అన్వేషించండి

Suzuki Burgman Street: లేటెస్ట్ ఫీచర్స్‌తో వచ్చిన సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌! అదిరిపోయే డిజైన్‌తో వచ్చిన ఈ వాహనం ధర ఎంతంటే?

Suzuki Burgman Street: మంచి స్టోరేజీ, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన స్కూటర్‌ కోరుకునే వారి కోసం సుజుకీ బర్గ్‌మన్‌స్ట్రీట్‌ను సరికొత్తగా తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర, ఫీచర్లు గురించి చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సుజుకీ కొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 మోడల్‌ విడుదల.
  • రూ.1,01,944 నుంచి రూ.1,13,220 ధరతో రెండు వేరియంట్లలో లభ్యం.
  • కొత్త డిజైన్, ఎల్‌ఈడీ లైట్లు, టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో ఆకర్షణీయం.
  • కీలెస్‌ స్టార్ట్, ఆన్సర్ బ్యాక్, యూఎస్‌బీ పోర్ట్‌ సౌకర్యాలు.

Suzuki Burgman Street: భారతీయ మార్కెట్‌లో స్కూటర్లకు ప్రత్యేక ఆదరణ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సుజుకీ లేటెస్ట్ హంగులతో రెండో తరానికి చెందిన బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ను తీసుకొచ్చింది. అధికారికంగా దీన్ని గురువారం విడుదల చేసింది. తన మాక్సీ స్కూటర్ గుర్తింపును మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ను అప్‌డేట్ చేస్తోంది. 

ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ధర ఎంత ఉంటుంది?

సుజుకి సంస్థ 2026 బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ను ప్రధానంగా రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. దీన్ని ప్రారంభ ధర 1,01,944గా నిర్ణయించారు. రైడ్‌ కనెక్ట్‌ ఎడిషన‌ ధర రూ.1,01,944కాగా, రైడ్ కనెక్ట్‌ టీఎఫ్‌టీ ఎడిషన్ ధర రూ. 1,13, 220. గత మోడల్‌తో పోలిస్తే ధర సుమారు 3500 వరకు పెరిగింది. ఏప్రిల్ 8 నుంచి దేశవ్యాప్తంగా అన్ని సుజుకి డీలర్‌షిప్‌లలో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది. 

డిజైన్‌ మార్పులతో సరికొత్త రూపం 

బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 మోడ్ తన విజువల్ డిజైన్‌లో భారీ మార్పులను పొందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బర్గ్‌మ్‌ 400 నుంచి 750 మోడల్స్ నుంచి స్ఫూర్తి పొంది దీనిని రూపొందించారు. బాడీ-మౌంటెడ్‌ స్ప్లిట్‌ లెన్స్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు,రీ డిజైన్‌ చేసిన ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌లతో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ స్కూటర్ ఇప్పుడు మరింత వంపులు తిరిగిన డిజైన్‌తో, మెటాలిక్ ఫినిష్‌ చిహ్నాలు, డార్క్ స్మోక్డ్‌ విండ్‌స్క్రీన్‌తో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. 

కీలెస్‌ స్కూటర్‌

టాప్ స్పెక్‌ వేరియంట్‌లో రిమోట్ కీఫోబ్ సౌకర్యం ఉంది. దీని వల్ల కీని జేబులో నుంచి తీయకుండానే స్కూటర్‌లను స్టార్ట్ చేవచ్చు. ఇందులో ఆన్సర్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంది. ఇది పార్కింగ్ ఏరియాలో స్కూటర్‌ను సులభంగా వెతకడానికి వీలుపడుతుంది. పాత మోనోక్రోమ్‌ స్క్రీన్ స్థానంలో ఇప్పుడు రంగుల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది నావిగేషన్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రయాణంలో స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి టీఏ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు. 

ఇంజిన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

మెకానికల్‌గా కొన్ని మార్పులు చేసినా, ఇది తన నమ్మకమైన 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తోనే వస్తోంది. ఇది 8.3 నుంచి 8.4 bhp పవర్, 10.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌ కంటే టార్క్ పెరగడం వల్ల తక్కువ వేగంలో కూడా మెరుగైన పెర్ఫార్మెన్స్‌ లభిస్తుంది. ఈ స్కూటర్‌ లీటర్‌కు సుమారు 58కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

స్టోరేజ్‌ ఎంత ఉంది?

రోజువారీ ప్రయాణికులకు ఉపయోగపడేలా ఇందులో పలు మార్పులు చేశారు. సీటు కింద ఉండే స్టోరేజ్ సామర్థ్యాన్ని 21.5 లీటర్ల నుంచి 124.6 లీటర్లకు పెంచారు. దీని వల్ల ఇప్పుడు ఫుల్ ఫేస్ హెల్మెట్‌ పట్టే అవకాశం ఉంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.5 లీటర్లకు పెంచారు. కొత్త సుజుకీ యాక్సెస్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై దీని రూపొందించారు. దీని ఫ్రేమ్ పాత దాని కంటే అరకిలో బరువు తక్కువగా ఉంటుంది.             

Frequently Asked Questions

కొత్త సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

కొత్త సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 ఏప్రిల్ 8 నుంచి దేశవ్యాప్తంగా అన్ని సుజుకి డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది.

కొత్త సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 ధర ఎంత?

కొత్త సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 ప్రారంభ ధర 1,01,944. రైడ్ కనెక్ట్‌ ఎడిషన్ ధర రూ.1,01,944, రైడ్ కనెక్ట్‌ టీఎఫ్‌టీ ఎడిషన్ ధర రూ. 1,13,220.

కొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 లో స్టోరేజ్‌ ఎంత ఉంది?

సీటు కింద స్టోరేజ్ సామర్థ్యం 21.5 లీటర్ల నుంచి 124.6 లీటర్లకు పెరిగింది. ఇది ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను ఉంచడానికి సరిపోతుంది.

కొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 2026 ఇంజిన్‌ వివరాలు ఏమిటి?

ఈ స్కూటర్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8.3-8.4 bhp పవర్, 10.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget