అన్వేషించండి

Renault Triber Facelift vs Maruti Ertiga: 7 అదిరిపోయే ఫీచర్లు! బడ్జెట్ MPV కోసం చూస్తున్నారా? తప్పక చూడండి!

Renault Triber 2025: ఖరీదైన మారుతి ఎర్టిగాలో కూడా అందుబాటులో లేని ఫీచర్లను రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ తక్కువ ధరకే అందిస్తోంది. ట్రైబర్‌లోని 7 ప్రత్యేక లక్షణాల గురించి ఈ కథనంలో వివరించాం.

2025 Renault Triber Facelift Triber Vs Maruti Ertiga Features: మీ కుటుంబానికి బడ్జెట్-ఫ్రెండ్లీ & పర్ఫెక్ట్ 7-సీటర్ MPV ని గిఫ్ట్‌గా ఇవ్వాలని చూస్తున్నట్లయితే, 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ గురించి మీరు తెలుసుకోవాలి. కేవలం రూ. 6.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే వచ్చే ఈ MPV, ఖరీదైన మారుతి ఎర్టిగాలో కూడా అందుబాటులో లేని అనేక ఫీచర్లను అందిస్తోంది. ఎర్టిగాతో పోలిస్తే, ట్రైబర్‌లో డబ్బుకు తగిన విలువను అందించే 7 స్మార్ట్ ఫీచర్లు ఇవీ:

1. LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్‌
కొత్త రెనాల్ట్‌ ట్రైబర్ ఇప్పుడు LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌లతో లాంచ్‌ అయింది, ఇవి రాత్రి పూట మెరుగైన లైటింగ్ & విజన్‌ను అందిస్తాయి. అదే సమయంలో, మారుతి ఎర్టిగాలో ఇప్పటికీ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌లను ఉపయోగిస్తున్నారు.

2. 8-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
రెనాల్ట్ ట్రైబర్‌లో 8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. అయితే, మారుతి ఎర్టిగాలో 7-అంగుళాల స్క్రీన్‌ మాత్రమే ఉంది & అది కూడా వైర్డు కనెక్షన్‌పై ఆధారపడి ఉంటుంది.

3. 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
రెనాల్ట్ ట్రైబర్, 7-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేతో వచ్చింది, ఇది ఫుల్లీ డిజిటల్. ఈ డిస్‌ప్లే పూర్తి ఆధునికంగా కనిపిస్తుంది & పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. మరోవైపు, మారుతి ఎర్టిగా ఇప్పటికీ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌పై ఆధారపడుతోంది.

4. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
రెనాల్ట్ ట్రైబర్ టాప్ వేరియంట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది, ఇది ఫోన్‌ను ఛార్జ్ చేయడాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఈ ఫీచర్‌ను ఇప్పటివరకు మారుతి ఎర్టిగాలో యాడ్‌ చేయలేదు.

5. రెయిన్ సెన్సింగ్ వైపర్లు
రెనాల్ట్ ట్రైబర్, ఇప్పుడు, వర్షం పడే సమయంలో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే రెయిన్ సెన్సింగ్ వైపర్‌లతో వచ్చింది. మారుతి ఎర్టిగా ఇప్పటికీ మాన్యువల్ వైపర్‌లను కలిగి ఉంది.

6. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్
రెండు కార్లకు రియర్‌ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ట్రైబర్‌లో, కొత్తగా, ఫ్రంట్‌ పార్కింగ్ సెన్సార్లను కూడా ఇచ్చారు. ఇది, ఇరుకైన ప్రదేశాలలో కారును పార్కింగ్ చేయడం & హ్యాండిల్‌ చేయడం వంటి పనులను సులభం చేస్తుంది.

7. 3వ వరుస సీట్లు పూర్తిగా తొలగించే వెసులుబాటు
రెనాల్ట్ ట్రైబర్ అతి పెద్ద ఫీచర్‌, పూర్తిగా తొలగించగల మూడో వరుస సీట్లు. మూడో వరుసను తీసేసి, ఈ కారును 5-సీటర్‌ లేదా 6-సీటర్‌గా మార్చవచ్చు & 625 లీటర్ల బూట్ స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఎర్టిగాలో సీట్లను మడత పెట్టే అవకాశం మాత్రమే ఉంది, పూర్తిగా తొలగించలేము.

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో, మారుతి ఎర్టిగా ధర (ఎక్స్-షోరూమ్) రూ. 9.12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెనాల్ట్‌ ట్రైబర్‌ ధర (ఎక్స్-షోరూమ్) కేవలం రూ. 6.29 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.                                    

టాప్ హెడ్ లైన్స్

రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి
రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి
రూ.8.71 లక్షల కియా సోనెట్‌ను రూ.1.30 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనొచ్చు! EMI, ఫైనాన్స్ డీటెయిల్స్ ఇవే!
డ్రీమ్‌ కారు 'కియా సోనెట్‌'ను దక్కించుకోవడం ఇప్పుడు ఇంకా ఈజీ! రూ.1.30 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు!
E85 ఇంధనంతో నడిచే తొలి స్కూటర్ హోండా ADV160.. 27 లీటర్ల స్టోరేజ్‌, రూ.1.70 లక్షల ధర
రూ.5,000 అడ్వాన్స్‌తో కొత్త హోండా ADV160.. E85 వరకు ఏ ఇంధనం పోసినా నడుస్తుంది
రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ ధర!.. మార్కెట్‌లోకి సరికొత్త హోండా 'రెబల్ 300'
రాయల్‌ లుక్‌తో కొత్త హోండా రెబల్ 300 లాంచ్‌.. ఈ క్రూయిజర్ బైక్‌ ధర, ప్రత్యేకతలు ఇవే!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget