Royal Enfield Classic 350: క్లాసిక్ బైక్‌ను రూ.25000 డౌన్ పేమెంట్‌తో కొంటే, నెలకు ఎంత EMI చెల్లించాలి?
Classic 350 On Loan EMI: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో ఏడు వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. క్లాసిక్ 350 చౌకైన మోడల్ - Redditch వెర్షన్. ఈ బైక్ EMI ప్లాన్ తెలుసుకుందాం.

Royal Enfield Classic 350 Price, Down Payment, Loan and EMI Details: భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు క్రేజే వేరబ్బా. ముఖ్యంగా, యూత్‌ను నిద్రపోనివ్వని బ్రాండ్ ఇది, వేరే ఏ కంపెనీ మోటారు సైకిళ్ల మీద ఇంత మోజు ఉండదు. రోజూ స్టైల్‌గా కాలేజీకి లేదా ఆఫీసుకు వెళ్లిరావడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ బ్రాండ్‌లో, క్లాసిక్ 350 లుక్ చాలా అద్భుతంగా ఉంటుంది.
హైదరాబాద్/ విజయవాడలో ధర
వాస్తవానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్‌ల గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు, క్లాసిక్ 350 పేరే మొదట వస్తుంది. మన మార్కెట్‌లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఏడు వేరియంట్లలో లభిస్తుంది. అవి:
- Classic 350 Redditch
- Classic 350 Halcyon
- Classic 350 Heritage
- Classic 350 Heritage Premium
- Classic 350 Signals
- Classic 350 Dark
- Classic 350 Chrome
వీటిలో అత్యంత చవకైన వేరియంట్ "Redditch" & టాప్-స్పెక్ వేరియంట్ "Chrome".
Classic 350 Redditch మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర (Royal Enfield Classic 350 ex-showroom price) 1.97 లక్షలు. హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 2.35 లక్షల రూపాయలు. విజయవాడలో కూడా ఈ బైక్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 2.35 లక్షల రూపాయలు.
పాతిక వేల రూపాయలతో ఈ బండిని ఎలా కొనాలి?
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనడానికి మీ దగ్గర ఫుల్ అమౌంట్ లేకపోయినా పర్లేదు, మీ అకౌంట్‌లో కేవలం రూ. 25 వేలు ఉంటే చాలు, ఈ బండికి మీరు ఓనర్ కావచ్చు. మీరు, మీ దగ్గరలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌కు వెళ్లండి. మీ దగ్గర ఉన్న పాతిక వేల రూపాయలను డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించండి. అక్కడే ఉన్న బ్యాంక్ ప్రతినిధి, మిగిలిన రూ. 2.10 లక్షలకు బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తారు. ఈ డబ్బును ప్రతి నెలా ఈజీ EMI రూపంలో తిరిగి చెల్లించవచ్చు.
ఫైనాన్స్ ప్లాన్
మీరు తీసుకున్న బైక్ లోన్ రూ. 2.10 లక్షల మీద బ్యాంక్ 9 శాతం వడ్డీని వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు మీకు EMI ప్లాన్స్ చూద్దాం, వీటి నుంచి మీకు సూటయ్యే ఒక ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు.
- 4 సంవత్సరాల (48 నెలలు) లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, మీరు నెలకు రూ. 5,934 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
- 3 సంవత్సరాల్లో (36 నెలలు) లోన్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటే, మీరు నెలకు రూ. 7,388 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
- 2 సంవత్సరాల (24 నెలలు) రుణ కాలపరిమితి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 10,297 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
మీకు మంచి ఆదాయ వనరులు ఉండి, కేవలం 1 సంవత్సరంలోనే (12 నెలలు) రుణం మొత్తం తీర్చేయగలిగితే, నెలకు రూ. 19,023 EMI బ్యాంక్‌కు చెల్లించాలి. అయితే, బ్యాంక్‌లు సాధారణంగా 1 సంవత్సరం లోన్ టెన్యూర్‌కు అంగీకరించవు.
బ్యాంక్ ఇచ్చే రుణ మొత్తం, వార్షిక వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ విధానంపై ఆధారపడి ఉంటుంది. మీకు దగ్గర్లో ఉన్న షోరూంను సంప్రదిస్తే మరిన్న వివరాలు తెలుస్తాయి.





















