అన్వేషించండి

సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునే ముందు ఈ 5 అంశాలు కచ్చితంగా చెక్ చేయండి, లేకపోతే మోసపోతారు!

యూజ్డ్ కార్ కొనుగోలు చేసే ముందు సర్వీస్ హిస్టరీ, ఇన్సూరెన్స్, ఓనర్ వివరాలు, లీగల్ డాక్యుమెంట్స్ వంటి 5 అంశాలు తప్పనిసరిగా చెక్ చేయాలి. లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే ఉంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూజ్డ్ కార్ కొనుగోలుకు ముందు సర్వీస్ హిస్టరీ, ఇన్సూరెన్స్ వివరాలు తప్పక చూడాలి.
  • కారు బాడీ, టైర్లు, బ్రేకులు, అండర్‌బాడీ భాగాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
  • ఓనర్ వివరాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సరిపోలుతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి.
  • లీగల్ పేపర్స్, ఇన్సూరెన్స్, PUC, రోడ్ ట్యాక్స్, లోన్ బకాయిలు చెక్ చేయాలి.

Used Car Buying Tips Telugu: కొత్త కార్ల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో, చాలా మంది యూజ్డ్ కార్‌/సెకండ్‌ హ్యాండ్‌ కార్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేయడం కొంత రిస్క్‌తో కూడుకున్నది. సరిగ్గా పరిశీలించకుండా కొనుగోలు చేస్తే తర్వాత భారీ ఖర్చులు, లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే యూజ్డ్ కార్ తీసుకునే ముందు ఈ ఐదు కీలక అంశాలు తప్పనిసరిగా చెక్ చేయాలి.

1. షోరూమ్ సర్వీస్ హిస్టరీ

కారు ఎంత బాగా మెయింటైన్ చేసారో తెలుసుకోవడానికి సర్వీస్ హిస్టరీ చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా ఆయిల్ మార్పులు, బ్రేక్ సర్వీసింగ్, ప్రధాన రిపేర్ పనులు జరిగాయా లేదా అనే వివరాలు రికార్డుల్లో కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి 10,000 కి.మీ. లేదా సంవత్సరానికి ఒకసారి సర్వీస్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా అధికారిక సర్వీస్ సెంటర్‌లో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ రికార్డులు లేకపోతే జాగ్రత్తగా ఉండాలి.

2. ఇన్సూరెన్స్ హిస్టరీ

కారు ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న IDV (Insured Declared Value) చెక్ చేయాలి. అలాగే నో క్లెయిమ్ బోనస్ ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఏటా నో క్లెయిమ్ బోనస్ ఉంటే ప్రమాదాలు జరగలేదని అర్థం. IDV అకస్మాత్తుగా తగ్గడం లేదా క్లెయిమ్ రికార్డులు ఉంటే గతంలో యాక్సిడెంట్ జరిగిన అవకాశం ఉంది.

3. ఎక్స్‌టీరియర్ కండిషన్

కారు బయట భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. తుప్పు, పెయింట్‌ సమానంగా లేకపోవడం, ప్యానెల్ గ్యాప్‌లు, గ్లాస్‌పై ఉన్న కోడ్ మార్కింగ్‌లు అన్నీ సరిగా ఉన్నాయా చూడాలి. గ్లాస్ మార్చిన గుర్తులు ఉంటే ప్రమాదం జరిగి ఉండవచ్చు. టైర్లు, బ్రేకులు, అండర్‌బాడీ భాగాలు కూడా చెక్ చేయాలి. ఈ భాగాల రిపేర్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

4. ఓనర్ వివరాలు & డాక్యుమెంటేషన్

సింగిల్ ఓనర్ వాహనం అయితే మెరుగైన ఎంపికగా భావించాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ఉన్న పేరు, అడ్రస్ వంటివి ఆ కారు అమ్మేవాళ్ల వివరాలతో సరిపోతున్నాయా చూసుకోవాలి. వాహనం గుర్తింపు వివరాల్లో ఎలాంటి తేడాలు ఉండకూడదు.

