అన్వేషించండి

Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే

Renault Duster Hybrid Price | రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ రూ.16.9 లక్షలకు లాంచ్ అయింది. ఫుల్ ట్యాంక్‌తో 1400 కిలోమీటర్లు నడిచే కారు F1 టెక్నాలజీ గేర్‌బాక్స్‌తో పాటు ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ కారు 16.9 లక్షలతో మార్కెట్లోకి వచ్చింది.
  • మల్టీ-మోడ్ గేర్‌బాక్స్‌తో 160 bhp శక్తి, ఆరు డ్రైవింగ్ మోడ్‌లు.
  • 29 Kmpl మైలేజ్, ప్రీమియం క్యాబిన్, మెరుగైన డిజైన్ మార్పులు.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV డస్టర్ కారును కొత్త హైబ్రిడ్ రూపంలో లాంచ్ చేసింది. కంపెనీ దీని ప్రారంభ ధరతో ఆటో మొబైల్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఇతర హైబ్రిడ్ కార్ల కంటే చౌకగా ఉండటమే కాకుండా మైలేజ్ విషయంలో కూడా బెస్ట్ అనిపించుకుంటుంది. కొత్త Renault Duster Hybrid ఎక్స్ షోరూమ్ ధరరూ.16.9 లక్షల నుంచి రూ.19.4 లక్షల మధ్య ఉంటుంది. అయితే ఆన్ రోడ్ ధర ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. ఈ శక్తివంతమైన SUVని కేవలం 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

డస్టర్ హైబ్రిడ్ కారులో అద్భుతమైన వేరియంట్లు

రెనాల్ట్ కంపెనీ ఈ హైబ్రిడ్ SUVని ఎవల్యూషన్ (Evolution), టెక్నో (Techno), ఎమోషన్ (Emotion) అనే 3 విభిన్న వేరియంట్లను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. రెనాల్ట్ కంపెనీ హైబ్రిడ్ కారు బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.16.9 లక్షలు కాగా, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర రూ. 19,85,430 గా ఉంది. ఈ ప్రత్యేక ధరలు ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి వాహనాన్ని డెలివరీ పొందే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది.

గేర్‌బాక్స్, ఇంజన్ కొత్త సాంకేతికత

ఈ కార్ అతిపెద్ద ప్రత్యేకత దీని కొత్త ముక్తి (Mukti) మల్టీ మోడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చింది. ఇది సాధారణ గేర్‌బాక్స్ కాదు, ఇందులో 2 ఎలక్ట్రిక్, 4 పెట్రోల్ గేర్లు ఇచ్చారు. ఈ సాంకేతికత కారును నడపడానికి ప్యూర్ ఎలక్ట్రిక్, సిరీస్ హైబ్రిడ్, ప్యారలల్ హైబ్రిడ్, పూర్తిగా పెట్రోల్ మోడ్‌లతో కలిపి మీకు9 6 విభిన్న మోడ్‌లను అందిస్తుంది. ఇందులో 1.8 లీటర్ల పెద్ద పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. ఇది 2 ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మొత్తం కలిసి కారుకు 160 bhp లభించే బలమైన కంబైన్డ్ పవర్‌ను అందిస్తుంది. వేగం విషయంలో కూడా బెస్ట్.  9.1 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.

నిజంగానే 29 Kmpl మైలేజ్ ఇస్తుందా?

Renault Duster Hybrid  అతిపెద్ద ప్రత్యేకత 29 Kmpl మైలేజ్ అని చెబుతారు. సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ కారు ఎక్కువ సమయం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుంది. దాంతో  పెట్రోల్ ఆదా అవుతుంది. ఒకసారి దీని ట్యాంక్ పూర్తిగా నింపితే ఈ కారు 1400 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు.  రియల్ వరల్డ్ మైలేజ్ విషయానికి వస్తే, ట్రాఫిక్, రోడ్లను బట్టి నిజ జీవితంలో 29 మైలేజ్ రావడం కష్టమే. సాధారణంగా రియల్ టైం జర్నీ ప్రయోగంలో 20 kmpl+ కంటే ఎక్కువ మైలేజ్‌ సులభంగా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది SUV విషయంలో ఎక్కువే. 

లుక్, కేబిన్ లోపల ఏం మారింది?

