Toyota Land Cruiser FJ లాంచ్‌కు సిద్ధం - ఈ 'మినీ ఫార్చ్యునర్'ను మీరు కొంటారా?
Toyota Land Cruiser FJ, కొత్త మినీ ఫార్చ్యునర్ ముద్దు పేరుతో వచ్చే వారం మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. 2.7 లీటర్ ఇంజిన్, ఆఫ్‌రోడ్ లుక్, బాక్సీ డిజైన్‌తో SUV అభిమానుల్లో హీట్ పెంచుతోంది.

Toyota Land Cruiser FJ Mini Fortuner Launch: టయోటా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న “మినీ ల్యాండ్ క్రూజర్ / మినీ ఫార్చ్యునర్” చివరికి రియాలిటీగా మారబోతోంది. జపాన్ మీడియా రిపోర్టుల ప్రకారం, టయోటా, తన కొత్త SUV ల్యాండ్ క్రూజర్ FJ ని అక్టోబర్ 20, 2025న ప్రైవేట్ మీడియా ప్రివ్యూ మూవీగా చూపించబోతోంది. ఈ షో కోసం సెలెక్టెడ్ ఆడియన్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రైవేట్ షో మరుసటి రోజున పబ్లిక్ ఎదుట కూడా ప్రజెంటేషన్ ఉంటుంది.
జపాన్‌లో ఆవిష్కరణ
జపాన్ మొబిలిటీ షో 2025లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. అధికారికంగా టయోటా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఈ SUV గురించి ఇప్పటికే ఆటో సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలా మందికి ఇది పాత FJ Cruiser కి స్పిరిట్యువల్ సక్సెసర్‌గా భావిస్తున్నారు. కారణం... పాత FJ Cruiser రగ్డ్ లుక్ ఉంది, అదే సమయంలో మరింత కాంపాక్ట్, మోడ్రన్ & కస్టమర్ ఫ్రెండ్లీ ప్యాకేజీగా కనిపిస్తోంది.
ఈ కొత్త SUV ని IMV 0 లాడర్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇదే ప్లాట్‌ఫామ్ Hilux Champ లోనూ ఉంది. అంటే, మినీ ఫార్యూనర్‌కు మంచి ఆఫ్‌రోడ్ సామర్థ్యం తప్పక ఉంటుంది. డిజైన్ విషయంలో ఇది బాక్సీ లుక్, షార్ట్ ఓవర్‌హ్యాంగ్స్, స్క్వేర్ వీల్ ఆర్చ్‌లు, థిక్ C-పిల్లర్స్‌తో రెట్రో & రగ్డ్ లుక్‌లో కనిపించబోతోంది. చూసిన వెంటనే “అదే టయోటా DNA” అని అనిపించేలా ఉంటుంది.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
ఇంజిన్ పరంగా చూస్తే, ఇది 2.7 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం Fortuner & Hilux మోడళ్లలో ఉపయోగిస్తున్నారు. 163 హార్స్‌పవర్, 245Nm టార్క్ అందించగల ఈ ఇంజిన్‌తో మూవీ ఆన్ రోడ్స్ అనుభూతి దక్కనుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉంటాయి.
న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి వచ్చాక, తర్వాతి దశల్లో టయోటా డీజిల్, టర్బో పెట్రోల్ లేదా హైబ్రిడ్ వేరియంట్లను కూడా తీసుకురావొచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఇండియా వంటి మార్కెట్స్ కోసం 2.4 లీటర్ GD సిరీస్ డీజిల్ ఇంజిన్ వెర్షన్ కూడా పరిశీలనలో ఉందని సమాచారం. అదే జరిగితే, ఇది ప్రాక్టికల్, ఫ్యూయల్ ఎఫీషియంట్ SUVగా నిలిచే అవకాశం ఉంది.
ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
Land Cruiser FJ ఉత్పత్తి పనులు థాయ్‌లాండ్ ప్లాంట్‌లో జరగనున్నాయి, అక్కడినుంచి గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి జరుగుతుంది. జపాన్‌లో ఈ SUV 2026 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, ఆ తరువాత ఇండియా సహా ఇతర దేశాల్లోనూ విడుదల అవుతుందని చెబుతున్నారు.
ఈ ల్యాండ్ క్రూజర్ FJ అంటే సాధారణ SUV కాదు, టయోటా తన మూలాలకు తిరిగి వెళ్తున్న సంకేతం ఇది. Go-anywhere ఆఫ్‌రోడ్ బాడీ, కాంపాక్ట్ సైజ్, సొగసైన డిజైన్ కలిపి ఈ SUVని “మినీ ఫార్చ్యునర్”గా ప్రాచుర్యం తీసుకురానుంది. సిటీ లుక్స్‌తో అడ్వెంచర్ స్పిరిట్ మిక్స్ చేయాలనుకునే యువతకు ఇది పర్ఫెక్ట్ ఎంపిక అవుతుంది.
టయోటా, తన “డ్రైవ్ ద లెజెండ్” భావనను మరోసారి కొత్త రూపంలో చూపించబోతోంది. ఇక చూడాలి - ఈ Land Cruiser FJ SUV మార్కెట్‌ని ఎలా కదిలిస్తుంది అనేది.





















