అన్వేషించండి

పవర్‌ కావాలా? మైలేజ్‌ కావాలా? Fronx, Baleno టాప్‌ వేరియంట్లలో మీ స్టైల్‌కు సూటయ్యేది ఏది?

Maruti Fronx Alpha, Baleno Alpha టాప్‌ వేరియంట్ల పోలిక. ఇంజిన్‌ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు, గ్రౌండ్‌ క్లియరెన్స్‌, తెలుగు రాష్ట్రాల్లో ధరల ఆధారంగా ఏది బెస్ట్‌ విలువ ఇస్తుందో తెలుసుకోండి.

Fronx vs Baleno Comparison: మారుతి నెక్సా షోరూమ్‌లో అమ్మే రెండు పాపులర్‌ కార్లు - Fronx & Baleno. ఈ రెండూ ఒకే Heartect ప్లాట్‌ఫారమ్‌పై తయారయ్యాయి. కానీ ఒకటి కాంపాక్ట్‌ క్రాస్‌ఓవర్‌ స్టైల్‌లో ఉండే SUV మాదిరిగా కనిపించే మోడల్‌, మరొకటి హ్యాచ్‌బ్యాక్‌. చాలా భాగాలు ఒకేలా ఉండటంతో, కొనుగోలుదారులు ఈ రెండు మధ్య సందిగ్ధంలో పడతారు. ముఖ్యంగా టాప్‌ వేరియంట్లు Fronx Alpha, Baleno Alpha మధ్య ఏది ఎక్కువ విలువ ఇస్తుందో అని సెర్చ్‌ చేస్తుంటారు.

ఇంజిన్‌ & పనితీరు

Fronx Alphaలో 1.0 లీటర్‌ Boosterjet టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది Baleno కంటే సుమారు 10hp ఎక్కువ పవర్‌, 35Nm ఎక్కువ టార్క్‌ ఇస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కూడా అందుబాటులో ఉంటుంది. డ్రైవింగ్‌లో స్మూత్‌గా, స్పందన బాగా ఉంటుంది.

Baleno Alphaలో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది పవర్‌ పరంగా కొంచెం తక్కువే అయినా, మైలేజ్‌లో ముందుంటుంది. మాన్యువల్‌, AMT వేరియంట్లలో కూడా మంచి ఇంధన సామర్థ్యం ఇస్తుంది. బడ్జెట్‌ చూసే వారికి ఇది ప్లస్‌.

Maruti Fronx vs Baleno: Engine, gearbox and mileage
మోడల్‌
ఫ్రాంక్స్  
బాలెనో
వేరియంట్‌ 
Alpha
Alpha
ఇంజిన్‌ 
1L turbo petrol
1.2L naturally aspirated petrol
సిలిండర్‌ కౌంట్‌
3
4
పవర్‌ 
100hp
90hp
టార్క్‌
148Nm
113Nm
గేర్‌బాక్స్‌ 
5MT/ 6AT
5MT/ 5AMT
కంపెనీ క్లెమ్‌డ్‌ మైలేజ్‌
21.5kpl (MT), 20.01kpl (AT)
22.35kpl (MT), 22.94kpl (AMT)

ఫీచర్ల పరంగా ఎవరు బెటర్‌?

ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లలో రెండు కార్లలో LED ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టయ్యే ORVMలు, రియర్‌ వైపర్‌ వాషర్‌ వంటి ఫీచర్లు కామన్‌.

Balenoలో ఫ్రంట్‌ ఫాగ్‌ ల్యాంప్స్‌, క్రోమ్‌ డోర్‌ హ్యాండిల్స్‌ ఉన్నాయి. Fronx మాత్రం డ్యూయల్‌ టోన్‌ పెయింట్‌ ఆప్షన్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఇంటీరియర్‌లో రెండు కార్లలో పెద్ద టచ్‌స్క్రీన్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, ఆటో క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే Balenoలో వైర్‌లెస్‌ చార్జర్‌, ప్యాడిల్‌ షిఫ్టర్లు లేవు. రెండింటిలోనూ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, రియర్‌ ఆర్మ్‌రెస్ట్‌ లేవు.

సేఫ్టీ - Balenoకి రేటింగ్‌ ఉంది

సేఫ్టీ విషయంలో Baleno 2025 జూన్‌లో BNCAPలో 4 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. Fronx ఇంకా టెస్ట్‌ కాలేదు. అయితే రెండు కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ABS, ESC వంటి చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

గ్రౌండ్‌ క్లియరెన్స్‌, డ్రైవింగ్‌ అనుభవం

Fronxలో 190mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంటుంది. Baleno కంటే 20mm ఎక్కువ. మన రోడ్లపై గుంతలు, స్పీడ్‌బ్రేకర్లు దాటేటప్పుడు ఈ అదనపు ఎత్తు ఉపయోగపడుతుంది. కూర్చోవడం, దిగడం కూడా కొంచెం సులభంగా ఉంటుంది.

హైదరాబాద్‌, విజయవాడ ధరలు

హైదరాబాద్‌లో Baleno Alpha ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ.9 లక్షల దగ్గర ప్రారంభమవుతుంది. Fronx Alpha ధర దాదాపు రూ.11 లక్షల వరకు ఉంటుంది (వేరియంట్‌ ఆధారంగా మారవచ్చు). విజయవాడలో కూడా ధరలు దాదాపు ఇలానే ఉంటాయి.

మోడల్‌ 
ఫ్రాంక్స్ ‍‌
బాలెనో ‍‌
Alpha 1.2L MT
-
రూ.8.6 లక్షలు
Alpha 1.2L AMT
-
రూ.9.1 లక్షలు
Alpha 1L MT
రూ.10.56 లక్షలు
-
Alpha 1L AT
రూ.11.84 లక్షలు
-

Fronx పనితీరు, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కావాలంటే అదనంగా ఖర్చు పెట్టాలి. Baleno మాత్రం తక్కువ ధరలో మంచి మైలేజ్‌, BNCAP రేటింగ్‌తో ఆకర్షిస్తుంది.

మీకు ఎక్కువ పవర్‌, SUV మాదిరిగా కనిపించే స్టాన్స్‌ కావాలంటే Fronx Alpha సరైన ఎంపిక. కానీ బడ్జెట్‌ ముఖ్యం, మైలేజ్‌ ప్రాధాన్యం అయితే Baleno Alpha మంచి విలువ ఇస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget