అన్వేషించండి

తలుచుకుంటే చాలా బాధగా ఉంది - కొత్త Royal Enfield Bear 650 తన యజమానిని ఏడిపించిన అనుభవం ఇది

ఓ బైక్‌ లవర్‌ ఆశగా బుక్‌ చేసుకున్న Royal Enfield Bear 650, రెండో రోజే హ్యాండ్‌ ఇచ్చింది. క్లస్టర్‌, హెడ్‌లైట్‌, ఇండికేటర్‌.. ఇలా అన్నీ సమస్యలే. ఆ వ్యక్తి ఆవేదన సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.

Royal Enfield Bear 650 After Sales Experience: కొత్త బైక్ అంటే ఎంతో కిక్‌. ఓ మోటార్‌ సైకిల్‌ లవర్‌, ముచ్చటపడి కొత్త Royal Enfield Bear 650 బుక్ చేశాడు, ఆ హ్యాపీనెస్‌ మరువలేనిది. కానీ ఆ ఆనందం రెండే రోజుల్లో తుడిచిపోయింది. “నాకు ఈ బైక్‌ జ్ఞాపకాలు నచ్చలేదు” అంటాడు బెంగళూరులోని ఓ యువ మోటార్‌ సైకిలిస్ట్‌.

బెంగళూరుకు చెందిన యువకుడు, Royal Enfield Bear 650 తో తన చేదు అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతను చెప్పిన ప్రకారం: అతను ఆరేళ్లు Pulsar180 తో సంతోషంగా నడిపాడు. ఆ తర్వాత, 20216లో, Royal Enfield Bullet Std500 తీసుకున్నాడు. మొదట్లో అది కూడా చాలా పర్ఫెక్ట్‌ బైక్‌. కొన్నాళ్ల తర్వాత ఇంజిను వేడెక్కడం, వైబ్రేషన్స్‌, మెకానికల్ ఇష్యూస్‌ వల్ల ఇబ్బంది పడ్డాడు, ఇక జీవితంలో Royal Enfield బండి కొనకూడదు అనుకున్నాడు. ఈసారి వేరే బ్రాండ్‌నే ఎంచుకోవాలనే ఉద్దేశంతో ట్రయంఫ్‌, హోండా, KTM వంటి ప్రతీ బైక్‌ను పరిశీలించాడు. కానీ, ఖర్మ బూమరాంగ్‌ అయింది. RE Bear 650 డిజైన్‌ చూశాక ఆగలేకపోయాడు. కుటుంబ సభ్యులంతా కూడా ఓకే అనేశారు. దీంతో ఆ యువకుడు బెంగళూరు బిజీ రోడ్లపై రెండు టెస్టు ఫైట్లు చేసి, Petrol Green వేరియంట్‌ను ఫిక్స్ చేసుకున్నాడు.

డెలివెరీ నెక్ట్స్‌ డే కష్టాలు స్టార్ట్‌
RE Bear 650 డెలివరీ రోజున చూడాలి హడావిడి... కొత్త బైక్‌ ముందు సెల్ఫీలు, ఫ్యామిలీతో ఫోటోలు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు... ప్రతీ యువ బైక్ లవర్‌ ఆనందంగా ఉండే టైమ్‌ అది. ఆ పక్కనే ఉన్న ఫ్యామిలీ కూడా సంతోషంగా చూస్తోంది. కానీ ఆ ఆనందం రాత్రికి రాత్రే ఆవిరవుతుందని ఎవరూ ఊహించలేదు. తర్వాతి రోజు నుంచి మొదలయ్యాయి కష్టాలు. ఫస్ట్.. ఫ్యూయల్‌ పైప్‌లో ఇబ్బంది, బైక్‌ స్టార్ట్ చేయగానే స్క్రీన్‌ బ్లాంక్‌, ఇండికేటర్లు ఆఫ్‌, హెడ్‌లైట్‌ స్విచ్ఛాఫ్. ఒక్కసారే వంతెన పై నుంచి కింద పడినట్టైంది. “డ్రీమ్ బైక్‌కి ఇలా జరుగుతుందని ఎవ్వరైనా ఊహిస్తారా?”.

RE కూడా చేతులెత్తేసిందట!
వెంటనే డీలర్‌కు కాల్ చేశాడు సార్. ఇక్కడి నుంచి స్టార్టయింది మెయిన్‌ స్టోరీ. సర్వీస్‌ సెంటర్‌లో గంటల పాటు గడిపాడు, ఇదేం ఖర్మరా బాబూ అంటూ ఫీలయ్యాడు. RE టెక్నిషియన్‌ అన్నీ చూసి ఓకే అన్నాడు. కానీ స్టోరీ మలుపు తిరగలేదు. మళ్లీ అదే స్క్రిప్ట్‌ రిపీట్‌. వెంటవెంటనే సమస్యలు బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతూనే ఉన్నాయి. దగ్గరుండి అన్నింటినీ చెక్ చేయించినా, బైక్ ఒక్కసారి కూడా ప్రాపర్‌గా నడిచిన పాపానపోలేదు. సర్వీస్ సెంటర్‌ మీద నమ్మకం పోయింది. Royal Enfield కస్టమర్ కేర్‌కు ఫోన్‌ చేసి, తన ఫీలింగ్స్‌ను ఫీలవుతూ చెప్పాడు. అన్నీ వెరిఫై చేసుకుని కాల్‌ బ్యాక్‌ చేస్తాం అన్నారు, రెండు రోజుల వరకు నో కాల్ బ్యాక్‌. అసలు తనను సంప్రదించకుండానే, మేం ఫోన్‌ చేశాం మీ ఫోనే బిజీ వచ్చిదని చెప్పారు అంటాడతను. “ఇలా కాదని ఇమెయిల్‌ పంపినా Royal Enfield టీమ్‌ నుంచి నో రిప్లై!” అంటూ ముక్కు చీదాడు.

ప్రతి యువ బైక్‌ లవర్‌కి బైక్‌ అంటే ఒక ఎమోషన్‌ & తన బాడీలో అదొక భాగం. కొత్త బైక్ డెలివరీ తర్వాత ఎదురయ్యే ఇలాంటి ఎమోషనల్ షాక్‌ను తనలాగా ఇంకెవరూ ఫేస్ చేయకూడదంటూ, సోషల్ మీడియాలో అతను పంచుకున్న ఆవేదన ఇప్పుడు వైరల్. “రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ఇక నమ్మకం మిగల్లేదు” అంటున్నాడు అతను. 

కొత్త Royal Enfield Bear 650 గొప్ప స్టైల్, పవర్ ఇచ్చినా... ఓ బైక్‌ లవర్‌ హృదయాన్ని గెలవడంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యింది. “మళ్ళీ మేం ఇద్దరం కలిసే రోజు ఎప్పుడొస్తుందో?” అంటూ తన పోస్ట్‌ చివర్లో బాధను వెళ్లగక్కాడు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Advertisement

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Embed widget