అన్వేషించండి

Mahindra Thar Roxx కొంటారా?, నెలకు 2,000km ప్రయాణించే వాళ్లకు ఏది బెస్ట్‌ - పెట్రోల్‌ లేదా డీజల్‌?

నెలకు 1,500 నుంచి 2,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించేందుకు Mahindra Thar Roxx కొనాలనుకుంటున్నారా?, మీ ముందు పెట్రోల్‌ & డీజిల్‌ వెర్షన్‌లు ఉన్నాయి. ఏది ఎంచుకుంటారు?

Mahindra Thar Roxx Diesel or Petrol Version: మహీంద్రా & మహీంద్రా ఇటీవల లాంచ్‌ చేసిన థార్‌ రాక్స్‌ SUV గురించి ఆఫ్‌రోడింగ్‌ కారు ప్రేమికుల్లో జోరుగా చర్చ సాగుతోంది. చాలా మంది, “నా ప్రయాణం నెలకు సుమారు 1,500 నుంచి 2,000 km వరకు ఉంటుంది... ఈ నేపథ్యంలో నేను థార్‌ రాక్స్‌లో పెట్రోల్‌ వెర్షన్‌ తీసుకోవాలా లేదా డీజల్‌ వెర్షన్‌ తీసుకోవాలా?” అని సందేహం పడుతున్నారు. ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం - డీజల్‌ వెర్షన్‌నే స్మార్ట్‌ ఛాయిస్‌. ఎందుకు డీజిలే మంచిదో కూడా అర్ధం చేసుకుందాం.

నెలకు 2,000 km జర్నీకి డీజల్‌ వెర్షన్‌ ఎందుకు మంచిది?
మీ నెలవారీ ప్రయాణం 2,000 కిలోమీటర్లు అయితే, రోజుకు దాదాపు 50-60 కిలోమీటర్లు తిరుగుతారు. ఈ రేంజ్‌కి పెట్రోల్‌ వెర్షన్‌ కంటే డీజిల్‌ వెర్షన్‌ ఎక్కువ డబ్బు ఆదా చేస్తుంది. పెట్రోల్‌ వెర్షన్‌ నడపడానికి కాస్త స్మూత్‌గా అనిపించినా, దీర్ఘకాలంలో ఫ్యూయల్‌ ఖర్చు ఎక్కువ అవుతుంది. మరోవైపు డీజిల్‌ మైలేజ్‌ బాగా ఇస్తుంది, అందుకే నెలవారీ ఎక్కువగా డ్రైవింగ్‌ చేసేవారికి ఇది సరైన ఎంపిక.

ఇంజిన్‌ పనితీరు & ఫీల్‌
థార్‌ రాక్స్‌ డీజిల్‌లో ఉన్న 2.2 లీటర్‌ mHawk ఇంజిన్‌ మార్కెట్లో బెస్ట్‌ పవర్‌ట్రెయిన్‌గా గుర్తింపు పొందింది. ఇది శక్తిమంతమైనదే కాకుండా చాలా స్మూత్‌గా పని చేస్తుంది. టార్క్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఆఫ్‌రోడ్‌లో కూడా డ్రైవర్‌కు అనుగుణంగా ఇది అద్భుతంగా స్పందిస్తుంది. మీరు ఎక్కువగా హైవే డ్రైవ్స్‌ చేసేవారైతే ఈ ఇంజిన్‌ మీకు సూపర్‌ ఫీలింగ్‌ ఇస్తుంది.

పెట్రోల్‌ వెర్షన్‌ ఎలా ఉంటుంది?
పెట్రోల్‌ వెర్షన్‌ 2.0 లీటర్‌ టర్బో ఇంజిన్‌తో వస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కి స్మూత్‌గా ఉంటుంది కానీ, దీర్ఘకాల వినియోగంలో ఫ్యూయల్‌ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ లేదా నెలవారీగా తక్కువగా డ్రైవింగ్‌ చేసే వారికి థార్‌ రాక్స్‌ పెట్రోల్‌ వెర్షన్‌ చక్కగా సరిపోతుంది. కానీ, మీరు నెలకు 2,000 దాటిస్తే డీజిల్‌నే వెర్షనే ఆర్థికంగా మేలైన ఎంపిక అవుతుంది.

DPF (Diesel Particulate Filter) సిస్టమ్‌
ప్రస్తుత BS6 డీజిల్‌ ఇంజిన్‌లలో DPF సిస్టమ్‌ ఉంటుంది. దీనిని సరిగ్గా పనిచేయించడానికి అప్పుడప్పుడూ హైవేపై లాంగ్‌ డ్రైవ్‌ చేయడం మంచిది. ఇది ఇంజిన్‌లో కార్బన్‌ డిపాజిట్స్‌ తగ్గించి ఇంజిన్‌కు దీర్ఘకాల ఆయుష్షు ఇస్తుంది.

మీ నెలవారీ డ్రైవింగ్‌ 1,500–2,000 కిలోమీటర్లు అయితే, థార్‌ రాక్స్‌ డీజిల్‌ వెర్షన్‌ మీకు ఆర్థికంగా, పనితీరు పరంగా, డ్రైవింగ్‌ ఫీలింగ్‌లోనూ మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు ఎక్కువగా హైవే ట్రిప్స్‌ చేస్తుంటే, ఇది మరింత రివార్డింగ్‌ ఆప్షన్‌.

ఇంజిన్‌ నాణ్యత, మైలేజ్‌, పవర్‌ డెలివరీ - ఈ మూడు కారణాల వల్ల కూడా మహీంద్రా థార్‌ రాక్స్‌ డీజిల్‌ వెర్షన్‌ టాప్‌ ఛాయిస్‌గా నిలుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Honda Upcoming Bikes:హోండా నుంచి టూవీల్స్ సునామీ! 151 కి.మి. రేంజ్ బైక్ నుంచి ఇ- క్లచ్‌ టెక్నాలజీతో రానున్న 10 మోడల్స్ ఇవే!
హోండా నుంచి టూవీల్స్ సునామీ! 151 కి.మి. రేంజ్ బైక్ నుంచి ఇ- క్లచ్‌ టెక్నాలజీతో రానున్న 10 మోడల్స్ ఇవే!
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!
కొత్త కియా సైరోస్ EV మన మార్కెట్‌లోకి వచ్చేసింది - కేవలం కేవలం రూ.8 లక్షలకే 526 km రేంజ్!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget