అన్వేషించండి

Ola Motorcycles: అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న ఓలా నుంచి 4 ఎలక్ట్రిక్ బైకులు, ఇంకా కొన్ని రోజులే వెయిట్ చెయ్యండి

ఎలక్ట్రిక్ బైకుల తయారీలో దూసుకెళ్తున్న ఓలా కంపెనీ, మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మంచి రేంజ్, టాప్ స్పీడ్ తో 4 బైకులను పరిచయం చేయబోతోంది.

Ola Plans To Launch 4 Electric Motorcycles: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ఓలా, సరికొత్త మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైకులను విడుదల చేస్తున్న ఈ కంపెనీ మల్టీఫుల్ మోడళ్లను పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ కొత్త బైకుల గురించి బయటకు చెప్పకపోయినా, ఓలా ఇటవల SEBIకి అందించిన డాక్యుమెంట్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఓలా కంపెనీ నాలుగు మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు SEBIకి సమర్పించిన డాక్యుమెంట్స్ లో వివరించింది. ఇప్పటికే ఈ మోడళ్లకు సంబంధించిన అన్ని ప్రయోగాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఉత్పత్తి మొదలు పెట్టేందుకు ఫైనల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓలా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో నాలుగు మోడళ్లకు సంబంధించిన కాన్సెప్టులను వెల్లడించింది. త్వరలోనే ఆసక్తి ఉన్న వినియోగదారులు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.  

ఓలా నుంచి రాబోతున్న 4 బైకులు ఇవే!

ఓలా వెల్లడించిన కాన్సెప్ట్ డెబ్యూలో నాలుగు బైకుల పేర్లను వెల్లడించింది. వాటిలో ఓలా డైమండ్‌ హెడ్, ఓలా రోడ్‌ స్టర్, ఓలా అడ్వెంచర్,  ఓలా క్రూయిజర్‌ ఉన్నాయి. ఈ నాలుగు ఎలక్ట్రిక్ బైకులను 2024 చివరి నాటికి లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త బైకులకు సంబంధించి ఆగష్టులో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో బైకు ఫీచర్లు, ధరకు సంబంధించి ఓ క్లారిటీ రానుంది. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో డెలివరీలు మొదలు పెట్టే అవకాశం ఉంది.

పెరగనున్న బ్యాటరీ రేంజ్, టాప్ స్పీడ్

రాబోయే ఎలక్ట్రిక్ బైకులను అత్యాధునిక టెక్నాలజీ సాయంతో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న బైకులకు పూర్తి భిన్నంగా కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా వీటిని తయారు చేసే అవకాశం ఉంది. మోటార్‌ సైకిల్ లైనప్, బ్యాటరీ, రేంజ్, మోటర్, టాప్ స్పీడ్, ఫీచర్ల గురించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినా, ప్రస్తుతం బైకులతో పోల్చితే అన్ని అంశాలు మెరుగ్గానే ఉండే అవకాశం ఉంది. మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో భవిష్యత్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ శ్రేణిని తయారు చేయనుంది.

త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్న ఓలా

త్వరలోనే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనుంది. ఆయా మోడళ్ల ధరలు, బుకింగ్ అమౌంట్, స్పెసిఫికేషన్లు, అధికారిక డెలివరీ షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ సరికొత్త బైకులతో ఎలక్ట్రిక్ మోటార్ మార్కెట్ లో మరింత దూసుకెళ్లాలని ఓలా భావిస్తోంది. ఇప్పుడున్న బైకులకు భిన్నంగా ఓలా బైకులను తయారు చేస్తే తప్పకుండా మంచి మార్కెట్ వాటాను సంపాదించుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూప‌ర్ - భార‌త్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?

Also Read: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget