అన్వేషించండి

EV Travel Tips: ఎలక్ట్రిక్‌ కార్‌తో సిటీ దాటి వెళ్తున్నారా?, చార్జింగ్‌ ప్లాన్‌ నుంచి వాతావరణం వరకు ఇవి తప్పనిసరి

ఎలక్ట్రిక్‌ వాహనంతో లాంగ్‌ డ్రైవ్‌ ప్లాన్‌ చేస్తున్నప్పుడు - ఛార్జింగ్‌ స్టాప్స్‌, వాతావరణం, బ్యాటరీ రేంజ్‌, అవసరమైన టూల్స్‌ - అన్నీ ముందే ప్లాన్‌ చేస్తే మీ ట్రిప్‌ ఎలాంటి టెన్షన్‌ లేకుండా సాగుతుంది.

Electric Car Road Trip Guide: ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలతో లాంగ్‌ డ్రైవ్‌ చేయడం కొత్త విషయం కాదు. టెక్నాలజీ ముందడుగు వేస్తున్నకొద్దీ, యువతీ యువకులు, కుటుంబాలు EVలతో సిటీ లిమిట్స్‌ దాటి ఇంటర్‌సిటీ ట్రిప్స్‌ చేస్తున్నారు. కానీ, పెట్రోల్‌ కార్లలాగా ఒక్కసారిగా బయలుదేరడం EVలకి పనికి రాదు. సరైన ప్రణాళిక అవసరం. ఇక్కడ మీ రోడ్‌ ట్రిప్‌ సక్సెస్‌ కావడానికి 5 ముఖ్యమైన టిప్స్‌ చూద్దాం.

మీ డ్రైవింగ్‌ స్టైల్‌ కార్‌ రేంజ్‌ పెంచుతుంది
మీ డ్రైవింగ్‌ పద్ధతి మీ EV రేంజ్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. హైవేపై స్థిరమైన స్పీడ్‌లో నడపడం, అకస్మాత్తుగా యాక్సిలేట్‌ చేయకపోవడం, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ వాడటం వంటివి బ్యాటరీ శక్తిని సేవ్‌ చేస్తాయి. 

కొత్త EV మోడళ్లలో “వన్‌ పెడల్‌ డ్రైవ్‌” ఫీచర్‌ కూడా ఉంటుంది, యాక్సిలేటర్‌ నుంచి కాలు తీస్తే వాహనం స్లో అవుతుంది. దాంతో ఎలక్ట్రిక్‌ శక్తి తిరిగి బ్యాటరీకి వెళ్తుంది. ఇది రేంజ్‌ పెంచడమే కాకుండా డ్రైవింగ్‌ను కూడా కంఫర్ట్‌గా మారుస్తుంది.

ఛార్జింగ్‌ స్టాప్స్‌ ముందే మ్యాప్‌ చేయండి
సంప్రదాయ కార్ల కోసం ఫ్యూయల్‌ స్టేషన్లు ప్రతి 5 కిలోమీటర్లు ఒకటి కనిపిస్తాయి. కానీ ఛార్జింగ్‌ పాయింట్లు అంతగా లేవు. కాబట్టి, మీ EV సిటీ దాటక ముందే ప్లాన్‌ చేసుకోండి. Google Maps‌, PlugShare, Zeon Charging వంటి యాప్స్‌ ఉపయోగించి మీ రూట్‌లో ఉన్న ఛార్జింగ్‌ స్టేషన్‌లు చెక్‌ చేయండి.

హైవేలపై సాధారణంగా 50kW–150kW ఫాస్ట్‌ DC ఛార్జర్లు ఉంటాయి. కొన్ని చోట్ల 7kW–22kW AC ఛార్జర్లు కనిపిస్తాయి. ఫాస్ట్‌ ఛార్జర్‌తో 20-30 నిమిషాల్లో 80% ఛార్జ్‌ అవుతుంటే, AC ఛార్జర్‌తో కొన్ని గంటలు పట్టవచ్చు. కాబట్టి 30-40 కిలోమీటర్ల బఫర్‌ రేంజ్‌ ఉంచడం మంచిది.

