![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Royal Enfield Bikes: బైక్ లవర్స్‌కు పండగే - రెండు 650 సీసీ బైక్‌లను లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!
Royal Enfield Scram 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో మార్కెట్లో రెండు కొత్త 650 సీసీ బైకులను లాంచ్ చేయనుంది.
![Royal Enfield Bikes: బైక్ లవర్స్‌కు పండగే - రెండు 650 సీసీ బైక్‌లను లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్! Royal Enfield To Launch New 650CC Bikes in India Soon Check Details Royal Enfield Bikes: బైక్ లవర్స్‌కు పండగే - రెండు 650 సీసీ బైక్‌లను లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/3b33d878a2d0f5e8577b4bc218f237971708952818162456_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Upcoming Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు అనేక కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయబోతోంది. కంపెనీ తాజా లాంచ్ షాట్‌గన్ 650, క్లాసిక్ 650, స్క్రామ్ 650లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ పోర్ట్‌ఫోలియో మరింత వ్యాప్తి చెందనుంది. ఎందుకంటే ఈ రెండిటినీ ఇటీవల పరీక్షించారు.
సంవత్సరానికి నాలుగు మోటార్‌సైకిళ్లను విడుదల చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ వ్యూహంలో మొదటి ఉత్పత్తిగా షాట్‌గన్ 650 లాంచ్ చేసింది. ఇది కాకుండా మరో మూడు మోటార్‌సైకిళ్లు 2024లో విడుదల కానున్నాయి. ఈ మూడింటిలో ఒకటి స్క్రామ్ 450 కావచ్చు. ఇది కొత్త హిమాలయన్ 450కి సంబంధించిన స్ట్రిప్డ్ డౌన్ వెర్షన్. ఇతర రెండు లాంచ్‌లలో 350 సీసీ, 650 సీసీ మోడల్స్ ఉండవచ్చు.
650 సీసీ సెగ్మెంట్‌లో వస్తున్న మోటార్‌సైకిళ్లు క్లాసిక్ 650, స్క్రామ్ 650. ఇవి ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్నాయి. ఇటీవలి స్పై షాట్‌లలో రాబోయే క్లాసిక్ 650, స్క్రామ్ 650 ఒకే ఫ్రేమ్‌లో చెన్నై వీధుల్లో తిరుగుతూ కనిపించాయి. వీటి డిజైన్ గురించి చెప్పాలంటే... క్లాసిక్ 650 డిజైన్ దాదాపుగా క్లాసిక్ 350 తరహాలోనే ఉంది. అయితే స్క్రామ్ 650 ఇంటర్‌సెప్టర్ 650 లాగా కనిపిస్తుంది. లాంచ్ చేసినప్పుడు స్క్రామ్ 650కి ఇంటర్‌సెప్టర్ బేర్ 650 అని పేరు పెట్టవచ్చు.
స్క్రామ్ 650 అత్యంత ఫీచర్ లోడెడ్, తేలికైన రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 మోడల్. దీని ప్రధాన ఫ్రేమ్ ఇంటర్‌సెప్టర్ 650, క్లాసిక్ 650, సూపర్ మెటోర్ 650లను పోలి ఉంటుంది. అయితే ఇది క్లాసిక్ 650 కంటే ఎక్కువ ప్రీమియం హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది.
ఇంజిన్ ఇలా
స్క్రామ్ 650 సింగిల్ సైడెడ్ ఎగ్జాస్ట్, నాబీ టైర్‌లతో ఒక సాధారణ టెయిల్‌ను పొందుతుంది. అయితే మనం క్లాసిక్ 650 గురించి మాట్లాడినట్లయితే అది మరింత రాయల్‌గా కనిపిస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లు ఒకే 648 సీసీ పారలల్ ట్విన్ ఇంజన్‌తో రానున్నాయి. ఈ ఇంజిన్లు దాదాపు 47 బీహెచ్‌పీ పీక్ పవర్, 52 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలవు. 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్‌తో పెయిర్ అయి ఉంటాయి.
మరోవైపు కవాసకి భారతదేశంలో రూ. 9.29 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరతో అప్‌డేట్ జెడ్900 బైక్‌ను విడుదల చేసింది. 2023 మోడల్‌తో పోలిస్తే ఈ బైక్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ దీని ధర మాత్రం రూ.9,000 పెరిగింది. కవాసకి జెడ్900లో లిక్విడ్ కూల్డ్ 948 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ యూనిట్‌ను కంపెనీ అందించింది. ఈ ఇంజిన్ 9,500 ఆర్పీఎం వద్ద 125 హెచ్‌పీ, 7,700 ఆర్పీఎం వద్ద 98.6 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మృదువైన ఇంజన్ అసిస్ట్, స్లిప్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఇందులో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ మాత్రం అందించలేదు. ఈ సెగ్మెంట్‌లోని చాలా మోడళ్లలో ఈ ఫీచర్ ఉన్నప్పటికీ జెడ్900 ఇప్పటికీ ఎలక్ట్రానిక్స్‌కు బదులుగా ఓల్డ్ స్కూల్ కేబుల్ థ్రోటెల్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో సస్పెన్షన్ కోసం యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్, మోనోషాక్ రియర్ యూనిట్‌ను అందించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)