Raksha Bandhan 2025: రాఖీ కట్టే మీ సోదరికి బహుమతిగా ఇవ్వడానికి 5 బెస్ట్ స్కూటర్లు - ధర ఎక్కువేం కాదు!
Raksha Bandhan 2025 Gift: రక్షా బంధన్ 2025 ని ప్రత్యేకంగా మార్చండి, మీ ప్రియమైన సహోదరికి ప్రత్యేకమైన & ఉపయోగకరమైన బహుమతిని ఇవ్వండి. మీ బడ్జెట్‌లో లభించే 5 చౌక స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

Raksha Bandhan 2025 Scooter Gift: సోదరసోదరీ ప్రేమకు ప్రతీక 'రాఖీ పండుగ'. ఈ సంవత్సరం, మీరు ఎంతగానో ప్రేమించే మీ చెల్లెలు/అక్క కోసం మీరు ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేస్తుంటే, ఒక స్టైలిష్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరచవచ్చు. కొన్ని ఆకర్షణీయమైన స్కూటర్లు మీ బడ్జెట్‌లోనే, చవకగా వస్తాయి. ఇవి, ఆమె రోజువారీ జీవితానికి చాలా చక్కగా పనికొస్తాయి, లైఫ్‌స్టైల్‌ను మెరుగు పరుస్తాయి. రక్షా బంధన్ రోజున, మీ సోదరికి ప్రేమగా ఇవ్వదగిన, స్టైల్‌లో ఏమాత్రం తగ్గని & చవకైన 5 స్కూటర్లు ఇవి. ఈ టూవీలర్లు కేవలం రూ. 77,000 నుంచి ప్రారంభమవుతాయి & 50 కి.మీ. వరకు మైలేజీ ఇస్తాయి.
1. హోండా డియో (Honda Dio)
హోండా డియో స్టైలిష్‌గా ఉండే & యువతకు ఇష్టమైన స్కూటర్, తెలుగు రాష్ట్రాల్లో దీని రూ. 79,108 (ఎక్స్-షోరూమ్). ఇది 109.51cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, లీటరు పెట్రోల్‌కు 50 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. స్పోర్టీ లుక్, LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ డిస్‌ప్లే & 18-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ దీని ప్రత్యేకతలు. మీ సోదరి రోడూ కాలేజీకి వెళ్లిరావడానికి లేదా మీ టౌన్/సిటీలో చిన్న ట్రిప్స్ వేయడానికి ఈ తేలికైన స్కూటర్ బాగుంటుంది, మంచి బహుమతి అవుతుంది.
2. టీవీఎస్ జూపిటర్ 110 (TVS Jupiter 110)
TVS Jupiter 110 మెరుగైన & సౌకర్యవంతమైన స్కూటర్. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 81,831. ఈ టూవీలర్ 113.3cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది లీటరుకు 50 నుంచి 52 కి.మీ. వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ స్కూటర్‌కు మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, పెద్ద అండర్‌సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ బండి చాలా మృదువైన రైడింగ్‌ను అందిస్తుంది.
3. హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)
హీరో ప్లెజర్ ప్లస్‌ను మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 77,633. ఈ బండికి 110.9cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 50 నుంచి 55 కిలోమీటర్ల దూరం (మైలేజీ) ప్రయాణించగలదు. రెట్రో-మోడరన్ లుక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ & తక్కువ బరువు వంటివి ఈ బండిని మహిళలకు ప్రత్యేకంగా చేస్తాయి.
4. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)
సుజుకి యాక్సెస్ 125 అనేది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్కూటర్, హైదరాబాద్ & విజయవాడలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,092 నుంచి ప్రారంభం అవుతుంది. ఇతర తెలుగు నగరాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంటుంది. ఇది 124cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, లీటరుకు 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఇంజిన్ చాలా శక్తివంతమైనది, అదే సమయంలో మృదువైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారణంగా ఈ టూవీలర్ నగరంలోనూ & హైవేపైనా చక్కటి పనితీరు కనబరుస్తుంది.
5. యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)
ట్రెండీ & స్టైలిష్ స్కూటర్ యమహా ఫాసినో 125. దీని ధర దాదాపు రూ. 83,730 (ఎక్స్-షోరూమ్). ఇందులో 125cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ బండిలో లీటరు పెట్రోల్ పోసి దాదాపు 58 కి.మీ. వరకు (మైలేజీ) నడపొచ్చు. దీని బరువు 99 కిలోలు మాత్రమే, కాబట్టి దీనిని హ్యాండిల్ చేయడం చాలా సులభం. ఆకర్షణీయమైన డిజైన్ & అద్భుతమైన ఇంధన సామర్థ్యం కారణంగా మహిళలకు ఇది ప్రత్యేకమైన బహుమతి అవుతుంది. మీ సోదరి ట్రెండీ & తేలికపాటి వాహనాలను ఇష్టపడితే, ఈ స్కూటర్ ఆమెకు ప్రత్యేక కానుక కాగలదు.





