బ్యాకప్‌ తప్పనిసరి
ఇంటర్‌సిటీ ట్రిప్‌లో అన్ని చోట్ల ఛార్జింగ్‌ సదుపాయాలు ఉండవు. కొన్ని సార్లు ఛార్జర్‌ డౌన్‌లో ఉండవచ్చు లేదా క్యూలు ఎక్కువగా ఉండవచ్చు. అందుకే రెండు రకాల ఛార్జర్లు వెంట ఉంచుకోండి - ఒక సాధారణ హోమ్‌ ప్లగ్‌ ఛార్జర్‌, ఇంకో ఫాస్ట్‌ ఛార్జర్‌. మీ వాహనం ఛార్జ్‌ అవ్వడానికి ఎంత టైమ్‌ పడుతుందో మీకొక అంచనా ఉండాలి. ఇలాంటి అంచనా వేసుకుంటే ట్రిప్‌ మధ్యలో ఆందోళన ఉండదు.

భౌగోళిక పరిస్థితులు & వాతావరణం ప్రభావం
ఎత్తైన మార్గాలు, ఘాట్స్‌ లాంటివి బ్యాటరీని త్వరగా ఖర్చు చేస్తాయి. అందుకే ట్రిప్‌లో అదనపు ఛార్జింగ్‌ స్టాప్స్‌ను టచ్‌ చేస్తూ వెళ్లండి. టైర్‌ ప్రెషర్‌ సరిగ్గా ఉంచడం, వాషర్‌ ఫ్లూయిడ్‌ నింపడం, పోర్టబుల్‌ ఎయిర్‌ ఫిల్లర్‌ వెంట ఉంచుకోవడం చాలా అవసరం.

తీవ్ర ఎండలు, చలి వాతావరణం కూడా బ్యాటరీ పనితీరును తగ్గిస్తాయి. కాబట్టి వాతావరణాన్ని బట్టి ప్రణాళిక వేయండి.

టూల్‌కిట్‌ & అసిస్టెన్స్‌
EVతో ట్రిప్‌ చేస్తుంటే టూల్‌కిట్‌, టైర్‌ ఇన్‌ఫ్లేటర్‌, జంప్‌ స్టార్టర్‌, ఫ్లాష్‌లైట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ తప్పనిసరి. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ నంబర్‌ ఫోన్‌లో సేవ్‌ చేసుకోండి. ఎక్కడైనా సమస్య వచ్చినా వెంటనే సహాయం అందుతుంది.

 హైబ్రిడ్‌ కార్ల సౌలభ్యం
ప్యూర్‌ EVలతో పోలిస్తే హైబ్రిడ్‌ (పెట్రోల్‌ + ఎలక్ట్రిక్‌) వాహనాలు కొంత సౌలభ్యం ఇస్తాయి. అవి “సెల్ఫ్‌ రీజెనరేషన్‌” టెక్నాలజీతో పని చేస్తాయి. మోటార్‌ వినియోగించిన శక్తినే తిరిగి బ్యాటరీలో నిల్వ చేసి అదనంగా 60-80 కిలోమీటర్ల వరకూ నడుస్తాయి.

హైబ్రిడ్‌ కారు యూజర్లు చెప్పిన ప్రకారం: “హైబ్రిడ్‌ కారు అంటే ఛార్జింగ్‌ ఫ్రెండ్‌ కూడా, పెట్రోల్‌ బ్యాకప్‌ కూడా!”. అయితే, పర్యావరణహితం విషయంలో మాత్రం EVలకే ఫుల్‌ మార్కులు.

ట్రిప్‌కు ముందు ఇంట్లో కనీసం 12-13 గంటల పాటు ఛార్జ్‌ చేయండి. మీ మార్గంలో ఉన్న స్టేషన్‌లను ముందే చెక్‌ చేయండి. అలా చేస్తే లాంగ్‌ డ్రైవ్‌లో బ్యాటరీ ఆందోళన లేకుండా, ఫుల్‌ ఎంజాయ్‌మెంట్‌తో ప్రయాణం సాగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Embed widget