అన్వేషించండి

Automobile Exports: ఆరు నెలల్లో 25 లక్షల కార్లు, బైకులు - భారత్ నుంచి భారీగా ఎగుమతులు!

India Automobile Exports: ఆరు నెలల్లో 25 లక్షలకు పైగా వాహనాలు భారతదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 14 శాతం ఎక్కువ కావడం విశేషం.

Automobile Exports From India: ఆటో రంగంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంచలనం నమోదు అవుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలలు ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా మంచివి. ఈ కాలంలో ఆటోమొబైల్ ఎగుమతుల్లో 14 శాతం పెరుగుదల నమోదైంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది.

ఆరు నెలల్లోనే 25 లక్షలకు పైగా...
ఎస్ఐఏఎమ్ డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 25,28,248 యూనిట్ల వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 14 శాతం ఎక్కువ. సియామ్ ప్రెసిడెంట్ ప్రకారం భారతదేశం నుంచి ఎగుమతులు వేగంగా పెరిగాయి. వివిధ కారణాల వల్ల లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లు గత కొన్నేళ్లుగా మాంద్యంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత కొన్నేళ్ల డేటాను పరిశీలిస్తే ఆటోమొబైల్ ఎగుమతులు క్షీణించాయి.

గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 45 లక్షల యూనిట్లు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 47 లక్షలకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్-సెప్టెంబర్) ప్యాసింజర్ కార్ల రవాణా ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగింది.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు ఎగుమతి చేసింది?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అత్యధిక ప్యాసింజర్ కార్లను ఎగుమతి చేసింది. 1,47,063 వాహనాల రవాణాతో కంపెనీ అగ్రస్థానంలో ఉంది. గతేడాది ఇదే సమయంలో ఎగుమతి చేసిన వాహనాల యూనిట్లు 1,31,546గా ఉంది.

84,900 కార్లను ఎగుమతి చేసిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎగుమతుల పరంగా రెండో స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎగుమతి చేసిన వాహనాలు 86,105 యూనిట్లు అంటే దాదాపు ఒక శాతం తక్కువ. ప్రతి సంవత్సరానికి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వాహనాలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచ ఆటో మార్కెట్లో భారత్ నుంచి వెళ్లే వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని అనుకోవచ్చు.

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
Automobile Exports: ఆరు నెలల్లో 25 లక్షల కార్లు, బైకులు - భారత్ నుంచి భారీగా ఎగుమతులు!
ఆరు నెలల్లో 25 లక్షల కార్లు, బైకులు - భారత్ నుంచి భారీగా ఎగుమతులు!
Kanguva Second Singile : 'యోలో' సాంగ్ లో ఫుల్ పార్టీ మోడ్ లో సూర్య... పూనకాలు తెప్పిస్తున్న 'కంగువ' సెకండ్ సింగిల్ 
'యోలో' సాంగ్ లో ఫుల్ పార్టీ మోడ్ లో సూర్య... పూనకాలు తెప్పిస్తున్న 'కంగువ' సెకండ్ సింగిల్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP DesamOwaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
Automobile Exports: ఆరు నెలల్లో 25 లక్షల కార్లు, బైకులు - భారత్ నుంచి భారీగా ఎగుమతులు!
ఆరు నెలల్లో 25 లక్షల కార్లు, బైకులు - భారత్ నుంచి భారీగా ఎగుమతులు!
Kanguva Second Singile : 'యోలో' సాంగ్ లో ఫుల్ పార్టీ మోడ్ లో సూర్య... పూనకాలు తెప్పిస్తున్న 'కంగువ' సెకండ్ సింగిల్ 
'యోలో' సాంగ్ లో ఫుల్ పార్టీ మోడ్ లో సూర్య... పూనకాలు తెప్పిస్తున్న 'కంగువ' సెకండ్ సింగిల్ 
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ  - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
The Raja Saab : 'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్... కింగ్ ఆఫ్ స్వాగ్‌ - మరో కిక్ ఇచ్చే అప్డేట్ కూడా ఆన్ ది వే 
'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్... కింగ్ ఆఫ్ స్వాగ్‌ - మరో కిక్ ఇచ్చే అప్డేట్ కూడా ఆన్ ది వే 
Dana Cyclone: ఏపీకి తుపాను 'దానా' ముప్పు - మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
ఏపీకి తుపాను 'దానా' ముప్పు - మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
Embed widget