర్‌కి మరింత ప్రీమియం లుక్ అండ్ మంచి ఫీల్‌ని అందిస్తుంది. డాష్‌బోర్డ్ చుట్టూ యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్‌ను కలిగి ఉంది. ఇది Apple CarPlay, Android Autoకి సపోర్ట్ చేసే 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉంది.
సేఫ్టీ
ఇక సేఫ్టీ విషయానికి వస్తే అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. అయితే హై వేరియంట్‌లలో ADAS ఫీచర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి వాటిని అదనంగా ఇవ్వనున్నారు.
ఇంజిన్
టాటా కర్వ్ ICE మూడు ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్లు కాగా ఒక డీజిల్ ఇంజిన్. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 118bhp శక్తిని, 170 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ T-GDi టర్బో పెట్రోల్ ఇంజిన్ 123 bhp శక్తిని అలాగే 225 nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 113bhp శక్తిని మరియు 260nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడు ఇంజిన్లలోనూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడ్డాయి. డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉన్న మొదటి టాటా డీజిల్ కారుగా కర్వ్ నిలిచింది.
టాటా కర్వ్ ప్రత్యర్థులు
టాటా కర్వ్ నేరుగా సిట్రోయిన్ బసాల్ట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, ఎమ్‌జి ఆస్టర్, స్కోడా కుషాక్, టయోటా హైరైడర్, ఫోక్స్‌వ్యాగన్ టిగూన్‌లతో సహా అనేక మోడల్‌లతో పోటీపడుతుంది. టాటా కంపెనీ తీసుకువస్తున్న కొత్త మోడళ్లలో డిజైన్, ఫీచర్లలో స్టాండర్డ్ ప్రమాణాలను పాటిస్తుంది. అందువల్ల ఈ కంపెనీ కార్లు సేఫ్టీలో మార్కెట్‌లోనే టాప్‌లో కొనసాగుతున్నాయి.