అన్వేషించండి

Mini Cooper S Launched: రోడ్లపై ఇక స్టైలిష్ ప్రయాణం - మినీ కూపర్ ఎస్ కొత్త వేరియంట్ ఎంట్రీ.. అదిరిపోయే స్పోర్టీ లుక్, లగ్జరీ ఫీచర్లు.. 

మినీ ఇండియా తన కొత్త కూపర్ ఎస్ కన్వర్టిబుల్ జేసీడబ్ల్యూ ప్యాక్‌ను విడుదల చేసింది. స్పోర్టీ లుక్, ఓపెన్ టాప్ ఫీచర్‌తో వచ్చిన ఈ కారు ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 2.50 లక్షలు ఎక్కువ.

Mini Cooper S Convertible JCW Pack Launched: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా (Mini India) దేశీయ మార్కెట్లోకి తన సరికొత్త కూపర్ ఎస్ కన్వర్టిబుల్ జేసీడబ్ల్యూ (John Cooper Works) ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా స్పోర్టీ లుక్ ఇష్టపడే కస్టమర్ల కోసం ఒక లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్ లాగా ఈ కారును తీసుకువచ్చింది. సీబీయు (CBU) పద్ధతిలో అంటే విదేశాల నుండి నేరుగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్న ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 61.50 లక్షలు. సాధారణ కూపర్ ఎస్ కన్వర్టిబుల్ మోడల్ తో పోలిస్తే దీని ధర రూ. 2.50 లక్షలు అధికం. డ్రైవింగ్ లో మరింత ప్రత్యేకమైన అనుభూతిని కోరుకునే వారికి ఈ మోడల్ ఒక మంచి ఛాయిస్.

డిజైన్ హైలైట్స్..
ఈ జేసీడబ్ల్యూ ప్యాక్ లో మెకానికల్ మార్పుల కంటే కారు లోపల, బయట కనిపించే విజువల్ అప్‌డేట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కారు సిగ్నేచర్ సాఫ్ట్-టాప్ రూఫ్ ఫీచర్ ప్రయాణికులకు ఒక విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది. కేవలం 18 సెకన్ల వ్యవధిలోనే ఈ రూఫ్‌ను ఎలక్ట్రికల్ గా ఓపెన్ చేయవచ్చు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా దీన్ని ఆపరేట్ చేసే వెసులుబాటు ఉంది. ఇది పూర్తిగా ఓపెన్ కావడమే కాకుండా, సన్‌రూఫ్ లాగా పాక్షికంగా కూడా ఓపెన్ అవుతుంది.

జేసీడబ్ల్యూ స్పెషల్ ఫీచర్లు..
ఈ కొత్త వేరియంట్ మిడ్‌నైట్ బ్లాక్, లెజెండ్ గ్రే అనే రెండు ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. లెజెండ్ గ్రే రంగు కారుపై ప్రత్యేకమైన బోనెట్ స్ట్రైప్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఫ్రంట్ గ్రిల్, రియర్ వ్యూ మిర్రర్లు (ORVM), డోర్ హ్యాండిల్స్, వీల్ ఆర్చెస్, సైడ్ స్కర్ట్స్ వంటి భాగాలకు గ్లాస్-బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. బ్లాక్ కలర్ లో ఉన్న కొత్త 17-ఇంచ్ జేసీడబ్ల్యూ వీల్స్, జేసీడబ్ల్యూ బ్రాండెడ్ స్పోర్ట్ బ్రేక్స్ ఈ కారుకు అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. కారు రూఫ్ జెట్ బ్లాక్ ఫ్యాబ్రిక్ తో తయారై ప్రీమియం క్వాలిటీని అందిస్తుంది.

లగ్జరీ ఇంటీరియర్..
కారు లోపలి భాగం స్పోర్టీ థీమ్ తో అద్భుతంగా ఉంటుంది. జేసీడబ్ల్యూ స్పెషల్ స్పోర్ట్ సీట్లు, వెస్సిన్-కార్డ్ అప్హోల్స్టరీతో రూపొందించారు. ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్న ప్రత్యేకమైన జేసీడబ్ల్యూ స్టీరింగ్ వీల్ డ్రైవింగ్ ను సులభతరం చేస్తుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో బ్రాండ్ గుర్తుగా నిలిచే 9.4-ఇంచ్ సర్క్యులర్ ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది మినీ ఆపరేటింగ్ సిస్టమ్ 9 తో పనిచేస్తూ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టెడ్ కార్ ఫీచర్లను కంట్రోల్ చేస్తుంది.

ఇంజిన్ పర్ఫార్మెన్స్..
మెకానికల్ గా చూస్తే స్టాండర్డ్ మోడల్ లో ఉన్న 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ నే ఇందులోనూ ఉపయోగించారు. ఇది 204 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మినీ కార్ల ప్రత్యేకత అయిన 'గో-కార్ట్' లాంటి డ్రైవింగ్ డైనమిక్స్ ఇందులోనూ కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభం కాగా, అథరైజ్డ్ డీలర్ షిప్ ల ద్వారా డెలివరీలు కూడా మొదలయ్యాయి. లిమిటెడ్ ఎడిషన్ కారును ఇష్టపడే వారికి ఇది సరైన సమయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget