అన్వేషించండి

కొన్ని రోజులు ఆగండి, Maruti తొలి ఎలక్ట్రిక్‌ కారు e Vitara వచ్చేస్తుంది - లేదంటే మంచి ఛాన్స్‌ మిస్‌ అవుతారు!

Maruti e Vitara Battery Option: మారుతి ఇ-విటారాను రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో అందించవచ్చు, అవి - 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్‌లు.

Maruti e Vitara Launch Date: చాలా కాలం ఎదురు చూపుల తర్వాత ఎట్టకేలకు ముహూర్తం దగ్గరకు వచ్చింది. కామన్‌ మ్యాన్‌ కార్ల కంపెనీ మారుతి సుజుకి, తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కారు ఇంకొన్ని రోజుల్లో, అంటే సెప్టెంబర్ 3, 2025న లాంచ్‌ అవుతుంది. లాంచ్‌ కంటే ముందే, ఇ-విటారా ప్రొడక్షన్‌ ఆగస్టు 26, 2025 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ-విటారాను మొదటిసారిగా ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. 

మారుతి ఇ-విటారా డిజైన్ ఎలా ఉంటుంది?
మారుతి ఇ-విటారా డిజైన్ మోడ్రన్‌ & స్పోర్టీ లుక్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, Y-ఆకారపు LED DRLs, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ క్లాడింగ్ & 18-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 

కారు లోపలి భాగం ఎలా ఉంది? 
e-Vitara ఇంటీరియర్‌లో..  డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్ & డ్యూయల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ సెటప్‌ను ఉంటుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. దీర్ఘచతురస్రాకార ఎయిర్ వెంట్స్, ఆటో-డిమ్మింగ్ IRVM, సెమీ-లెథరెట్ సీటింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ & వైర్‌లెస్ ఛార్జింగ్ స్టేషన్ వంటి ఫీచర్లు కూడా ఇ-విటారాలో అందించవచ్చు.

మారుతి ఇ-విటారాకు ప్రీమియం అప్పీల్‌ ఇవ్వడానికి పనోరమిక్ సన్‌రూఫ్, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఏర్పాటు చేస్తారని టాక్‌. భద్రత పరంగా, ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా & ADAS ప్యాకేజీ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.

బ్యాటరీ ఎంపికలు
ఈ ఎలక్ట్రిక్‌ కారులో కీలకమైన బ్యాటరీ ఎంపికల దగ్గరకు వస్తే.. e-Vitara ను 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందించవచ్చు. 49 kWh బ్యాటరీ ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది, 142 bhp పవర్ & 193 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్‌ చేస్తే 344 కి.మీ. వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ ఇవ్వగలదు. 61 kWh బ్యాటరీ ఫ్రంట్-వీల్ డ్రైవ్ & ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ వేరియంట్ 426 కి.మీ. వరకు ప్రయాణించగలదు, 171 bhp పవర్ & 193 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటారును కలిగి ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ 181 bhp పవర్ & 307 Nm టార్క్ ఇస్తుంది, ఇది 395 కి.మీ. వరకు ప్రయాణించగలదని భావిస్తున్నారు.  

మారుతి ఇ-విటారా కారు ఛార్జింగ్ పరంగా కూడా చాలా సులభంగా ఉంటుంది. 49 kWh బ్యాటరీ 7 kW AC ఛార్జర్‌తో దాదాపు 6.5 గంటల్లో & 11 kW ఛార్జర్‌తో 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 61 kWh బ్యాటరీ 7 kW ఛార్జర్‌తో తొమ్మిది గంటలు & 11 kW ఛార్జర్‌తో 5.5 గంటల్లో ఛార్జ్‌ అవుతుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించినప్పుడు ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతాయి.

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!
ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌.. Mahindra XUV 3XO CNG వెర్షన్‌ రాబోతోంది
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget