అన్వేషించండి

MG Windsor EV PRO Sale: ఎంజీ విండ్స‌ర్ ప్రోను హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించిన పీపీఎస్ మోటార్స్

MG Windsor ద్వారా ఈవీ కార్‌ల మార్కెట్‌లో సంచలనం సృ,ష్టించిన JSW MG MOTORS ఇప్పుడు దానికి అడ్వాన్స్‌డ్ వెర్షన్ తీసుకొచ్చింది. Windsor Pro వెర్షన్ మార్కట్‌లోకి రిలీజ్ అయింది.

MG Windsor EV PRO: జేఎస్‌డ‌బ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా సంస్థ  త‌న ఎంజీ విండ్స‌ర్ ప్రో కారును ఆవిష్కరించింది.  హైద‌రాబాద్ ఎల్‌బీన‌గ‌ర్‌ల‌ని పీపీఎస్ మోటార్స్ ఎంజీ షోరూంలో సేల్స్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంజీ విండ్సర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వెహికిల్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు  మ‌రిన్ని సాంకేతిక‌, భ‌ద్ర‌తా ఫీచ‌ర్ల‌తో  ప్రో సిరిస్‌ను తీసుకొచ్చింది. ఈ కారు బిజినెస్ క్లాస్ ప్ర‌యాణ అనుభ‌వాన్ని అందిస్తుంది. దాంతోపాటు కొత్త 52.9 కేడ‌బ్ల్యుహెచ్ బ్యాట‌రీ ప్యాక్ ఉంటుంది. ఎంజీ విండ్స‌ర్‌కు ఇప్ప‌టికే క‌స్ట‌మ‌ర్ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఇప్పుడు ప్రో సిరీస్ దీని మార్కెట్ ప‌నితీరును మరింత మెరుగుప‌రుస్తుంది. రూ. 12.49 ల‌క్ష‌లు + కి.మీ.కి రూ.4.5 ఎక్స్ షోరూం ధ‌ర‌తో పాటు మొద‌టి 8వేల బుకింగ్‌ల‌కు రూ. 17,49,800 ధ‌ర‌కు కూడా అందుబాటులో ఉంది.

స‌రికొత్త‌గా బ్యాట‌రీ యాజ్ ఎ స‌ర్వీస్ BAAS- బాస్ ప‌ద్ధ‌తిని వినియోగ‌దారుల‌కు అందించేందుకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్ర ప్రైమ్ సంస్థ‌ల‌తో జేఎస్‌డ‌బ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఈ వినూత్న‌మైన ప‌థ‌కాన్ని 2024 సెప్టెంబ‌రులో తొలిసారి ప్రారంభించారు. ఇప్పుడు బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్, హెరాఫియాన్ కార్ప్, ఈకోఫై, విద్యుత్‌టెక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్ర ప్రైమ్ వంటి ఆరు ఆర్థిక సంస్థ‌లు అందిస్తున్నాయి. జేఎస్‌డ‌బ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా సంస్థ ఎంజీ విండ్స‌ర్ ప్రో కోసం తన 3-60 హామీతో పాటు బైబ్యాక్ ప్రణాళికను అందించనుంది. ఇది 3 సంవత్సరాల త‌ర్వాత కూడా కారు విలువ‌లో 60%ను కాపాడుకుంటుందనే హామీ ఇస్తుంది. దాంతోపాటు ఎండీ విండ్స‌ర్ ప్రో మొద‌టి య‌జ‌మానికి కంపెనీ జీవిత‌కాల బ్యాట‌రీ వారంటీ ఇస్తుంది.

హైదరాబాద్‌లో విడుదల

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ PPS మోటర్ షోరూంలో కొత్త ప్రో కారును ఆవిష్కరించారు. LB నగర్ జోనల్ ఏసీపీ కృష్ణయ్య కొత్త కారును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పీపీఎస్ మోటార్స్ ఎండీ రాజీవ్ సంఘ్వీ మాట్లాడుతూ, “ఎంజీ విండ్సర్ ఎంజీ మోటర్ ఇండియాకు బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాన్ని అందించింది. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఈవీగా ఎదిగింది. ఎంజీ విండ్సర్ ప్రొని పరిచయం చేయడం ద్వారా, మేము ఆ విజయంలో ముందుకెళ్తున్నాము. అది చాలా విస్తృతమైన బ్యాటరీ శ్రేణిని, అడాస్ వంటి విదేశీ మోడర్న్ సురక్షిత లక్షణాలను, వినియోగదారులకు మెరుగైన‌ సౌకర్యం క‌ల్పించేందుకు రూపొందించిన అనేక అనుభూతులను అందిస్తోంది. తెలంగాణలో మేం ఇప్పటివరకు ఎంజీ విండ్సర్ ప్రోకు దాదాపు 225 బుకింగ్స్ పొందాము. ఎంజీ విండ్సర్ ప్రోకు తమ అపార స్పందనకు మా ఖాతాదారులకు కృతజ్ఞతలు” అన్నారు.

