MG Windsor EV ధర పెరిగింది! కొత్త ధరలు, EMI వివరాలు, టాప్ 1 ఎలక్ట్రిక్ కారుపై లేటెస్ట్ అప్‌డేట్స్ !
MG Windsor EV Driving Range: ఈ MG కారు 52.9 kWh బ్యాటరీతో పని చేస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కి.మీ. వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ EV రేటు ఎంత పెరిగిందో తెలుసా?.

MG Windsor EV Price Hike: 2025 ఆర్థిక సంవత్సరంలో, MG విండ్సర్ EV భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన EVగా మారింది. ఇప్పుడు, ఈ కంపెనీ, తన EV రేట్లను సవరించింది. ఇది కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లలో కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది.
MG మోటార్, విండ్సర్ EV టాప్ వేరియంట్ అయిన ఎసెన్స్ ప్రో (MG Windsor Essence Pro Price) ధరను 21 వేల రూపాయలకు పైగా పెంచింది. దీంతో, కొత్త ధర 18 లక్షల 31 వేలుగా (ఎక్స్-షోరూమ్) మారింది. మిగతా అన్ని వేరియంట్‌ల రేట్లలో ఎటువంటి మార్పు లేదు. విండ్సర్ EV బేస్ వేరియంట్ Excite ఎక్స్-షోరూమ్ ధర రూ. 14 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, వేరియంట్‌ను బట్టి ఈ రేటు మారుతుంది.
దేశంలో నంబర్-1 ఎలక్ట్రిక్ కారు
2025 ఆర్థిక సంవత్సరంలో, MG విండ్సర్ EV మొత్తం 19,394 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి నంబర్-1 గా నిలిచింది. దీని తర్వాత 17,966 యూనిట్ల అమ్మకాలతో Tata Punch EV రెండో స్థానంలో ఉంది. 17,145 మంది కస్టమర్లు కొనుగోలు చేయడంతో Tata Tiago EV థర్డ్ ప్లేస్‌లోకి వచ్చింది. 13,978 యూనిట్ల అమ్మకాలతో Tata Nexon EV నాలుగో స్థానంలో ఉంది. 10,149 యూనిట్ల అమ్మకాలతో MG Comet EV ఐదో నంబర్ దగ్గర ఉంది.
MG విండ్సర్ ప్రో బ్యాటరీ & డ్రైవింగ్ రేంజ్
MG విండ్సర్ EV వివిధ బ్యాటరీ వేరియంట్లలో వస్తుంది, ఇవి లాంగ్ రేంజ్‌ను అందిస్తాయి. విండ్సర్ ప్రో వేరియంట్‌లో, కంపెనీ 52.9 kWh బ్యాటరీ అమర్చింది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 449 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగదలని కంపెనీ డేటా వెల్లడించింది.
MG విండ్సర్ EV డిజైన్, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం లుక్‌లో ఉంటుంది & ఇది కస్టమర్లను ఆకర్షిస్తుంది. MPV తరహాలో విశాలమైన బూట్ స్పేస్ కూడా ఇందులో ఉంది, పెద్ద కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ కన్సోల్ & కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన లక్షణాలను MG విండ్సర్ EV లో చూడవచ్చు.
ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) & 360 డిగ్రీల కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇతర ప్రీమియం EVలతో పోలిస్తే దీని ధర తక్కువ & డబ్బుకు ఎక్కువ విలువను అందించగలదు. పైగా, స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, కుటుంబానికి సురక్షితమైన & అధునాతన ఎంపికగా కూడా మారుతుంది.
ఇప్పుడు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?
హైదరాబాద్ MG Windsor EV Excite వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 15.10 లక్షలు కాగా, విజయవాడలో దాదాపు రూ. 15.05 లక్షలు. ఆన్-రోడ్ ధరలో.. RTO ఛార్జీలు, బీమా & ఇతర తప్పనిసరి రుసుములు ఉంటాయి. మీరు విజయవాడలో ఈ కారును కొనాలంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 13.05 లక్షలను బ్యాంకు నుండి రుణం తీసుకోవాలి. బ్యాంక్ వడ్డీ రేటు 9% అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్ చూద్దాం.
EMI ఆప్షన్స్
- 7 సంవత్సరాల్లో (84 నెలలు) రుణం తీర్చేయాలనుకుంటే మీ నెలవారీ EMI రూ. 20,982 అవుతుంది.
- 6 సంవత్సరాల్లో (72 నెలలు) కాలంలో రుణం తీర్చేయాలనుకుంటే మీ నెలవారీ EMI రూ. 23,508 అవుతుంది.
- 5 సంవత్సరాల్లో (60 నెలలు) కాలంలో రుణం తీర్చేయాలనుకుంటే మీ నెలవారీ EMI రూ. 27,072 అవుతుంది.
- 4 సంవత్సరాల్లో (48 నెలలు) కాలంలో రుణం తీర్చేయాలనుకుంటే మీ నెలవారీ EMI రూ. 32,454 అవుతుంది.
- కార్ లోన్‌పై వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోరు, నగరం & సంబంధిత బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.





