5. లీగల్ పేపర్స్ & బకాయిలు

కారు వద్ద చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, PUC సర్టిఫికేట్, రోడ్ ట్యాక్స్ పూర్తిగా చెల్లించారా అని నిర్ధారించాలి. లోన్ బకాయిలు, చలాన్లు లేదా లీగల్ కేసులు లేవని నిర్ధారించుకోవాలి. హైపోథెకేషన్ ఉంటే NOC తీసుకోవాలి. వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేస్తే కూడా NOC అవసరం.

యూజ్డ్ కార్ కొనుగోలు చేయడం మంచి డీల్ కావొచ్చు. కానీ సరైన పరిశీలన లేకపోతే అది పెద్ద నష్టంగా మారుతుంది. పై సూచనలు పాటిస్తే మోసపోకుండా సురక్షితంగా మంచి వాహనం కొనుగోలు చేయవచ్చు. కారు కొనే ముందే, ఆ కారును పరిశీలించడానికి మీకు నమ్మకస్తుడైన మెకానిక్‌ను కూడా వెంట తీసుకువెళ్లండి, తెలివైన నిర్ణయం తీసుకోండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఎలాంటి విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి?

సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు షోరూమ్ సర్వీస్ హిస్టరీ, ఇన్సూరెన్స్ హిస్టరీ, ఎక్స్‌టీరియర్ కండిషన్, ఓనర్ వివరాలు, లీగల్ పేపర్స్ & బకాయిలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

కారు సర్వీస్ హిస్టరీ ఎందుకు ముఖ్యం?

కారు ఎంత బాగా మెయింటైన్ చేశారో తెలుసుకోవడానికి సర్వీస్ హిస్టరీ ముఖ్యం. దీని ద్వారా రెగ్యులర్ ఆయిల్ మార్పులు, బ్రేక్ సర్వీసింగ్, ప్రధాన రిపేర్లు జరిగాయా లేదా తెలుసుకోవచ్చు.

ఇన్సూరెన్స్ హిస్టరీలో ఏయే విషయాలు గమనించాలి?

కారు ఇన్సూరెన్స్ పాలసీలోని IDV, నో క్లెయిమ్ బోనస్ చెక్ చేయాలి. IDV తగ్గడం లేదా క్లెయిమ్ రికార్డులు ఉంటే గతంలో యాక్సిడెంట్ జరిగిన అవకాశం ఉంది.

కారు బయటి భాగాన్ని పరిశీలిచేటప్పుడు ఏమేం చూడాలి?

తుప్పు, పెయింట్ అసమానతలు, ప్యానెల్ గ్యాప్‌లు, గ్లాస్‌పై కోడ్ మార్కింగ్‌లు, టైర్లు, బ్రేకులు, అండర్‌బాడీ భాగాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

లీగల్ పేపర్స్‌లో ఎలాంటివి నిర్ధారించుకోవాలి?

చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, PUC సర్టిఫికేట్, రోడ్ ట్యాక్స్ పూర్తిగా చెల్లించారా అని నిర్ధారించాలి. లోన్ బకాయిలు, చలాన్లు, లీగల్ కేసులు లేవని చూసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
హోండా షైన్‌ 125 ఆన్‌రోడ్‌ రేటు ఎంత? కేవలం రూ.10 వేల డౌన్‌పేమెంట్‌తో 3, 4, 5 ఏళ్ల EMI ప్లాన్స్‌
ఈ పండక్కి Honda Shine 125 కొనాలనుకుంటే లోన్‌ ఎంత వస్తుంది? EMI ఎంత పడుతుంది?
లెవెల్‌ 2 ADAS ఫీచర్లున్న కార్లు మిడిల్‌క్లాస్ బడ్జెట్‌లోనే! ఈ 10 మోడళ్లలో మీకు ఏది నచ్చింది?
జర్నీ టైమ్‌లో అదనపు రక్షణ ఇచ్చే ADAS కార్లు.. మిడిల్‌క్లాస్‌ బడ్జెట్‌లోనే కొనవచ్చు!
రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!
మిడిల్‌క్లాస్ కోసం హ్యుందాయ్ మోడ్రన్ కారు.. క్రెటా కంటే తక్కువ ధరకే కొత్త SUV!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Embed widget