అన్వేషించండి

Skoda Kylaq Review: స్కోడా కైలాక్‌ - కొనడానికి 3 కారణాలు, వదిలేయడానికి 2 కారణాలు

Skoda Kylaq Safety: ధర, సేఫ్టీ వంటి విషయాల్లో, తన సెగ్మెంట్‌లో స్కోడా కైలాక్‌ బెస్ట్‌ కారే అయినప్పటికీ, ఇంజిన్‌ పరంగా చిన్నపాటి మైనస్‌లు కూడా ఉన్నాయి.

Skoda Kylaq Review Telugu: భారత కాంపాక్ట్‌ SUV మార్కెట్‌ రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్‌, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌, కియా సైరాస్‌, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి బలమైన పోటీ కార్లు ఉన్నాయి. ఈ రేస్‌ మధ్యలో, చెక్‌ కార్‌ మేకర్‌ స్కోడా, తన కొత్త ఎంట్రీ మోడల్‌ కైలాక్‌ (Kylaq) ను నవంబర్‌ 2024లో లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఇది స్కోడా ఇండియా లైనప్‌లోనే అత్యంత చవకైన SUV గా నిలిచింది. దీనిని ఎందుకు కొనాలి, ఏయే కారణాల వల్ల ఆలోచించాలి అనేది వివరంగా తెలుసుకుందాం.

కొనడానికి 3 కారణాలు

1. పోటీదారుల స్థాయిలోనే ధర

తెలుగు రాష్ట్రాల్లో, స్కోడా కైలాక్‌ ధరలు రూ. 8.25 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి మొదలవుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లోని ఎక్కువ మోడళ్ల కన్నా ఈ రేటు కాస్త ఎక్కువగా ఉన్నా, బ్రెజ్జా కన్నా రూ. 44,000 తక్కువ, సైరోస్‌ కన్నా రూ.1.25 లక్షలు తక్కువగా ఉంది. అంటే బడ్జెట్‌ కాంపాక్ట్‌ SUV కొనాలనుకునే వారికి కైలాక్‌ మంచి డీల్‌ అవుతుంది.

2. బలమైన బాడీ, పూర్తి సేఫ్టీ ఫీచర్లు

స్కోడా ఎప్పటి లాగే బిల్డ్‌ క్వాలిటీలో రాజీ పడలేదు. బేస్‌ వేరియంట్‌ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ESC, ABS+EBD, ఓవర్‌స్పీడ్‌ అలర్ట్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ డిఫరెన్షియల్‌ లాక్‌ వంటి ఫీచర్లు ఇస్తుంది.
హయ్యర్‌ వేరియంట్స్‌లో టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, హిల్‌-హోల్డ్‌ కంట్రోల్‌, రియర్‌ వ్యూ కెమెరా కూడా లభిస్తాయి. అంతేకాక, కైలాక్‌ 5-స్టార్‌ భారత్‌ NCAP సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే ఫ్యామిలీలకు ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌.

3. డ్రైవింగ్‌లో ఫన్‌ ఫ్యాక్టర్‌

స్కోడా కైలాక్‌ రోడ్‌పై నడిపినప్పుడు మీరు నిజంగా SUV డ్రైవ్‌ చేస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. 189 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉన్నప్పటికీ, బాడీ రోల్‌ బాగా కంట్రోల్‌ చేస్తుంది. స్టిఫ్‌ చాసిస్‌, క్విక్‌ సస్పెన్షన్‌ సెటప్‌ కారణంగా కారు కార్నర్స్‌లోకి కూడా ఈజీగా వెళ్లిపోతుంది. కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌లో డ్రైవింగ్‌ ఫన్‌ ఇచ్చే మోడల్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుంది.

వదిలేయడానికి 2 కారణాలు

1. లో-రేవ్స్‌లో టర్బో ల్యాగ్‌

కైలాక్‌లో ఇచ్చిన 1.0 లీటర్‌ 3-సిలిండర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ (115hp, 178Nm) మంచి పవర్‌ ఇస్తుంది. కానీ 2000rpm కంటే తక్కువ రేవ్స్‌లో టర్బో ల్యాగ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్‌లో తరచుగా డౌన్‌షిఫ్ట్‌ చేయాల్సి రావచ్చు. ఇది డైలీ సిటీ డ్రైవింగ్‌లో కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

2. రిఫైన్‌మెంట్‌ లోపం

3-సిలిండర్‌ ఇంజిన్‌ కారణంగా కైలాక్‌ రిఫైన్‌మెంట్‌లో కొంత వెనుకబడుతుంది. ఐడిల్‌లో కంపనలు, ఇంజిన్‌ సౌండ్‌ కేబిన్‌లోకి రావడం స్పష్టంగా తెలుస్తుంది. సోనెట్‌, వెన్యూ లాంటి మోడళ్లలో లభించే 4-సిలిండర్‌ ఇంజిన్‌ ఆప్షన్‌ ఇక్కడ లేదు. కాబట్టి NVH లెవల్స్‌కి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది ఒక మైనస్‌ పాయింట్‌.

ఫైనల్‌గా...

స్కోడా కైలాక్‌ ధర, సేఫ్టీ, డ్రైవింగ్‌ ఫన్‌ వంటి పాయింట్స్‌లో కాంపాక్ట్‌ SUV మార్కెట్‌లో బలంగా నిలబడుతుంది. అయితే టర్బో ల్యాగ్‌, రిఫైన్‌మెంట్‌ లోపం లాంటి చిన్న మైనస్‌లు ఉన్నాయి. మీరు సేఫ్టీకి, డ్రైవింగ్‌ థ్రిల్‌కి ప్రాధాన్యం ఇస్తే కైలాక్‌ బెస్ట్‌ ఛాయిస్‌ అవుతుంది. స్మూత్‌ రిఫైన్‌మెంట్‌, సిటీ ట్రాఫిక్‌లో ఈజీ డ్రైవ్‌ కావాలనుకుంటే ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలి.

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget