Maruti Suzuki భారీ దీపావళి ఆఫర్లు - Brezza, Dzire, Ertiga, WagonR పై ₹57,500 వరకు డిస్కౌంట్లు
Maruti Suzuki, దీపావళి 2025 ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, స్విఫ్ట్, బ్రెజ్జా, వాగన్‌ఆర్ వంటి మోడళ్లపై ₹57,500 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఆఫర్లు అక్టోబర్ 23 వరకు మాత్రమే.

Maruti Suzuki Diwali Offers 2025: దీపావళి సీజన్ అంటే డిస్కౌంట్ల సీజన్. ఈ ఏడాది పండుగ సందర్భంగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) కస్టమర్ల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 23, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్లలో, కొత్త మారుతి కారు కొనేవాళ్లకు ₹57,500 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. GST 2.0 రూల్ తరువాత కార్ల ధరలు తగ్గడంతో పాటు, ఈ ఫెస్టివ్ బెనిఫిట్స్ వల్ల మరింత ఆదా చేసుకునే అవకాశం దక్కింది.
Alto K10 - బడ్జెట్ కార్లలో టాప్ ఆఫర్
ఎంట్రీ లెవెల్ Maruti Alto K10 కొనుగోలు చేస్తే గరిష్టంగా ₹52,500 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో ₹25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది.
S-Presso - క్యూట్ లుక్, చక్కని ఆఫర్
Maruti S-Presso పై ఈ దీపావళికి ₹47,500 వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందులో ₹20,000 క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది.
WagonR - ఫ్యామిలీ ఫేవరేట్‌కి మాక్స్ బెనిఫిట్
అమ్మకాల జాబితాలో ఎప్పుడూ ముందుండే Maruti WagonR, ఈసారి ₹57,500 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో ₹30,000 క్యాష్ డిస్కౌంట్, ₹15,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్లు అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి.
| మారుతి సుజుకి అరేనా మోడళ్లు | గరిష్ట డిస్కౌంట్ |
| 1. Alto K10 | రూ. 52,500 వరకు |
| 2. Celerio | రూ. 52,500 వరకు |
| 3. S-Presso | రూ. 47,500 వరకు |
| 4. WagonR | రూ. 57,500 వరకు |
| 5. Swift | రూ. 48,750 వరకు |
| 6. Dzire | రూ. 2,500 వరకు |
| 7. Brezza | రూ. 35,000 వరకు |
| 8. Ertiga | – |
| 9. Eeco | రూ. 42,500 వరకు |
Swift - యువతకు ఫేవరేట్ ఆఫర్
Maruti Swift హాచ్‌బ్యాక్ కొనుగోలుదారులకు ₹48,750 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి, దీపావళి వెలుగులు పంచుతాయి. LXi, CNG వేరియంట్లకు ₹10,000 క్యాష్ డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది, అయితే ఇతర వేరియంట్లకు ₹20,000 వరకు ఉంది.
Brezza - SUV స్టైల్లో ఆఫర్
సిటీ SUV Maruti Brezza పై ₹35,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేకపోయినప్పటికీ, ₹15,000 ఎక్స్చేంజ్ బోనస్, ₹25,000 స్క్రాపేజ్ బోనస్ & అదనంగా ₹10,000 స్పెషల్ ఆఫర్ ఉన్నాయి.
Dzire & Ertiga - లిమిటెడ్ ఆఫర్లు
Maruti Dzire కాంపాక్ట్ సెడాన్ కొనుగోలుదారులకు ₹25,000 వరకు లాభాలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. Maruti Ertiga MPV మీద ఈ నెలలో ఎటువంటి ఆఫర్‌ను మారుతి ఇవ్వడం లేదు.
Eeco - బడ్జెట్ యుటిలిటీ వెహికల్
Maruti Eeco మోడల్ కొనుగోలుదారులకు ₹42,500 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఇందులో ₹15,000 క్యాష్ డిస్కౌంట్ ఉంది.
కమర్షియల్ వాహనాలకు స్పెషల్ ఆఫర్లు
WagonR Tour H3, Dzire Tour S, Alto Tour H1, Eeco Tour V వంటి కమర్షియల్ మోడళ్లపై భారీగా ₹70,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.
ఈ దీపావళి సీజన్‌లో మారుతి సుజుకి కస్టమర్లకు అత్యధిక బెనిఫిట్స్, తగ్గింపు ధరలు, వివిధ మోడళ్లలో విభిన్న ఆప్షన్లు అందిస్తోంది. మీరు కొత్త మారుతి కారు కొనాలనుకుంటే, అక్టోబర్ 23 లోగా మీ దగ్గరలోని మారుతి షోరూమ్‌కు వెళ్లి, ఈ బంపర్ ఆఫర్‌లను మిస్ కాకుండా సొంతం చేసుకోండి.





















