అన్వేషించండి

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు

టాటా ఏరిస్ పెట్రోల్ కారులో విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన ప్రయాణం ప్లస్ పాయింట్లు. ఇంజిన్ పనితీరు, గేర్‌బాక్స్, శబ్దం విషయంలో ఉన్న లోపాలేంటో తెలుసుకోండి.

Tata Aeris Details In Telugu: కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టాటా టిగోర్‌ స్థానంలో వచ్చిన కొత్త మోడల్‌.. టాటా ఏరిస్‌. టాటా కంపెనీ ఈ కారు (టిగోర్‌) పేరును మాత్రమే కాదు.. కారు రూపం, లోపలి డిజైన్, ఫీచర్లలోనూ మార్పులు చేసింది. అయితే ఈ కారు కొనడం నిజంగా మంచి నిర్ణయమేనా? ఇందులో ఆకట్టుకునే అంశాలేంటి? నిరాశపరిచే విషయాలేంటి? డ్రైవింగ్ అనుభవం ఆధారంగా తెలుసుకుందాం.

కొనడానికి కారణం 1: విశాలమైన క్యాబిన్, మెరుగైన ఫీచర్లు

టాటా ఏరిస్‌లోకి అడుగుపెట్టగానే విశాలమైన క్యాబిన్ ఆకట్టుకుంటుంది. లేత గోధుమ రంగుతో ఉన్న అలంకరణ లోపలి భాగానికి మరింత హాయిగా ఉండే రూపాన్ని ఇస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై ఫ్యాబ్రిక్‌ ట్రిమ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అవసరమైన పనుల కోసం ఫిజికల్‌ బటన్లు కూడా అందించారు. ఇవి గట్టిగా, నాణ్యంగా ఉన్నట్లు అనిపిస్తాయి. సియెర్రా తరహా డోర్‌ హ్యాండిళ్లు కూడా బలంగా ఉంటాయి.

వెనుక సీట్లలో కూర్చునే వారికి తగినంత స్థలం లభిస్తుంది. కాళ్లు పెట్టుకునే చోటు, మోకాళ్లకు స్థలం బాగుంటాయి. తొడలకు సరిపడా ఆధారం ఉండటంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ కారులో 419 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది ఈ విభాగంలో అత్యధికమని కంపెనీ పేర్కొంది. బూట్ తెరవడానికి గ్యాస్ స్ట్రట్‌లను ఉపయోగించారు. దీంతో సామాన్లు పెట్టుకునే సమయంలో ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.

ఫీచర్ల విషయంలోనూ ఏరిస్ ముందుంది. టాప్ వేరియంట్‌లో ముందు సీట్లకు వెంటిలేషన్ సౌకర్యం ఉంది. 360 డిగ్రీల కెమెరాను డ్యాష్‌క్యామ్‌లా ఉపయోగించుకునే ప్రత్యేకత కూడా ఉంది. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ తెరతో పాటు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు అందించారు.

ఇది కూడా చదవండి: ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు

కొనడానికి కారణం 2: గుంతల రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణం

మన దేశంలోని రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ప్రయాణ సౌకర్యం చాలా ముఖ్యం. ఈ విషయంలో టాటా ఏరిస్ మంచి పనితీరు కనబరుస్తుంది. గుంతలు, ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై సస్పెన్షన్ కుదుపులను సమర్థంగా తగ్గిస్తుంది.

ఈ కారులో 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీంతో పెద్ద స్పీడ్ బ్రేకర్లను దాటేటప్పుడు ఇబ్బందులు తగ్గుతాయి. వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు కూడా కారు స్థిరత్వాన్ని నిలబెట్టుకుంటుంది. వేగంగా లేన్ మార్చాల్సి వచ్చినా సస్పెన్షన్ తగిన మద్దతు ఇస్తుంది.

కొనకూడదనిపించే కారణం 1: ఇంజిన్, గేర్‌బాక్స్ పనితీరులో లోపాలు

టాటా ఏరిస్ పెట్రోల్‌లో 1.2 లీటర్ల మూడు సిలిండర్ల సహజ ఇంజిన్ ఉంది. ఇది 86 హెచ్‌పీ శక్తిని, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ప్రత్యర్థి కార్లతో పోలిస్తే ఇంజిన్ పనితీరు అంత సున్నితంగా లేదనే అభిప్రాయం ఉంది.

హైవేపై వేగం పెంచుకోవడానికి ఇంజిన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకోవడంలోనూ షార్ప్‌నెస్‌ తక్కువగా అనిపిస్తుంది. AMT గేర్‌బాక్స్‌లో గేర్లు మారేటప్పుడు కుదుపులు కనిపిస్తాయి. మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా హోండా, హ్యుందాయ్, మారుతి కార్లలో ఉన్నంత సులభంగా పని చేయదని డ్రైవింగ్ టెస్ట్‌లో తేలింది.

ఇది కూడా చదవండి: 2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!

కొనకూడదనిపించే కారణం 2: ఇంజిన్ శబ్దం, కంపనాలు

ఇంజిన్ పనితీరుతో పాటు శబ్దం కూడా ఏరిస్‌లో ఒక లోపంగా కనిపిస్తుంది. కారు నిలిచివున్నప్పుడు లేదా తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు కంపనాలు క్యాబిన్‌లోకి వస్తాయి. ఇంజిన్ నుంచి వచ్చే కఠినమైన శబ్దం ఎక్కువదూరం ప్రయాణించేటప్పుడు అసౌకర్యాన్ని కలిగించవచ్చు.

వేగం పెరిగే కొద్దీ ఇంజిన్ కంపనాలు, గాలి శబ్దం, రోడ్డు నుంచి వచ్చే శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో ఇది డ్రైవింగ్ అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది.

మీకు ఏరిస్ సరిపోతుందా?

టాటా ఏరిస్ పెట్రోల్‌లో విశాలమైన క్యాబిన్, పెద్ద బూట్ స్పేస్, అధునాతన ఫీచర్లు, సౌకర్యవంతమైన సస్పెన్షన్ ప్రధాన ఆకర్షణలు. కుటుంబంతో ప్రయాణించేవారికి, రోజువారీ వినియోగానికి స్థలం, సౌకర్యం ముఖ్యమైతే ఈ కారు పరిశీలించదగిన ఎంపిక. అయితే ఇంజిన్ సున్నితమైన పనితీరు, వేగంగా స్పందించే గేర్‌బాక్స్, ప్రశాంతమైన హైవే ప్రయాణం కోరుకునేవారు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా AMT వేరియంట్‌ను ఎంచుకునే ముందు తప్పనిసరిగా టెస్ట్ డ్రైవ్ చేయడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Embed widget