Upcoming Bikes 2025: కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా?, ఈ నెలలో మీ కోసమే వస్తున్న తుపాను లాంటి టూవీలర్స్ ఇవే
New Bikes Launching August 2025: ఆగస్టు 2025లో మార్కెట్లోకి కొత్త ద్విచక్ర వాహనాలు లాంచ్ కానున్నాయి. వాటిలో ట్రయంఫ్, TVS వంటి పెద్ద బ్రాండ్లు కూడా ఉన్నాయి.

New Bike Launches India In August 2025: మీరు కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ నెల మీకు ఒక ప్రత్యేక అవకాశం కావచ్చు. ఆగస్టు 2025లో.. ట్రయంఫ్, ఒబెన్ ఎలక్ట్రిక్ & TVS వంటి పెద్ద బ్రాండ్లు పోటాపోటీగా మార్కెట్‌లోకి వస్తున్నాయి, పవర్‌ఫుల్ బైక్‌లను విడుదల చేయబోతున్నాయి. మీరు స్పోర్టీ రైడ్‌లంటే ఇష్టపడుతున్నా లేదా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నా, మీ అవసరం & ఇష్టాన్ని తీర్చగలిగే తుపాను లాంటి టూవీలర్స్ మార్కెట్లోకి వస్తున్నాయి.
ట్రయంఫ్ థ్రక్ట్సన్ 400 (Triumph Thruxton 400)
ట్రయంఫ్ థ్రక్ట్సన్ 400 ఒక క్లాసిక్ కేఫ్-రేసర్ స్టైల్ బైక్. ఇది ఆగస్టు 6, 2025న విడుదల కానుంది. ట్రయంఫ్ థ్రక్ట్సన్ 400 అంచనా ధర రూ. 2.60 లక్షల నుంచి రూ. 2.90 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. పెర్ఫార్మెన్స్‌తో పాటు స్టైల్ కోరుకునే రైడర్లకు ఈ బైక్ బెస్ట్ ఛాయిస్. దీనికి శక్తిమంతమైన 400cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఇవ్వవచ్చు, ప్రీమియం హార్డ్‌వేర్‌తో దీనిని తయారు చేసే అవకాశం ఉంది. రోడ్డు మీద తుపాను సృష్టించడమే కాదు, గరిష్ట వేగంలోనూ రైడర్‌కు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇచ్చేలా కూడా దీనిని డిజైన్ చేశారు. ట్రయంఫ్ థ్రక్ట్సన్ 400 బ్రిటిష్ స్టైలింగ్ & క్లాసిక్ లుక్ కారణంగా, ఇది యమహా ఆర్15 (Yamaha R15) & కేటీఎం ఆర్‌సీ 390 ( KTM RC 390) వంటి స్పోర్ట్స్ బైక్‌లకు గట్టి పోటీని ఇవ్వగలదు.
ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ)
ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోరుకునే కస్టమర్ల కోసం వస్తున్న టూవీలర్ 'ఒబెన్ రోర్ EZ'. దీనిని ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) విడుదల చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆగస్టు 5, 2025న మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, దీని అమ్మకాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం అవుతాయి. Oben Rorr EZ అంచనా ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ మెరుగైన రైడింగ్ రేంజ్ & శక్తిమంతమైన మోటారుతో వచ్చింది. ఆధునిక డిజైన్ & స్మార్ట్ ఫీచర్లను కూడా తీసుకువచ్చింది. తక్కువ నిర్వహణ & ప్రభుత్వ సబ్సిడీ దీని అదనపు ప్లస్ పాయింట్స్. ఈ బెనిఫిట్స్ అందుకోవడంతో పాటు, పెట్రోల్ కష్టాలను వదిలించుకోవాలనుకునే వారికి ఒబెన్ రోర్ EZ ఎలక్ట్రిక్ బైక్ ఒక మంచి ఎంపిక అవుతుంది.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 (TVS Apache RTX 300)
ఈ ప్రీమియం బైక్ కోసం భారతీయ యువత చాలా కాలంగా ఎదురు చూస్తోంది. TVS Apache RTX 300 అనేది TVS కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి అడ్వెంచర్ బైక్, దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 2.50 లక్షల నుంచి వరకు రూ. 2.90 లక్షల ఉంటుందని అంచనా. ఈ బైక్ RT-XD4 ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 300cc తో 35bhp పవర్‌ను & 28.5Nm పీక్ టార్క్‌ను ఇవ్వగలదు. ఈ టూవీలర్‌ను అడ్వెంచర్ టూరింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీనికోసం, ఈ బండిలో బలమైన ఛాసిస్, లాంగ్ సస్పెన్షన్ ట్రావెల్, LED లైట్లు, TFT డిస్‌ప్లే & కనెక్టెడ్ ఫీచర్లు వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 కూడా ఈ నెలలోనే ఇండియన్ మార్కెట్‌లోకి రాబోతోంది.





