డిజైన్ విషయానికి వస్తే, రెనాల్ట్ కంపెనీ కొన్ని అద్భుతమైన మార్పులు చేసింది. హైబ్రిడ్ కారు ఫ్రంట్ గ్రిల్ మధ్యలో ఇప్పుడు మెరిసే DUSTER లోగో ఇచ్చింది. రాత్రి సమయంలో చాలా అందంగా కనిపిస్తుంది. మంచి రైడింగ్ కోసం కారు ముందు, వెనుక రెండు వైపులా ఫ్రీక్వెన్సీ డాంపర్లు ఇచ్చారు. సేఫ్టీ కోసం నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు లభిస్తాయి.

కారు కేబిన్‌ను చాలా ప్రీమియంగా చేశారు. దీని టాప్ ఎమోషన్ (Emotion) వేరియంట్‌లో కొత్త డ్యూన్ బ్రౌన్ లెథరెట్ సీట్ అప్‌హోల్‌స్టరీ ఇవ్వగా.. ముందు సీట్లకు వెంటిలేషన్, 6 వే పవర్ అడ్జస్ట్ ఫీచర్ లభిస్తుంది. దీని టెక్నో (Techno) వేరియంట్‌లో డెసర్ట్ బేస్ సెమీ లెథరెట్ అప్‌హోల్‌స్టరీతో పాటు కొత్త డిజైన్ హెడ్‌రెస్ట్ ఇచ్చారు. హైబ్రిడ్ టెక్నాలజీ అయినప్పటికీ దీని కేబిన్ స్పేస్, బూట్ స్పేస్‌లలో స్టాండర్డ్ Duster తో పోలిస్తే ఏమీ తగ్గించలేదు. 

Frequently Asked Questions

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ప్రారంభ ధర ఎంత?

కొత్త Renault Duster Hybrid ఎక్స్ షోరూమ్ ధర రూ.16.9 లక్షల నుంచి రూ.19.4 లక్షల మధ్య ఉంటుంది. ఈ ప్రత్యేక ధరలు డిసెంబర్ 31 వరకు డెలివరీ పొందే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి.

డస్టర్ హైబ్రిడ్ కారు యొక్క ప్రత్యేకమైన గేర్‌బాక్స్ సాంకేతికత ఏమిటి?

ఈ కారులో మల్టీ-మోడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది, ఇది 2 ఎలక్ట్రిక్, 4 పెట్రోల్ గేర్‌లతో కూడిన 6 విభిన్న డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది. ఇది 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంత మైలేజ్ ఇస్తుంది?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ 29 Kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. నిజ జీవితంలో ఇది 20 kmpl+ కంటే ఎక్కువ మైలేజ్‌ను సులభంగా ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డస్టర్ హైబ్రిడ్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది?

రెనాల్ట్ కంపెనీ ఈ హైబ్రిడ్ SUVని ఎవల్యూషన్ (Evolution), టెక్నో (Techno), ఎమోషన్ (Emotion) అనే 3 విభిన్న వేరియంట్లలో మార్కెట్లోకి లాంఛ్ చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

చెరుకుతో ఇథనాల్ తయారీకి కేంద్రం 'నో'.. పెట్రోల్‌ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఇథనాల్ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం బ్రేక్! పెట్రోల్ ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?
RE Bear 650 Review: ఇంటర్‌సెప్టర్ 650 ఉండగా బేర్ 650 ఎందుకు కొనాలి? మూడు నెలల వాడకంలో తెలిసిన ఆసక్తికర విషయాలివే!
Royal Enfield Bear 650.. ఒక్కసారి నడిపితే ఇక ఒదలాలనిపించని ఎడారి రేసింగ్ బైక్‌!
Honda Festive Discounts: హోండా కార్లపై బిగ్‌ డీల్స్‌.. సిటీ, ఎలివేట్, అమేజ్ కొనేవాళ్లకు రూ.2.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
హోండా కార్లపై రూ.2.35 లక్షల వరకు తగ్గింపు.. ఏ కారు కొంటే ఎక్కువ లాభమంటే?
హ్యుందాయ్ కార్లపై దసరా ఆఫర్లు.. క్రెటా నుంచి గ్రాండ్ ఐ10 నియోస్ వరకు భారీ తగ్గింపులు!
హ్యుందాయ్ కార్లపై పండుగ ఆఫర్లు.. కొత్త కారు కొంటే రూ.లక్ష వరకు ఆదా!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Embed widget