అన్వేషించండి

Summer Road Trip Guide: సమ్మర్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా? మీ కారును ఇలా రెడీ చేసుకోండి,  సేఫ్ జర్నీ కోసం టిప్స్!

వేసవిలో కారు ప్రయాణం చేసే ముందు కూలెంట్, టైర్లు, ఏసీ వంటి ముఖ్యమైన భాగాలను తనిఖీ చేసుకోవడం వల్ల హైవేలపై ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. లాంగ్ డ్రైవ్ కు అవ‌స‌ర‌మైన టిప్స్ తెలుసుకుందాం.

Summer Road Trip Guide News: ఇండియాలో వేసవి కాలం మొదలైందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. ఈ సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే, హైవేపైకి వెళ్ళే ముందు మీ కారును ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నడిరోడ్డుపై ఇంజన్ ఆగిపోయి, ఎండలో గంటల తరబడి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేవలం 10 నుండి 15 నిమిషాల సమయం కేటాయించి కింద చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం ఎంతో హ్యాపీగా సాగుతుంది.

కూలెంట్ - ఇంజన్ ఆయిల్ చెకప్..
ఎండల వల్ల ఇంజన్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే అన్నిటికంటే ముందు కూలెంట్ లెవల్ చెక్ చేయండి. కూలెంట్ తక్కువగా ఉంటే నిమిషాల వ్యవధిలోనే ఇంజన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కూలెంట్ బాటిల్ మీద ఉండే మినిమం, మాక్సిమం మార్కుల మధ్య ద్రవం ఉండేలా చూసుకోండి. ఒకవేళ తక్కువగా ఉంటే వెంటనే టాప్-అప్ చేయండి. అలాగే ఇంజన్ ఆయిల్ కూడా తనిఖీ చేయండి. ఆయిల్ పాతదైనా లేదా తక్కువగా ఉన్నా ఇంజన్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. సర్వీసింగ్ టైమ్ దగ్గరపడితే అస్సలు ఆలస్యం చేయకండని నిపుణుల సూచిస్తున్నారు.

టైర్లు - బ్యాటరీ కండిషన్..
వేసవిలో టైర్ల విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి వల్ల టైర్లలో ఉండే గాలి వ్యాకోచిస్తుంది. అందుకే గాలి ఎక్కువగా ఉంటే టైర్లు పేలిపోయే రిస్క్ ఉంటుంది. కంపెనీ సూచించిన మేరకే ఎయిర్ ప్రెజర్ మెయింటైన్ చేయండి. టైర్లపై ఏవైనా కట్స్ లేదా అరిగిపోయిన గుర్తులు ఉంటే లాంగ్ జర్నీకి ముందే మార్చడం ఉత్తమం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఎండ వేడి బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. కారు స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటే ఒకసారి మెకానిక్‌తో చెక్ చేయించుకోండి. దారి మధ్యలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో బ్యాటరీ మొరాయిస్తే చాలా కష్టమవుతుంది అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 

ఏసీ - బ్రేక్స్ ప్రాధాన్యత..
ఈ ఎండల్లో ఏసీ సరిగ్గా పని చేయకపోతే ప్రయాణం నరకంలా మారుతుంది. ఏసీ కూలింగ్ తక్కువగా ఉన్నా లేదా ఏవైనా శబ్దాలు వస్తున్నా ముందే రిపేర్ చేయించుకోండి. క్యాబిన్ చల్లగా ఉంటేనే డ్రైవర్ అలసట చెందకుండా ప్రయాణం కొనసాగించగలరు. వీటితో పాటు బ్రేక్స్ కూడా చాలా ముఖ్యం. బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు ఏవైనా వింత శబ్దాలు వస్తున్నాయేమో గమనించండి. బ్రేక్స్ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కారులో ఉంచుకోవాల్సిన వస్తువులు..
ప్రయాణంలో మీతో పాటు కొన్ని అత్యవసర వస్తువులు ఉంచుకోండి. తాగడానికి నీళ్ల బాటిళ్లు, ఫోన్ ఛార్జర్, కొన్ని స్నాక్స్, బేసిక్ టూల్ కిట్ వెంట ఉంచుకోవడం మంచిది. కారు డాక్యుమెంట్లను కూడా అందుబాటులో ఉంచుకోండి.  అప్‌డేటెడ్ కార్లలో సేఫ్టీ ఫీచర్లు బాగున్నప్పటికీ, మనం తీసుకునే ఈ కనీస జాగ్రత్తలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి. ఈ చిన్నపాటి ప్రిపరేషన్ మీ ట్రిప్‌ను చిరస్మరణీయం చేస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Shooting Organization Outcry: పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
Embed widget