Fiat Grande Panda: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!
Fiat Grande Panda Revealed: ప్రముఖ కార్ల బ్రాండ్ ఫియట్ తన కొత్త కారును అయిన ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసింది. ఈ కారు డిజైన్ చూడటానికి సిట్రోయెన్ సీ3 తరహాలో ఉంది.
Fiat New Car: ఫియట్ తన నాలుగో తరం పాండా ఎస్‌యూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను రివీల్ చేసింది. దీనితో పాటు ఈ కారు గురించిన కీలక వివరాలను కూడా షేర్ చేశారు. ఫియట్ ఈ కొత్త కారుకు గ్రాండే పాండా అని పేరు పెట్టింది. ఈ కారు రెట్రో డిజైన్, రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ప్రపంచ మార్కెట్లోకి రాబోతోంది.
ఫియట్ గ్రాండే పాండాలో ప్రత్యేకత ఏమిటి?
ఫియట్ గ్రాండే పాండా దాని మునుపటి కార్ల కంటే కొంచెం పెద్దదిగా ఉండబోతోంది. ఈ కారు చూడటానికి సిట్రోయెన్ సీ3 తరహాలో ఉంది. ఫియట్ తీసుకురానున్న ఈ కారు కంపెనీ బ్రాండ్ వాల్యూ బలాన్ని చూపనుంది. ఫియట్ పాత లింగోటో ఫ్యాక్టరీ నుండి రానున్న ఈ కారులో పిక్సెల్ స్టైల్ హెడ్‌లైట్‌లు అమర్చారు.
Also Read: మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ కారు లాంచ్ త్వరలో - ఏఆర్ రెహమాన్ సౌండ్ డిజైన్‌తో!
పర్‌ఫెక్ట్‌గా గ్రాండే పాండా
ఫియట్ ఈ కారు మునుపటి పాండా కంటే 0.3 మీటర్ల పొడవు ఉందని పేర్కొంది. ఈ కారు పొడవు 3.99 మీటర్లుగా ఉంది. ఇది యావరేజ్ సెగ్మెంట్ 4.06 మీటర్ల పరిధిలోకి వస్తుంది. ఫియట్ ఇంకా దాని 5 సీటర్ క్యాబిన్ గ్లింప్స్‌ను చూపలేదు. కానీ దాని క్యాబిన్ కాంటెంపరరీ అర్బన్ మొబిలిటీకి సరైనదని కంపెనీ చెబుతోంది.
గ్రాండే పాండాలో ఏం ఇంజిన్ అందించారు?
ఫియట్ గ్రాండే పాండా ఒకటి కంటే ఎక్కువ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో మార్కెట్లోకి రాబోతోంది. ఇది ఇంటర్నేషనల్ స్పెక్ సీ3లో ఉన్న 100 హెచ్‌పీ పవర్ 1.2 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ని పొందవచ్చు.
ఈ కారు భారతదేశంలో లాంచ్ కానుందా?
ఫియట్ గ్రాండే పాండా దాని రెట్రో లుక్‌తో మొదట యూరప్‌లో లాంచ్ అవుతుంది. అయితే ఈ కారు భారతదేశంలోకి లాంచ్ అవుతుందా లేదా అన్నదానిపై ఇంకా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.
Quelle meilleure célébration pour les 125 ans de Fiat que l’annonce de Nouvelle Fiat Grande Panda, qui marque les premières pages de l’avenir de la marque !
— Fiat France (@FiatFr) June 14, 2024
Préparez-vous à faire la différence ! 💛 pic.twitter.com/rdtmcpf8aF
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?