విండ్సర్ ప్రో ద్వారా చిన్న నగరాల్లో కూడా మార్కెట్‌ను విస్తరించాలని JSW MG మోటార్ అనుకుంటోంది.  “విండ్సర్ ఇప్పటికే దేశంలో ఓ సంచలనం సృష్టించింది.  వాల్యూ యాడెడ్ సర్వీసులతో , కస్టమర్లకు మంచి అనుభూతి ఇవ్వడంలో అది సక్సెస్ అయింది. మొదటి నుంచి  కూడా ఆ కార్ల అమ్మకాలు దూసుకెళఅలాయి. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో చిన్న నగరాల్లో కూడా అమ్మకాలు పెరిగాయి. MG Windsor Pro ఆవిష్క‌ర‌ణ‌ ద్వారా ఈవీ కార్ డ్రైవింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చబోతున్నాం. ఈవీలపై నమ్మకాన్ని ధృఢం చేయడంతోపాటు.. మరింత మంది వినియోగదారులను ఈవీ క్లబ్‌లో చేరుస్తామని నమ్మకం ఉందని”  JSW  ఎంజీ మోటర్ ఎండీ అనురాగ్ మోహరోత్రా కొత్త కారు ఆిష్కరణ సందర్భంగా చెప్పారు.

విండ్సర్ ప్రధానాంశాలు

ఎంజీ విండ్సర్ మార్కెట్‌లోకి వచ్చినప్పుటి నుంచి సంచలనాలు రేపింది. ఇప్పటికే 20వేలకు పైగా కార్లు విక్రయించారు.  భార‌త‌దేశంలో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న ఈవీ మోడ‌ల్ కారుగా దీనికి గుర్తింపు ఉంది.

* రూ.12.49 ల‌క్ష‌ల బీఏఏఎస్ ధ‌ర‌, కి.మీ.కి రూ.4.5 చొప్పున ప్ర‌క‌టించిన జేఎస్‌డ‌బ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా

* ఎంజీ విండ్స‌ర్ ప్రో కారు ఎక్స్ షోరూం ధ‌ర రూ. 17,49,800 (మొద‌టి 8వేల బుకింగ్‌ల‌కు)తో అందుబాటులో ఉంటుంది.

* ప్రో బ్యాట‌రీ: 52.9 కేడ‌బ్ల్యుహెచ్ భారీ బ్యాట‌రీ ప్యాక్‌, దీంతో స‌ర్టిఫైడ్ రేంజి 449 కి.మీ. ** (ఎంఐడీసీ పి1+పి2)

* ప్రో భ‌ద్ర‌త‌: 12 ప్ర‌ధాన‌మైన ఏడీఏఎస్ ఎల్‌2 ఫీచ‌ర్లతో ప్ర‌తిసారీ సుర‌క్షిత డ్రైవింగ్ అనుభ‌వం

* ప్రో టెక్‌:  వెహికిల్‌2లోడ్, వెహికిల్2వెహికిల్ స‌దుపాయం, ఇత‌ర ప‌రిక‌రాల‌తోపాటు ఈ-వాహ‌నాల‌కూ ఛార్జింగ్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం.

టాప్ హెడ్ లైన్స్

CNG కార్లకు వరుస అప్‌డేట్స్‌ వదిలిన మారుతి.. ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌లో కూడా AMT ఆప్షన్‌
ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌ CNG వెర్షన్ల డ్రైవింగ్‌ మరింత స్మూత్‌.. AMT గేర్‌బాక్స్‌ ఇచ్చిన మారుతి
రూ.8.32 లక్షలకే Maruti Baleno CNG AMT.. కిలోకు ఏకంగా 34.47 కిలోమీటర్లు!
మారుతి బలెనో CNGలో 'ఆటోమేటిక్‌' అప్‌డేట్.. కొత్త వేరియంట్‌ మైలేజ్ ఎంతంటే?
పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌
సాధారణ రోడ్లపై Royal Enfield Himalayan 440 పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది? - ఎక్స్‌పర్ట్‌ రిపోర్ట్‌
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Trump Tariffs On India: ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
IIT Bombay Incident: ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆ*త్మహత్య!
ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య!
Toughest Opponent Pick: కోహ్లీ, రోహిత్ కాదు ఆ ఇండియన్ బ్యాటర్ చుక్కలు చూపించాడు.. దిగ్గజ బ్యాటర్‌పై ఆసీస్ కెప్టెన్  కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
కోహ్లీ, రోహిత్ కాదు ఆ ఇండియన్ బ్యాటర్ చుక్కలు చూపించాడు.. దిగ్గజంపై ఆసీస్ కెప్టెన్  కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల బ్రహ్మోత్సవాలు 2026: మాయామోహ విమోచనం మోహిని రూపం, మాయామోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే సందేశం!
తిరుమల బ్రహ్మోత్సవాలు 2026: మాయామోహ విమోచనం మోహిని రూపం , మాయామోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే సందేశం!
Embed widget