అన్వేషించండి

పవర్‌ఫుల్ పల్సర్ బైక్ Pulsar NS 400Z లాంచ్.. ఫీచర్లు చూశారా- డ్యూక్ బైక్‌కు గట్టి పోటీ !

Bajaj Pulsar ns 400z Price | బజాజ్ తన పవర్‌ఫుల్ బైక్ పల్సర్ NS400Zని కొత్త అప్‌డేట్‌తో లాంచ్ చేసింది. రూ. 1.90 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో వచ్చి బైక్ ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త పల్సర్ NS400Z రూ. 1.90 లక్షలకు ప్రారంభించబడింది.
  • శక్తివంతమైన 373cc ఇంజిన్‌ 40PS పవర్, 35Nm టార్క్‌నిస్తుంది.
  • TFT డిస్‌ప్లే, బ్లూటూత్, 4 రైడింగ్ మోడ్స్‌తో సురక్షితం.
  • KTM డ్యూక్‌కు పోటీగా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

భారత్‌లో కార్ల మార్కెట్‌కు కొన్నేళ్ల నుంచి డిమాండ్ ఉంది. అయితే బైక్ మార్కెట్‌ మాత్రం ఎవర్ గ్రీన్. ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు. కొనుగోలుదారులకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే బజాజ్ ఆటో అత్యంత పవర్‌ఫుల్ బైక్ పల్సర్ NS400Zని కొత్త అప్‌డేట్స్‌తో లాంచ్ చేసింది. ఈ బైక్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంది. బజాజ్ కంపెనీ దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.90 లక్షలుగా పేర్కొంది.. ఇంత తక్కువ బడ్జెట్‌లో 370cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్, పలు మోడ్రన్ ఫీచర్లు లభించడం పెద్ద విషయమే.

ఇప్పుడు ఈ బైక్ నేరుగా KTM డ్యూక్ 390 వంటి ప్రీమియం బైక్‌కు గట్టి పోటీ ఇస్తుంది. దీని స్పోర్టీ లుక్, వెడల్పాటి హ్యాండిల్,మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ ఆకట్టుకుంటాయి. మీరు వేగంగా దూసుకెళ్లే, హైవేపై కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా.. కొత్త పల్సర్ మీకు బెస్ట్ ఆప్షన్ కావొచ్చు.

పవర్‌ఫుల్ ఇంజిన్, సూపర్ పెర్ఫార్మెన్స్

కొత్త పల్సర్ NS400Zలో 373cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చింది. ఇది సుమారు 40 PS భారీ పవర్, 35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ట్రాఫిక్‌లో గేర్లు మార్చడం చాలా తేలిక. ఇందులో రైడ్-బై-వైర్ థ్రోటల్ టెక్నాలజీ అందించారు. దీనివల్ల యాక్సిలరేటర్ ఇవ్వగానే బైక్ వెంటనే, స్మూత్‌గా రెస్పాండ్ అవుతుంది. హైవేపై ఈ బైక్ చాలా సులభంగా వేగాన్ని అందుకోవచ్చు.

పలు మోడ్రన్ ఫీచర్లు 

బజాజ్ కంపెనీ ఈసారి టెక్నాలజీ పరంగా ఎలాంటి లోటూ చేయలేదు. ఇందులో కొత్త 5-ఇంచ్ TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్‌ప్లే బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్-SMS అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడర్లు స్క్రీన్ పైనే రూట్ వివరాలు చూసుకోవచ్చు. ఫోన్ ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ ఇచ్చారు. ఇది లాంగ్ రైడ్స్ సమయంలో దోహదం చేస్తుంది. 

Also Read: కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!

రైడింగ్ మోడ్స్, సేఫ్టీ కంట్రోల్

రైడర్ సేఫ్టీ, కంఫర్ట్ విషయానికి వస్తే, పల్సర్ NS400Zలో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్ రోడ్ అనే 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్ వివిధ రకాల రోడ్లు, వాతావరణానికి తగ్గట్లుగా బైక్ పెర్ఫార్మెన్స్‌‌ను అడ్జస్ట్ చేస్తాయి. భద్రత కోసం డ్యూయల్- ఛానల్ ABS, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. సడన్ బ్రేక్ వేసే సమయంలో వెనుక వస్తున్న వాహనాలను అప్రమత్తం చేయడానికి పానిక్ బ్రేక్ అలర్ట్ ఫీచర్‌ జత చేశారు.

KTM డ్యూక్‌తో పోటీ

KTM డ్యూక్ సిరీస్ తన వేగవంతమైన పెర్ఫార్మెన్స్‌కు ప్రసిద్ధి చెందింది. కానీ ధర చాలా ఎక్కువ. అయితే, బజాజ్ పల్సర్ NS400Zని కేవలం రూ. 1.90 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు లాంచ్ చేసి గేమ్ ఛేంజర్ గా మారింది. సగం ధరలోనే దాదాపు అలాంటి పవర్‌ఫుల్ ఇంజిన్, USD ఫ్రంట్ ఫోర్క్స్, మోడ్రన్ ఫీచర్లు వస్తుండటంతో ఈ బైక్ యూత్‌కు ఫస్ట్ చాయిస్ అవుతోంది. 

Also Read: ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!

Frequently Asked Questions

బజాజ్ పల్సర్ NS400Z ప్రారంభ ధర ఎంత?

దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.90 లక్షలు. ఇంత తక్కువ బడ్జెట్‌లో 370cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్ లభిస్తుంది.

పల్సర్ NS400Zలో ఉన్న ప్రధాన ఫీచర్లు ఏమిటి?

ఇందులో 5-ఇంచ్ TFT డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ కూడా ఉంది.

పల్సర్ NS400Zలో ఎన్ని రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి?

పల్సర్ NS400Zలో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్ రోడ్ అనే 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABS, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి జతచేశారు.

పల్సర్ NS400Z ఏ బైక్‌కు పోటీ ఇస్తుంది?

బజాజ్ పల్సర్ NS400Z నేరుగా KTM డ్యూక్ 390 వంటి ప్రీమియం బైక్‌లకు గట్టి పోటీ ఇస్తుంది. సగం ధరలోనే అదే పవర్‌ఫుల్ ఇంజిన్, మోడ్రన్ ఫీచర్లు అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ కార్లపై దసరా ఆఫర్లు.. క్రెటా నుంచి గ్రాండ్ ఐ10 నియోస్ వరకు భారీ తగ్గింపులు!
హ్యుందాయ్ కార్లపై పండుగ ఆఫర్లు.. కొత్త కారు కొంటే రూ.లక్ష వరకు ఆదా!
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
AP Local Body Elections: పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
Embed widget