Petrol Vs Electric: ఎలక్ట్రిక్ స్కూటర్లా, పెట్రోల్ స్కూటర్లా - ప్రస్తుతం ఏం కొంటే బెస్ట్!
పెట్రోల్, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏవి కొంటే బెస్ట్?
ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ బైకుల సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరంలో పెట్రోల్ ధరలు 16 నుంచి 20 శాతం మేర పెరిగాయి. వినియోగదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ మీరు బైక్ తీసుకోవాలనుకుంటే ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం బెస్టా? లేకపోతే పెట్రోల్ బైక్ బెటరా?
పెర్ఫార్మెన్స్
అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు హై టార్క్‌ను అందిస్తాయి. ఉదాహరణకు ఓలా ఎస్1 ప్రోను తీసుకుంటే అది 58ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. అదే హోండా యాక్టివా కేవలం 9 ఎన్ఎం టార్క్‌ను మాత్రమే అందించనుంది. కాబట్టి మీరు వేగవంతమైన బైక్ కావాలనుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవచ్చు.
రేంజ్, రీచార్జ్, రీఫ్యూయల్ (RRR)
ఎలక్ట్రిక్ స్కూటర్లను రీఫ్యూయల్ చేయాలంటే సగటున నాలుగు గంటల 30 నిమిషాలు పడుతుంది. అది 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే ప్రస్తుతం పెట్రోల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే దాని కంటే టైం పట్టినా రీఫ్యూయల్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు 238 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించనున్నాయి. ఒకవేళ ఎలక్ట్రిక్ వాహనాలు రీచార్జబుల్ బ్యాటరీతో వస్తే వాటిని మార్చడం మరింత సులువు కానుంది.
మెయింటెనెన్స్, రన్నింగ్ కాస్ట్
ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఉన్న మరో ప్రధాన అడ్వాంటేజ్ తక్కువ మెయింటెనెన్స్. ఇందులో మూవింగ్ పార్ట్స్ తక్కువ కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా రెగ్యులర్ పెట్రోల్ స్కూటర్ కంటే తక్కువగానే ఉంటుంది. దీంతోపాటు ఎలక్ట్రిక్ స్కూటర్లలో వేర్వేరు రైడర్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మన డ్రైవింగ్‌కు తగ్గట్లు మోడ్ పెట్టుకుంటే మెయింటెనెన్స్ మరింత తగ్గనుంది.
ధర
ఈ విషయంలో మాత్రం పెట్రోల్ స్కూటర్లదే పైచేయి. ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తున్నప్పటికీ పెట్రోల్ స్కూటర్ల కంటే కనీసం రూ.10 వేలకు పైనే వీటి ధర ఉండనుంది. కాబట్టి ఎకనమికల్‌గా మాత్రం పెట్రోల్ స్కూటర్లే కొంచెం ముందంజలో ఉన్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram