By: ABP Desam | Updated at : 03 Aug 2023 09:40 PM (IST)
మారుతి సుజుతి కార్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ( Image Source : ABP Live )
Discount on Cars: భారతదేశంలోని మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపులను అందించింది. ఆగస్టు నెలలో ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్-ఆర్ వంటి వాహనాలపై కంపెనీ రూ.57,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ వాహనాల కొనుగోలుపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో దీని ప్రయోజనాలను పొందవచ్చు.
మారుతీ సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 57 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే దాని ఏఎంటీ, ఎల్ఎక్స్ఐ మాన్యువల్‌పై రూ. 52 వేల వరకు తగ్గింపు అందించనున్నారు. అదే సమయంలో దాని సీఎన్‌జీ వేరియంట్‌పై కూడా రూ. 22,000 ఆదా చేసుకోవచ్చు.
మారుతి సుజుకి ఆల్టో కే10
ఈ కారుపై కూడా కంపెనీ రూ.57 వేల తగ్గింపును అందిస్తోంది. ఈ కారు మాన్యువల్ వేరియంట్లపై రూ. 57 వేల వరకు, CNG వేరియంట్‌లపై రూ. 52 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీని AMT వేరియంట్‌లు రూ. 32 వేల వరకు తగ్గింపును పొందవచ్చు.
మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో
ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లపై కంపెనీ రూ. 56 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఏఎంటీ వేరియంట్‌లో రూ. 32 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
మారుతి సుజుకి సెలెరియో
ఈ నెలలో మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్, సీఎన్‌జీ మాన్యువల్ వేరియంట్లపై రూ. 56 వేల వరకు ఆదా చేయవచ్చు. అయితే AMT వేరియంట్‌పై రూ. 41,000 తగ్గింపు లభించనుంది.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
కంపెనీ ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీ మోడల్ కారుపై రూ. 51 వేల వరకు తగ్గింపును అందించనుంది. అయితే దాని పెట్రోల్ వేరియంట్‌లపై కూడా రూ. 26 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
మారుతీ సుజుకి ఈకో
మారుతి సుజుకి ఈకో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 39 వేల వరకు తగ్గింపును లభిస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్‌పై కూడా రూ. 33,100 డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.
మారుతీ సుజుకి ఆల్టో 800
మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లపై రూ. 15 వేల విలువైన ప్రయోజనాలు పొందవచ్చు.
మారుతి సుజుకి డిజైర్
కంపెనీ తన మోస్ట్ పాపులర్ సెడాన్ కారు డిజైర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లపై రూ. 10,000 వరకు లాభాలను అందించనుంది. అయితే దీని సీఎన్‌జీ వేరియంట్‌లపై మాత్రం ఎటువంటి తగ్గింపులు అందించలేదు.
Augmenting our ambitious exports plans, we began exports of Fronx to international markets. We thank customers for their belief in #MarutiSuzuki cars and the affirmative response Fronx received in domestic markets. We intend to replicate this success overseas as well. (1/2) pic.twitter.com/BosjpMPMTM
— Maruti Suzuki (@Maruti_Corp) July 6, 2023
“Aligned to Government's efforts towards #MakeInIndia, we are focused to lead the export of cars manufactured in India... The customers of Fronx can feel good that their much-loved vehicle will also become the choice of customers globally.”- Mr. H. Takeuchi, MD & CEO (2/2)
— Maruti Suzuki (@Maruti_Corp) July 6, 2023
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?
Upcoming Electric SUVs: త్వరలో మనదేశంలో రానున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే - లిస్ట్‌లో ఏ కార్లు ఉన్నాయి?
సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
/body>