Tata Altroz Automatic DCA review: రూ.10 లక్షల్లో అదిరిపోయే కారు - టాటా అల్ట్రోజ్ ఆటోమేటిక్ డీసీఏ రివ్యూ!
ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇటీవలే లాంచ్ చేసిన అల్ట్రోజ్ డీసీఏ రివ్యూ
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అంటే కేవలం మైలేజ్ లేదా స్పేస్ మాత్రమే కాదు. ఎందుకంటే వినియోగదారుడు హ్యాచ్‌బ్యాక్‌పై ఎక్కువ ఖర్చు చేసినప్పుడు స్టైలింగ్, ఫీచర్లు, సౌలభ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆల్ట్రోజ్ దాని లుక్స్, హై సేఫ్టీ రేటింగ్, వాల్యూ పొజిషనింగ్ కారణంగా విజయవంతమైంది.
అయితే ఇప్పుడు దాని ఆటోమేటిక్ వేరియంట్ ఈ కారు ఆకర్షణను మరింత పెంచుతుంది. అయితే, ఈ కారు డ్రైవింగ్ అనుభవం గురించి మాట్లాడే ముందు, స్పెసిఫికేషన్ల గురించి చర్చించాలి. Altroz DCA డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌లో లభిస్తుంది. ఇందులో 86 బీహెచ్‌పీ ఉన్న 1.2l పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందించారు. దీని ధర రూ.10 లక్షలకు పైగా ఉంది. ఏమైనప్పటికీ, DCT లేదా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అనేది ఒక ఆసక్తికరమైన ఎంపిక. ఎందుకంటే ప్రీమియం కార్లు మాత్రమే దీంతో వస్తాయి. దీని ప్రత్యర్థి అయిన హ్యుండాయ్ నుండి i20, ఇతర కార్లు ఈ ధర వద్ద స్టాండర్డ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా CVT లేదా AMTతో వస్తాయి. DCT అంటే దానికి రెండు క్లచ్‌లు ఉన్నాయి, ఒకటి సరి గేర్‌లకు, మరొకటి బేసి గేర్‌లకు. అంటే ఇతర ఆటోమేటిక్‌లతో పోల్చినప్పుడు మెరుగైన షిఫ్ట్ టైమ్స్, మెరుగైన మైలేజీ అందిస్తుంది.
ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.10 లక్షల కంటే తక్కువే. డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ కార్లలో అత్యంత చవకైనది ఇదే. ఇందులో యాక్టివ్ కూలింగ్, మెషీన్ లెర్నింగ్, షిఫ్ట్ బై వైర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వేర్వేరు కండీషన్లలో ఉన్న రోడ్డు, వాతావరణాల విషయాల్లో ఈ కారును స్వయంగా పరీక్షించినట్లు టాటా మోటార్స్ తెలిపింది.
డీసీఏ కాగితంపై బాగానే కనిపించినప్పటికీ, సిటీ ట్రాఫిక్‌లో, చిన్న హైవేలో డ్రైవ్ చేసినప్పుడు కారు గురించి మరింత తెలిసింది. గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా ప్రారంభమవుతుంది. సిటీ ట్రాఫిక్‌లో గేర్ షిఫ్ట్‌లు బాగున్నాయి. లాగ్, జెర్క్ వంటి సమస్యలు లేవు. తక్కువ వేగంతో నడిపేటప్పుడు, డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ బాగా పనిచేసింది. సిటీలో దీని కన్వీనియన్స్ చాలా బాగుంది కాబట్టి ప్రజలు దీనిని ఇష్టపడవచ్చు.
మైలేజీ పరంగా, ఇది మాన్యువల్ కంటే ఎక్కువ వెనుకబడి లేదు. 10-12kmpl మైలేజ్‌ను అందిస్తుందని అంచనా. ఆల్ట్రోజ్ DCA వెట్ క్లచ్‌ని ఉపయోగిస్తుంది. ఇది డ్రై క్లచ్ కంటే మరింత నమ్మదగినదిగా ఉంటుంది. వేడి సమస్యలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఇదే కీలకమైన అంశం. టాటా మోటార్స్ హీటింగ్ సమస్యలను తొలగించడానికి కష్టపడి పని చేసింది.
ఈ కారులో నచ్చినవి - గేర్ బాక్స్ షిఫ్ట్ క్వాలిటీ, తక్కువ ధర
నచ్చనివి - టర్బో పెట్రోల్ వేరియంట్లో డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ లేకపోవడం
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?