Rolls Royce: అపర కుబేరుల పంచకల్యాణి రోల్స్ రాయిస్ కలినాన్ 2 - ధర రూ. 12 కోట్లు - ఇప్పుడు ఇండియాలో కూడా !
Cullinan Series : ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లలో మొదటి శ్రేణిలో ఉంటుంది రోల్స్ రాయిస్. ఈ కంపెనీ తాజా మోడల్ కలినాన్. చెన్నైలో ప్రత్యేకంగా షోరూం కూడా ఏర్పాటు చేశారు.
Rolls Royce Motor Cars Chennai debuts Cullinan Series II in India : రోల్స్ రాయిస్ కార్లు రోడ్డు మీద కనిపిస్తే అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూండిపోతారు . ఎందుకంటే ఆ కారులో ఉండే రాయల్ ఇజం మాత్రమే కాదు.. అందులో ప్రయాణించేవారు కూడా అలాంటి వారే ఉంటారు. రోడ్డుపై రోల్స్ రాయిస్ కనిపిస్తే అందులో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లేకపోతే.. మరో బడా పారిశ్రామిక వేత్త ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కార్లు అలాంటి వారే కొనగలరు.
రోల్స్ రాయిస్
ఇటీవలి కాలంలో కలినాన్ సిరీస్ కార్లను విడుదల చేస్తోంది. తాజాగా కలినాన్ సిరీస్ 2 ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకూ రోల్స్ రాయిస్ కార్లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఇంపోర్టెడే కానీ.. నేరుగా కంపెనీనే చెన్నైలో షోరూం ఓపెన్ చేసింది. 2018 నుంచి రోల్స్ రాయిస్ కార్లను చెన్నై షోరూంలో బుక్ చేసుకునే అవకాశాన్నికల్పించారు. ఈ షోరూంలో 'కల్లినన్ సీరిస్ 2 ' లాంచ్ చేసింది. గత మోడల్స్ కంటే అత్యాధునిక డిజైన్, ఫీచర్స్ ఈ కారులో ఉంటాయి.
రోల్స్ రాయిస్ కల్లినన్ 2 ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 10.50 కోట్లు నుంచి ప్రారంభమవతుంది. బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ. 12.25 కోట్లు వరకూ ఎక్స్ షోరూమ్ ధర ఉంటుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కార్ల డెలివరీలు 2024 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మామూలుగా అయితే వెయిటింగ్ పిరియడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ కంపెనీ నేరుగా చెన్నై షోరూమ్ ఓపెన్ చేయడం వల్ల వేగంగా డెలివరీలు ఇవ్వగలుగుతారు.
2024 రోల్స్ రాయిస్ కల్లినన్ 2 ఫేస్‌లిఫ్ట్ కొత్త స్టైలింగ్తో ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ కూడా అప్డేట్ వెర్షన్. 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ స్టాండర్డ్ వేరియంట్ 571 హార్స్ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ సామర్థ్యంతో ఉంటుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ 600 హార్స్ పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ సామర్థ్యంతో ఉంటుంది. ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్ దీని ప్రత్యేకత.
రోల్స్ రాయిస్ చెన్నై, న్యూఢిల్లీ షోరూం అడ్రెస్‌లు
Rolls-Royce Motor Cars Chennai
No. 20, Grand Southern Trunk Rd, Meenambakkam, Chennai, Tamil Nadu 600027
+91 95519 20000
https://www.rolls-roycemotorcars.com/chennai/en_GB/showroom.html
Rolls-Royce Motor Cars New Delhi
A-19, Ground Floor, NH-19, Mohan Cooperative Industrial Estate, New Delhi, Delhi 110004
+91 1144 767 555
https://www.rolls-roycemotorcars.com/newdelhi/en_GB/showroom.html