Skoda Octavia: స్కోడా కొత్త ఆక్టేవియా ప్రొడక్షన్ షురూ - త్వరలో మనదేశంలో కూడా!
Skoda New Octavia: స్కోడా కొత్త ఆక్టేవియా ప్రొడక్షన్ చెక్ రిపబ్లిక్‌లో ప్రారంభం అయిందని తెలుస్తోంది.
Skoda Auto: స్కోడా చెక్ రిపబ్లిక్‌లోని దాని ప్రధాన తయారీ కర్మాగారంలో కొత్త ఆక్టేవియా సీరియల్ ఉత్పత్తిని ప్రారంభించింది. స్కోడా ఎక్కువగా విక్రయిస్తున్న ఆక్టేవియా నాలుగో తరంలో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త ఎల్ఈడీ మ్యాట్రిక్స్ బీమ్ హెడ్‌లైట్లు, వాయిస్ అసిస్టెంట్‌లో ఛాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, ఇతర మార్పులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఆక్టేవియా ఉత్పత్తిని క్వాసిని ప్లాంట్‌కు బదిలీ చేయడంతో స్కోడా మ్లాడా బోలెస్లావ్‌లో అదనపు సామర్థ్యాన్ని కూడా జోడిస్తుంది.
తిరిగి ఇండియాకి కూడా...
స్కోడా ఇండియా గత సంవత్సరం మధ్యలో కొత్త బీఎస్6 స్టేజ్ 2 ఎమిషన్ రూల్స్‌కు అనుగుణంగా తన మోడల్ శ్రేణిని అప్‌డేట్ చేసింది. దీని ప్రకారం కంపెనీ ఆక్టేవియా, సూపర్బ్‌లను నిలిపివేసింది. అయితే సూపర్బ్ ఇటీవల సీబీయూ మోడల్‌గా తిరిగి వచ్చింది. స్కోడా ఇండియా ఈ కొత్త వెర్షన్ ఆక్టేవియాను విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడల్‌గా లేదా సీకేడీ మోడల్‌గా అమ్ముడుపోతుందా అనేది మాకు కచ్చితంగా తెలియదు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
క్వాసిని ప్లాంట్‌లో ఉత్పత్తి
265 బీహెచ్‌పీ వరకు పవర్ జనరేట్ చేసే నాలుగు పెట్రోల్, రెండు డీజిల్ ఆప్షన్లతో పాటు మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌తో మ్లాడా బోలెస్లావ్‌లో ఆక్టేవియా ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో స్కోడా ఆక్టేవియా ఉత్పత్తిని క్వాసిని ప్లాంట్‌కు బదిలీ చేయవచ్చు. ఈ చర్య క్వాసినీలో ఆక్టేవియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో ఎన్యాక్, ఎన్యాక్ కూపే, ఎల్రోక్ మోడల్‌ల ఉత్పత్తిపై దృష్టి సారించడానికి మ్లాడా బోలెస్లావ్ ప్లాంట్‌లో స్థలాన్ని ఖాళీ చేస్తుంది. ఆక్టేవియా తాజా వెర్షన్ భిన్నమైన బాహ్య రూపాన్ని కలిగి ఉంది. కొత్త ఎల్ఈడీ మ్యాట్రిక్స్ బీమ్ హెడ్‌లైట్లు ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుంది.
Just ONE day left to enter the ultimate chance to win Škoda's upcoming compact SUV or a trip with Škoda to Prague.
— Škoda India (@SkodaIndia) April 11, 2024
Visit the #NameYourSkoda microsite to vote for your favourite shortlisted name now! You can also comment a new name using the #NameYourSkoda. pic.twitter.com/zWLz7oOay7
ఫీచర్లు ఎలా ఉంటాయి?
ఫీచర్ల పరంగా ఆక్టేవియా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు ప్రామాణికంగా 10 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఏఐ చాట్ బాట్ ఛాట్‌జీపీటీ కొత్త వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్‌లో చేర్చారు. అదనంగా వాహనంలో కొలిషన్ మిటిగేషన్ అసిస్ట్, టర్న్ అసిస్ట్, ఎగ్జిట్ వార్నింగ్ వంటి అధునాతన డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్‌లు ఉన్నాయి.
ఆక్టేవియా వీఆర్ఎస్ మోడల్
స్కోడా ఆక్టేవియాను స్పోర్ట్‌లైన్, వీఆర్ఎస్ వెర్షన్‌లలో అందించడం కొనసాగిస్తుంది. ఆక్టేవియా స్పోర్ట్‌లైన్‌లో నాలుగు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. వీటిలో రెండు డీజిల్, రెండు పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లు. 2000 సంవత్సరం నుంచి ఆక్టేవియా అత్యంత స్పోర్టియస్ట్ వేరియంట్‌లు ప్రముఖ 'వీఆర్ఎస్' పేరుతో లాంచ్ అవుతున్నాయి. 2.0 టీఎస్ఐ ఇంజిన్‌తో కూడిన వీఆర్ఎస్ మోడల్ 265 బీహెచ్‌పీ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.