అన్వేషించండి

MG Majestor India Launch on April 20: ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు 'మెజెస్టర్' వచ్చేస్తోంది..! ఎంజీ మోటార్ నుండి మోస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఎంజీ మోటార్ ఏప్రిల్ 20న మెజెస్టర్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. గ్లోస్టర్ కంటే ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ ఆఫ్-రోడ్ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి వస్తోంది.

MG Majestor India Launch on April 20: ఇండియ‌న్ ఎస్‌యూవీ (SUV) ప్రియులకు ఎంజీ మోటార్ ఇండియా ఒక తీపి కబురు చెప్పింది. వచ్చే వారం అంటే ఏప్రిల్ 20, 2026 రోజున‌ తన సరికొత్త ప్రీమియం మోడల్ 'మెజెస్టర్'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో మెరిసిన ఈ కారు, నిజానికి గ్లోస్టర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. అయితే, దీని డిజైన్, ఫీచర్లు చూస్తే గ్లోస్టర్ కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. ఫుల్-సైజ్ ఎస్‌యూవీ కోరుకునే వారు, ఆఫ్-రోడ్ ప్రయాణాలను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది.

బుకింగ్స్ - ఆఫర్లు..
మెజెస్టర్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో లేదా ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద రూ. 41,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. మే 2026 నుండి డెలివరీలు మొదలవుతాయి. మొదటి 3,000 మంది కస్టమర్లకు ఎంజీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారికి ఐదేళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, ఐదేళ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఐదేళ్ల పాటు ఉచిత సర్వీస్ లేబర్ కాంట్రాక్ట్ లభిస్తాయి.

డిజైన్ - ఇంటీరియర్ ఫీచ‌ర్లు..
మెజెస్టర్ ముందు భాగంలో పెద్ద మ్యాట్రిక్స్ స్టైల్ గ్రిల్, ఫాల్కన్ డిజైన్ డీఆర్ఎల్స్ (DRLs) కారుకు రాజసాన్ని ఇస్తాయి. 19-అంగుళాల అలాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టైల్ లైట్స్ కారు లుక్‌ను మార్చేశాయి. లోపల 6 లేదా 7 సీట్ల లేఅవుట్ ఆప్షన్లు ఉన్నాయి. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, జేబీఎల్ (JBL) 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు లగ్జరీ ఫీల్ ఇస్తాయి. ముందు సీట్లకు హీటింగ్, కూలింగ్ తో పాటు మసాజ్ ఫంక్షన్స్ ఉండటం గమనార్హం.

సేఫ్టీ - ఇంజిన్ పవర్..
భద్రత కోసం లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS) ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రయాణికులకు రక్షణ ఇస్తాయి. ఇంజిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ 215 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ దీని సొంతమని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఆఫ్-రోడ్ బాద్‌షా..
మెజెస్టర్‌లో ఎం-హబ్ (M-Hub) అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఉంది. ఇది 10 రకాల డ్రైవ్ మోడ్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఎం-కాల్ (M-Crawl) ఫంక్షన్ సహాయంతో ఎటువంటి క్లిష్టమైన దారిలోనైనా సులభంగా ప్రయాణించవచ్చు. మూడు డిఫరెన్షియల్ లాక్స్ ఉండటం వల్ల ఆఫ్-రోడింగ్ మరింత సులభం అవుతుంది. ఈ ఎస్‌యూవీ 810 మిమీ లోతు ఉన్న నీటిలో కూడా అలవోకగా వెళ్లగలదు. షార్ప్ 4x2, సావీ 4x2, సావీ 4x4 అనే మూడు వేరియంట్లలో ఇది లభిస్తుంది. మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 40 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈనెల 20 తర్వాత భారత ఎస్ యూవీ మార్కెట్ హాట్ హాట్ పోటీకి వేదిక కానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొత్త మెజెస్టర్ రాకతో సమీకరణలు మారనున్నాయని పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Engine Layout: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!
మీ కారు ఇంజిన్‌ ముందు వైపు ఉందా, మధ్యలో ఉందా.. డ్రైవింగ్‌లో వచ్చే తేడా ఏంటి?
Car Tyre Pressure: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!
టైర్ ప్రెజర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా? మైలేజీ, బ్రేకింగ్, టైర్ లైఫ్‌ మీద ఎంత ప్రభావమో తెలుసా?
Moto Guzzi The Trip: 457cc ఇంజిన్‌, 47.6hp పవర్‌తో కొత్త రెట్రో రెట్రో రోడ్‌స్టర్.. ఫీచర్లు, కలర్ ఆప్షన్లు
బైక్‌ పేరు Moto Guzzi The Trip.. 457cc ఇంజిన్‌తో వస్తున్న కొత్త ఇటలీ మోటార్‌సైకిల్‌
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget