అన్వేషించండి

కేవలం ₹50,000 కే Tata Tiago మీ సొంతం! - నెలకు ఎంత EMI కట్‌ అవుతుందంటే?

Tata Tiago EMI Plan: టాటా టియాగోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ కారు CNG వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్‌ - రెండు ట్రాన్స్‌మిషన్స్‌లోనూ ఈ కారును కొనవచ్చు.

Tata Tiago Price, Mileage And Features In Telugu: టాటా మోటార్స్ కార్లు ధర పరంగా చౌకగా ఉండటంతో పాటు ఆధునిక ఫీచర్లు & సేఫ్టీ రేటింగ్స్‌లో ముందుంటాయి. అందువల్ల, భారత మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. టాటా బ్రాండ్‌లో, మోడ్రన్‌ ఫీచర్లతో వచ్చిన తక్కువ ధర కారు "టాటా టియాగో". చీప్‌ అండ్‌ బెస్ట్‌ కారు కోరుకునేవాళ్లకు ఇది మంచి ఆఫర్‌ అవుతుంది. అంతేకాదు, మీ జీతం రూ.  30,000 వేల నుంచి ప్రారంభమైనప్పటికీ, మీరు సులభంగా టాటా టియాగో కొనుగోలు చేయవచ్చు. 

టాటా టియాగో కాంపాక్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ అయినప్పటికీ స్టైలిష్‌గా కనిపించే ఆకర్షణీయమైన కారు. ముందు భాగంలో షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ & సిగ్నేచర్‌ గ్రిల్‌ కారు రూపానికి స్పోర్టీ లుక్స్‌ ఇస్తాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో స్మూత్‌ లైన్స్‌ & డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ కారు డిజైన్‌కు ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. వెనుక భాగంలో LED టెయిల్‌ల్యాంప్స్‌ & బోల్డ్‌ బంపర్‌ యువతరాన్ని ఆకట్టుకునేలా స్టైల్‌గా కనిపిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో ధర
మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు (Tata Tiago ex-showroom price, Hyderabad Vijayawada). అయితే, గుడ్‌ న్యూస్‌ ఏంటంటే.. మీరు టాటా టియాగో కారును సొంతం చేసుకోవడానికి ఈ డబ్బు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 50,000 డౌన్ పేమెంట్ చెల్లించి కారు తాళాలు మీ జేబులో వేసుకోవచ్చు. అంటే, ఈ కారును కార్‌ లోన్‌/ఫైనాన్స్‌ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంది. 

హైదరాబాద్‌లో, టాటా టియాగో బేస్ XE (పెట్రోల్) మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 6.03 లక్షలు (Tata Tiago on-road price, Hyderabad). ఈ ధరలో RTO ఛార్జీలు దాదాపు రూ. 72,000 & బీమా రూ. 30,000, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉన్నాయి. విజయవాడలో, టాటా టియాగో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 6.05 లక్షలు (Tata Tiago on-road price, Vijayawada). తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన నగరాల్లోనూ దాదాపుగా ఇదే రేటు ఉంటుంది.

హైదరాబాద్‌లో, టాటా టియాగో బేస్‌ వేరియంట్‌ కోసం మీరు రూ. 50,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 5.53 లక్షల కారు లోన్ తీసుకోవాలి. బ్యాంకు నుంచి 9% వడ్డీ రేటుతో ఈ లోన్‌ పొందారని అనుకుందాం. 

Tata Tiago EMI ఆప్షన్స్‌

7 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, మీ EMI నెలకు రూ. 8,897 అవుతుంది. 

6 సంవత్సరాల్లో కార్‌ లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే, మీ EMI నెలకు రూ. 9,968 అవుతుంది. 

5 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే, మీ EMI నెలకు రూ. 11,479 అవుతుంది. 

4 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ ఎంచుకుంటే, మీ EMI నెలకు రూ. 13,761 అవుతుంది. 

మీ నెలవారీ జీతం/ఆదాయం రూ. 30,000 - రూ. 40,000 మధ్య ఉంటే, 7 సంవత్సరాల EMI ప్లాన్ మీకు ఉత్తమంగా ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల సలహా.

బ్యాంక్‌ ఇచ్చే లోన్‌ మొత్తం, వార్షిక వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంక్‌ విధానంపై ఆధారపడి ఉంటాయి.

Tata Tiago CNG 
టాటా టియాగోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది & CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ వస్తుంది. ARAI ప్రకారం, పెట్రోల్ వెర్షన్‌లో దీని మైలేజ్ లీటరుకు 20.09 కిలోమీటర్లు, CNG వెర్షన్‌లో మైలేజ్ కిలోగ్రాముకు 28 కిలోమీటర్లు. CNG మోడ్‌ ఎంచుకున్నవాళ్లకు ఇంధన ఖర్చులు బాగా తగ్గుతాయి.

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget